psycopk Posted August 31 Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted August 31 Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Chandrababu: కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి... రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు 31-08-2024 Sat 18:25 | Andhra విజయవాడలో భారీ వర్షాలు మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మేఘన, లాలు, బోలెం లక్ష్మి, అన్నపూర్ణ అనే వ్యక్తులు మరణించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. విజయవాడలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ లో ఈ ఉదయం కొండచరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. కాగా, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Chandrababu: ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష 31-08-2024 Sat 14:59 | Andhra బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీలో విస్తారంగా వర్షాలు ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దు అమరావతి నుంచి ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటనుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా, తమ్మిలేరు, గోస్తనీ, ఏలేరు, వంశధార, శబరి, వరాహ, శారద, సువర్ణముఖి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బ్యారేజీలు, రిజర్వాయర్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్నారు. ఓర్వకల్లులో ఆయన ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. వర్షాల కారణంగా చంద్రబాబు అమరావతి నుంచి సమీక్ష చేపట్టారు. దాంతో ఓర్వకల్లులో సీఎం పాల్గొనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దు చేశారు. కాగా, ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో, పలు శాఖల అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రజల ఇబ్బందులు తగ్గించవచ్చని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ చెరువుల పరిస్థితిని పరిశీలించాలని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పట్టణాల్లో రోడ్లపైకి నేరు చేరి ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని... ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. భారీ వర్షాలపై ప్రజలకు ఫోన్ల ద్వారా అలర్ట్ సందేశాలు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కల్పించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా, తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూడడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన చోటుచేసుకుందని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థంగా పనిచేయాలని నిర్దేశించారు. జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
11_MohanReddy Posted August 31 Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Pawan Kalyan: భారీ వర్షాలు కురుస్తున్నాయి... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 31-08-2024 Sat 22:16 | Andhra ఏపీలో భారీ వర్షాలు సహాయక చర్యల్లో కూటమి పార్టీల శ్రేణులు పాలుపంచుకోవాలన్న పవన్ అధికారులకు సహాయంగా ఉండాలని పిలుపు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందడంపై విచారం రాష్ట్రంలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు అందించే ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని... వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటునివ్వాలని సూచించారు. ఇక, విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, మృతి చెందినవారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పవన్ వెల్లడించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని అధికారులు తెలియజేశారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 AP Rains: ఏపీలో నేడు కుమ్మేసిన వానలు... జిల్లాకు రూ.3 కోట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు 31-08-2024 Sat 21:42 | Andhra బంగాళాఖాతంలో వాయుగుండం గత రాత్రి నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంమీ వర్షపాతం నమోదు ఉన్నతాధికారులతో మరోసారి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండడంతో, గత రాత్రి నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 17.8, మంగళగిరిలో 15.4, ఏలూరు జిల్లా నూజివీడులో 15, బాపట్ల జిల్లాలో 11, పల్నాడు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై సమీక్షిస్తున్నారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణ సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది చనిపోయినట్టు అధికారులు వివరించారు. బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నందున ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటనున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్ర ప్రజలను అప్రమత్తం చేయాలని, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాయుగుండం తీరం దాటేటప్పుడు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటే వేళ గాలులపై స్పష్టమైన అంచనాలతో ఉండాలని సీఎం చంద్రబాబు అధికార వర్గాలకు సూచించారు. వాయుగుండం వేగం, ప్రయాణ దిశకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గే వరకు బయటికి రావొద్దని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో, ప్రజలు రేపు కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పట్టణాల్లో నీరు నిలిచిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను పొక్లెయిన్లతో తొలగించాలని ఆదేశించారు. ఓపెన్ డ్రెయిన్లు ఉండే చోట హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వంతెనలపై రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. కాగా, విజయవాడ రోడ్ల నుంచి నీటిని బయటకు పంపే చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని తెలిపారు. తుపాను భవనాలు సిద్ధం చేసి ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని చంద్రబాబు ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో అమలు చేసిన విధానాలను అనుసరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
Yuvasamudram Posted August 31 Report Share Posted August 31 Eee daridrudu vasthe edo okati jaruguthadi. Appudu Vizag ippudu Vijawada. 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
DallasKarreBaluGadu Posted August 31 Report Share Posted August 31 1 minute ago, psycopk said: Started early morning India time, you are best slave for balio munda Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Author Report Share Posted August 31 Kodada: నందిగామలో పొంగిన వాగు... హైదరాబాద్-విజయవాడ వాహనాలు దారి మళ్లింపు 31-08-2024 Sat 22:31 | Both States కొన్నిరోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు వాహనాలను దారి మళ్లించడంతో కోదాడ వద్ద ట్రాఫిక్ జామ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగుతుండటంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు. ఈ రోడ్డు నిత్యం వాహనాలతో హడావుడిగా కనిపిస్తుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ వద్ద వాగు పొంగింది. జాతీయ రహదారి పైకి నీరు చేరింది. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి - అద్దంకి రహదారికి మళ్లించారు. దీంతో కోదాడ - జగ్గయ్యపేట మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.