Jump to content

Pawan Kalyan: ఇప్పుడు అదే విజయవాడకు శాపంగా మారింది: పవన్ కల్యాణ్


psycopk

Recommended Posts

Pawan Kalyan: ఇప్పుడు అదే విజయవాడకు శాపంగా మారింది: పవన్ కల్యాణ్ 

04-09-2024 Wed 16:05 | Telangana
Pawan Kalyan about floods in Andhra Pradesh
 

 

  • బుడమేర 90 శాతం ఆక్రమణకు గురైందన్న పవన్ కల్యాణ్
  • క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబు
  • వైసీపీ నేతలు విమర్శలు మాని సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచన
బుడమేరులోని 90 శాతం ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు.

ఈ వయస్సులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లను ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పని చేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు సహాయక చర్యల్లో పాల్గొని, ఆ తర్వాత విమర్శలు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు.

తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. తాను ఆ ప్రాంతాలకు వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయన్నారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటుందని చెప్పడం వల్ల తాను వెళ్లడం లేదన్నారు. తాను పర్యటించకపోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.

వైసీపీ నేతలు తనతో వస్తానంటే తన కాన్వాయ్‌లోనే తీసుకు వెళ్తానన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, రాష్ట్రానికి చెందిన అంశమన్నారు. కాబట్టి వైసీపీ నేతలు సహాయం చేసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు.

సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కూడా పాల్గొంటుందన్నారు. 175 బృందాలు విజయవాడ పట్టణ ప్రాంతంలో పని చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చారన్నారు. వరదల కారణంగా ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా దెబ్బతిన్నట్లు చెప్పారు. 26 ఎన్డీఆర్ఎఫ్, 24 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. నేవీ నుంచి 2, ఎయిర్ ఫోర్స్ నుంచి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

Pawan Kalyan: తెలంగాణకు రూ.1 కోటి, ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్ 

04-09-2024 Wed 16:42 | Both States
Pawan Kalyan donates rs 1 crore to telangana
 

 

  • తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్
  • ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి ప్రకటించిన ఏపీ డీప్యూటీ సీఎం
  • 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున విరాళం
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి రూపాయలు ఇస్తానన్నారు. అలాగే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.1 కోటి ఇస్తానని ప్రకటించారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు మొత్తంగా రూ.6 కోట్లు ఇస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

 

Ram Charan: వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన రామ్ చ‌ర‌ణ్‌ 

04-09-2024 Wed 17:01 | Both States
Ram Charan announces Rs 1 crore aid to Telangana and AP
 

 

  • భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
  • ఆదుకునేందుకు ముందుకు వచ్చిన చిత్ర పరిశ్రమ
  • భారీ విరాళం ప్రకటించిన రామ్ చరణ్
  • తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షల విరాళం
వరద బీభత్సంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఊహించ‌ని విధంగా ఆస్తిన‌ష్టం జ‌రిగింది. వీరిని ఆదుకోవ‌టానికి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారికి త‌మ వంతు సాయంగా నిల‌వ‌టానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ముందుకు వ‌చ్చింది. 

ఈ క్ర‌మంలో హీరో రామ్ చ‌ర‌ణ్ సైతం త‌న‌వంతుగా కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఇందులో ఆయ‌న ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.50 ల‌క్ష‌లు, తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ.50 ల‌క్ష‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. 

‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. 

కాగా,  తండ్రి చిరంజీవి లాగానే సేవా బాట‌లో ప్ర‌యాణిస్తూ రామ్ చ‌ర‌ణ్ తెలుగు వారి కోసం కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించటంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

 

 

Link to comment
Share on other sites

29 minutes ago, psycopk said:

 

Pawan Kalyan: తెలంగాణకు రూ.1 కోటి, ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్ 

04-09-2024 Wed 16:42 | Both States
Pawan Kalyan donates rs 1 crore to telangana
 

 

  • తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్
  • ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి ప్రకటించిన ఏపీ డీప్యూటీ సీఎం
  • 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున విరాళం
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి రూపాయలు ఇస్తానన్నారు. అలాగే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.1 కోటి ఇస్తానని ప్రకటించారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు మొత్తంగా రూ.6 కోట్లు ఇస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

Why yaaa chakkaga govt nunchi fund release cheyochu kadaa ycp laga... inka personal money deniki 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...