Jump to content

yuvajana srungara rakisukula chilipi party nundi jumpings list..


psycopk

Recommended Posts

Ayodhya Ramireddy: ఆయనకు ఎన్నో పదవులు ఇచ్చాం... పార్టీ మారితే విలువ ఉండదు: అయోధ్య రామిరెడ్డి

30-08-2024 Fri 17:11 | Andhra
I will never leave YSRCP says Ayodhya Ramireddy

 

  • 10 మంది రాజ్యసభ సభ్యులు వెళ్లిపోతున్నారనే వార్తల్లో నిజం లేదన్న రామిరెడ్డి
  • ఒకరిద్దరు పోయినంత మాత్రాన నష్టం లేదని వ్యాఖ్య
  • తాను పార్టీ వీడే ప్రసక్తే లేదన్న రామిరెడ్డి

వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ ఉండదని చెప్పారు. వాళ్లు స్వలాభం కోసం వెళితే... తాము పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తామని అన్నారు. 

పదవి అంటే బాధ్యత, త్యాగంతో కూడుకున్నదని చెప్పారు. ఈ రోజుల్లో పార్టీలను నడపడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు. అన్నీ అనుకున్నట్టే జరగాలనుకుంటే రాజకీయాల్లో కుదరదని చెప్పారు. 

తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని రామిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా జగన్ వెంటే ప్రయాణం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మోపిదేవికి ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ వంటి పదవులు ఇచ్చామని... ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పార్టీ మారితే విలువ ఉండదని అన్నారు. 

తమ వ్యక్తిత్వాలను దెబ్బతీసే వార్తలు రాసి, తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. సామాన్యుల కోసం ఆలోచించే వ్యక్తి జగన్ అని... వాళ్ల కోసమే జగన్ పార్టీ పెట్టారని చెప్పారు.
Link to comment
Share on other sites

Pilli Subhas Chandra Bose: జగన్ తోనే ఉంటా... వెన్నుపోటు పొడవలేను: పిల్లి సుభాష్ చంద్రబోస్

30-08-2024 Fri 14:53 | Andhra
I will be with Jagan says Pilli Subhash Chandra Bose

 

  • పిల్లి సుభాష్ వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం
  • తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినన్న సుభాష్
  • తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు హితవు

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సుభాష్ చంద్రబోస్ స్పందించారు. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని ఆయన అన్నారు. వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని, తాను జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. 

నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నానన్నారు. తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ విన్నవించారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. వైసీపీని వీడే ఆలోచన తనకు కలలో కూడా లేదని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

R Krishnaiah: వైసీపీకి గుడ్ బై చెపుతున్నారా?... ఆర్ కృష్ణయ్య ఏమన్నారు?

30-08-2024 Fri 14:12 | Both States
R Krishnaiah response on news on quitting YSRCP

 

  • వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి, బీద మస్తాన్ రావు
  • ఆర్. కృష్ణయ్య కూడా పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం
  • వైసీపీని వీడే ప్రసక్తే లేదన్న కృష్ణయ్య

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ... పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని... వాళ్ల మాదిరి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. జగన్ తనను గౌరవించారని... అందుకే తొలి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నానని అన్నారు. బీసీల కోసం కొట్లాడమనే ఆయన తనను రాజ్యసభకు పంపించారని చెప్పారు. తాను చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతానని చెప్పారు. 

సొంత వ్యాపారాలు, స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీలు మారుతుంటారని... వారి మాదిరి పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని కృష్ణయ్య అన్నారు. తన బీసీ సంఘమే తనకు పార్టీ అని చెప్పారు. 
Link to comment
Share on other sites

Golla Babu Rao: జగన్ నన్ను రాజ్యసభకు పంపించారు... తప్పుడు ప్రచారం బాధ కలిగిస్తోంది: గొల్ల బాబూరావు 

31-08-2024 Sat 16:20 | Andhra
Jagan sent me to Rajya Sabha says Golla Babu Rao
 

 

  • వైసీపీని వీడుతున్నానన్న ప్రచారంలో నిజం లేదన్న బాబూరావు
  • తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం బాధను కలిగిస్తోందని వ్యాఖ్య
  • నీతి, నిజాయతీ కలిగిన వ్యక్తిత్వం తనదన్న బాబురావు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

తాను దళితుడిని కాబట్టే తనపై ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారం ఎంతో బాధిస్తోందని తెలిపారు. 

వైఎస్ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని బాబూరావు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎమ్మెల్యే పదవి ఇస్తే... జగన్ తనను రాజ్యసభకు పంపించారని అన్నారు. వైఎస్ మరణించిన తర్వాత తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని... జగన్ పట్ల తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని చెప్పారు. 

నీతి, నిజాయతి కలిగిన వ్యక్తిత్వం తనదని అన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని... వైసీపీలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను ప్రచారం చేస్తానని తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...