Jump to content

జైత్ర యాత్ర


AndhraPickles

Recommended Posts

హీరో, విలన్ గా అన్ని తరహా వేషాలతో ఆకట్టుకున్న చిరంజీవి ఖైదీ (1983) అనే బ్లాక్ బస్టర్ ద్వారా ఒకే దెబ్బతో యువతకు ఐకాన్ గా మారడం చూసి తలలు పండిన సీనియర్ హీరోలు ఆశ్చర్యపోయేలా చేసింది. బాడీలో స్ప్రింగులు ఉన్నాయా అనిపించేలా డాన్సులు వేగంగా చేయడం చూసి మాస్ వెర్రెత్తిపోయారు. ఛాలెంజ్ (1984) ద్వారా నిరాశలో ఉన్నవాళ్లకు స్ఫూర్తినిస్తే విజేత (1985) తో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. పసివాడి ప్రాణం (1987) లాంటి చైల్డ్ సెంటిమెంట్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం చరిత్రగా చెప్పుకున్నారు. మాస్ మొగుడుకి పర్యాయపదంగా మార్చుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని తుఫాను ముంచేసినప్పుడు మోకాలి లోతు థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సాధ్యం చేసి చూపించింది. ఫ్యామిలీ కంటెంట్ లో మాస్ ఎలిమెంట్స్ జొప్పిస్తే కనక వర్షం ఖాయమని గ్యాంగ్ లీడర్ (1991) నిరూపిస్తే ఘరానా మొగుడు (1992) బాక్సాఫీస్ కి తొలి పది కోట్ల గ్రాసర్ గా కొత్త గ్రామర్ గా నేర్పించింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు బ్రేక్ ఇస్తే అయిదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా హిట్లర్ (1997) తో కంబ్యాక్ ఇవ్వడం అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు సైతం మర్చిపోలేరు. అక్కడి నుంచి అప్రతిహత జైత్ర యాత్ర కొనసాగింది.

డాడీ, మృగరాజు లాంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డుతగిలినా తిరిగి ఇంద్ర (2002) తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించడం గురించి పేజీల కొద్దీ రాయొచ్చు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన కోసం శంకర్ దాదా జిందాబాద్ (2008) తర్వాత ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్న చిరంజీవి తిరిగి ఖైదీ నెంబర్ 150 (2017) తో బలమైన కంబ్యాక్ ఇవ్వడం ఫ్యాన్స్ మర్చిపోలేని జ్ఞాపకం. చిరకాల వాంఛ సైరా నరసింహారెడ్డి (2019) ని తెరమీద చూసుకోవడం ఆయన సాధించిన మరో మైలురాయి. వాల్తేరు వీరయ్య (2022) బ్లాక్ బస్టర్ ద్వారా విజయాల తృష్ణ తనలో ఇంకా తీరలేదని నిరూపించారు.

సినిమాలన్నీ ఒక ఎత్తయితే రక్తదానం, నేత్రదానం గురించి జనంలో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చిలక్షలాది జీవితాల్లో వెలుగు నింపేందుకు చిరంజీవి కారణమయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అనుభవం గడిoచి, కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయన కీర్తి కిరీటానికి మచ్చు తునకలు. హీరోని మించి ఒక వ్యక్తిగా వ్యక్తిత్వంతో ఆకట్టుకునే చిరంజీవి ఎక్కిదిగని ఎత్తుపల్లాలు లేవు. చూడని జయాపజయాలు లేవు. అందుకే ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఈ ‘చిరు’  జీవితం....

Link to comment
Share on other sites

4 minutes ago, socrates said:

his last decent film was shenkar daada mbbs, since after that movie everything is just a hype

Stalin katarnak movie

Link to comment
Share on other sites

1 hour ago, AndhraPickles said:

ఉమ్మడి రాష్ట్రాన్ని తుఫాను ముంచేసినప్పుడు మోకాలి లోతు థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సాధ్యం చేసి చూపించింది.

Lol..toofan ochina kuda cinema ne sustham antaru..

Emi nautanki batch ra ayya…bhajana cheyanika common sense kuda avasaram ledu ani malli malli prove chestaru

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Lol..toofan ochina kuda cinema ne sustham antaru..

Emi nautanki batch ra ayya…bhajana cheyanika common sense kuda avasaram ledu ani malli malli prove chestaru

Pawan Kalyan Politics GIF by Jagananna Connects

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...