Jump to content

Samara nuvvu inkaa ee news chudaleda


sarfaroshi2

Recommended Posts

8 hours ago, Android_Halwa said:

Iyanni manakenduku….evadu enni egg puffs tinnaru anede kavali…

#Sendra_Pradesh

Oka company lo reactor pelindi… adi government tappu ante pakka state paytms ki emi ivagalam… rs5 paytm tappa

 

 

Link to comment
Share on other sites

YSRCP: పాల‌న‌లో చంద్ర‌బాబు బేల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది.. అచ్యుతాపురం ఘటనపై వైసీపీ ట్వీట్‌! 

22-08-2024 Thu 06:29 | Andhra
YSRCP Tweet on Atchutapuram SEZ accident in Andhra Pradesh
 

 

  • అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు
  • 17 మంది మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
  • చంద్ర‌బాబు 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం అని మండిపాటు
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో 17 మంది మృతిచెందారు. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బాధితులు ప్ర‌స్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. రియాక్ట‌ర్ పేలుడు ధాటికి కంపెనీ పైక‌ప్పు కూలిపోవ‌డంతో పాటు అక్క‌డ ప‌నిచేసే కార్మికులు 30 నుంచి 50 మీట‌ర్ల దూరం ఎగిరిప‌డ్డారు. దాంతో కార్మికుల శ‌రీర భాగాలు చెల్లా‌చెదురుగా ప‌డిపోయాయి. దీంతో కంపెనీ ప‌రిస‌రాల‌లో భయాన‌క దృశ్యాలు క‌నిపించాయి. 

ఈ ఘటనపై వైసీపీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఘాటుగా స్పందించింది. ప్రమాదం గురించి కనీసం సమాచారాన్ని కూడా తీసుకోలేని అలసత్వంతో కూట‌మి ప్రభుత్వం ఉందని విమర్శించింది. ఇది పాలనలో చంద్రబాబు బేలతనానికి నిదర్శనం అని.. 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం అని మండిప‌డింది.

అచ్యుతాపురం అగ్నిప్రమాదంపై ప్రభుత్వం ఉదాసీన‌త‌గా వ్య‌వ‌హ‌రించిందంటూ విమ‌ర్శించింది. ఘటన జరిగిన సుమారు 5 గంటల తర్వాత సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ ప్రెస్ మీట్ పెట్టారని పేర్కొంది. ముగ్గురు మాత్రమే చనిపోయారని, 25 మందికి మాత్రమే గాయాలు అయ్యాయని ఘటనను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. వివరాలు ఇంకా తెలియాల్సి వుందనే క్లారిటీ లేని కామెంట్ చేశారని చెప్పుకొచ్చింది. 

ఆ స్థాయిలో ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం దారుణమ‌ని పేర్కొంది. అదే ప్రెస్ మీట్‌లో జగన్ ప్రభుత్వంపై పనికిమాలిన ఆరోపణలు చేశారంటూ మండిపడింది. 30 కిలోమీటర్ల దూరంలోని విశాఖకు కాకుండా అనకాపల్లిలోని ఆసుప‌త్రికి బాధితులను తరలించడం ఏంట‌ని విమ‌ర్శించింది. తమను విశాఖపట్నం తీసుకెళ్లాలని బాధితులు వేడుకున్నారని, అనకాపల్లిలో ఆసుప‌త్రుల్లో వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపించారని బాధితులు అధికారుల ముందు గగ్గోలు పెడుతున్నారని వైసీపీ త‌న ట్వీట్‌లో పేర్కొంది.
  • Sad 1
Link to comment
Share on other sites

chusara my dear jaffa pakka state paytms
Ee daridram lo kuda nista daridrudi hand undi indirect ga

Achyutapuram Sez Fire Accident: జగన్ పాపమే కార్మికుల పాలిట శాపం: టీడీపీ 

22-08-2024 Thu 12:45 | Andhra
Achyutapuram Sez Fire Accident TDP Fires on YSRCP
 

 

  • అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్ర‌మాదం
  • 17 మంది మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
  • ఈ నేప‌థ్యంలో 'ఎక్స్' వేదిక‌గా గ‌త‌ వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ విమ‌ర్శ‌
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో సంభ‌వించిన ప్ర‌మాదం రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ ప్ర‌మాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయితే, ప్రమాదానికి కారణం గత ప్రభుత్వమేనని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా టీడీపీ ఆరోపించింది.

ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్‌ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తానని గతంలో జగన్ చెప్పారని, అది కూడా సరిగ్గా చేయించకపోవడం వల్లే ఇప్పుడీ ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ పేర్కొంది. సేఫ్టీ లొసుగులు ఉన్న కంపెనీల‌ను బెదిరించి డ‌బ్బులు దండుకున్నారు. అందుకే ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వైసీపీ హయాంలో వరుసగా 15 ప్రమాదాలు జరిగాయని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ కు ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ప్ర‌మాదం తాలూకు దృశ్యాల‌తో ఒక ఫొటోను జ‌త చేసింది. దానిపై 'జ‌గ‌న్ పాప‌మే కార్మికుల పాలిట శాపం' అనే లైన్‌ను టీడీపీ హైలైట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది
Link to comment
Share on other sites

Chandrababu: నేడు అచ్యుతాపురం ప్రమాద స్థలానికి సీఎం చంద్రబాబు .. విశాఖ టూర్ షెడ్యూల్ ఇలా..! 

22-08-2024 Thu 09:03 | Andhra
today cm chandrababu to achyutapuram accident site
 

 

  • రియాక్టర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య
  • క్షతగాత్రులు, బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరామర్శ
  • ప్రమాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (గురువారం) అచ్యుతాపురం వెళ్లనున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ లో రియాక్టర్ పేలుడుతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు వెళుతున్నారు. 
 
ఉదయం 10.30 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుండి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. 11.40 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి నావల్ కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా 12.10కి వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రికి చేరుకుంటారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి, వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. 

అనంతరం సీఎం చంద్రబాబు కోస్టల్ బ్యాటరీకి చేరుకొని హెలికాఫ్టర్ లో అచ్యుతాపురం సెజ్ కి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్ పోర్టు నుండి విజయవాడ బయలుదేరి ఉండవల్లి నివాసానికి సాయంత్రం 4.20కి చంద్రబాబు చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.
Link to comment
Share on other sites

Anakapalli Mishap: అనకాపల్లి ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ విచారం.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌! 

22-08-2024 Thu 08:55 | National
PM Modi condoles loss of 17 lives in Anakapalli mishap announces Rs 2 lakh Exgratia
 

 

  • ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి
  • ఎక్స్ వేదిక‌గా మృతుల‌కు సంతాపం తెలిపిన‌ ప్రధాని మోదీ 
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 17 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

"అనకాపల్లిలోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో భారీ మొత్తంలో ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌డం తీవ్రంగా బాధించింది. దగ్గరి, ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.  మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్‌ నుండి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జ‌రుగుతుంది. అలాగే క్షతగాత్రులకు రూ. 50,000 అందజేస్తాం" అని పీఎంవో ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఘ‌ట‌నాస్థ‌లిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగలు రెస్క్యూ టీమ్‌లను ప్రాంగణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయని, చాలా మంది వ్యక్తులు లోపల చిక్కుకున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న‌ వారిని చేరుకోవడానికి బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని మంత్రి చెప్పారు.
Link to comment
Share on other sites

Daridura ninu last time gelipinchinaduku inka anubhavistunaru… monna dam gate… ivala idi.. inka enni vastai oo

 

YS Jagan: అచ్యుతాపురం ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి 

22-08-2024 Thu 06:32 | Andhra
ys jagan responded on pharma company fire accident in anakapalle district
 

 

  • మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించాలన్న జగన్ 
  • గాయపడిన వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని సూచన 
  • ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్  
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా 17 మంది అసువులు బాయగా, మరి కొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
 
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని కోరారు. వారు కోలుకునేంత వరకూ ఆర్ధిక సహాయం చేయాలని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.  
Link to comment
Share on other sites

Chandrababu: మృతుల కుటుంబాలకు రూ. కోటి చెప్పున పరిహారం ప్రకటించిన చంద్రబాబు 

22-08-2024 Thu 16:11 | Andhra
Chandrababu in Vizag
 

 

  • అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన చంద్రబాబు
  • ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ
  • వైసీపీ తప్పులు చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపాటు
అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈరోజు విశాఖపట్నం చేరుకున్న ఆయన... నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. 
 
అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఎవరూ భయపడొద్దని, దైర్యంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ... ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చెప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు మాత్రమే అవుతోందని... ఈ ప్రమాదానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. వైసీపీ తప్పులు చేసి... ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు.
Link to comment
Share on other sites

Pawan Kalyan: సంతాపం తెలిపి, పరిహారం ఇస్తే సరిపోదు: పవన్ కల్యాణ్ 

22-08-2024 Thu 12:12 | Andhra
Pawan Kalyan comments on pharma company accident
 

 

  • అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదం బాధాకరమన్న పవన్
  • సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలుస్తోందని వ్యాఖ్య
  • ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్న పవన్
అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రమాదం వెనుక సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామని అన్నారు. ప్రజలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని చెప్పారు. కాలుష్య నియంత్రణ శాఖ తన పరిధిలో ఉందని... భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని అన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధను కలిగిస్తోందని పవన్ చెప్పారు. సంతాపం తెలిపి, పరిహారం ఇస్తే సరిపోదని అన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. 

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పవన్ తెలిపారు. పంజాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతంపై ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిందని చెప్పారు. పంచాయతీ రాజ్ మలిదశ సంస్కరణలు మొదలుపెట్టామని తెలిపారు. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...