Jump to content

Chandrababu -అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలి: సీఎం చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu -అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలి: సీఎం చంద్రబాబు 

04-09-2024 Wed 18:52 | Andhra
CM Chandrababu fires on YCP over flood issues
 

 

  • వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ఫుల్ బిజీ
  • వరదలపై ప్రజలను భయపెట్టేలా వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యలు
  • ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపు
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో వరద సహాయక చర్యల పర్యవేక్షణలో తలమునకలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీపై ధ్వజమెత్తారు. అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలని అన్నారు. వరదలపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ నేరస్తులను, తప్పుడు ప్రచారం చేసేవాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. 

ప్రజల కోసం పాటుపడుతుంటే రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు... ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు రాక్షసులతో పోరాడుతున్నా... క్షమాపణ చెప్పేవరకు వాళ్లను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. 

బుడమేరు గండ్లు ఇంకా పూడ్చాల్సి ఉందని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడకు బుడమేరు ఓ సమస్యగా మారిందని అన్నారు. కృష్ణా నది కంటే బుడమేరుతోనే విజయవాడకు తీవ్ర నష్టం అని తెలిపారు. బుడమేరు వాగును ఆక్రమించారని, 2019 నుంచి ఆక్రమణలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం గాడిదలు కాసిందా? అంటూ మండిపడ్డారు. 

బుడమేరు ఆక్రమణలపై సర్వే చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్లను కూడా తవ్వేశారని తెలిపారు. వైసీపీ తప్పులకు అమాయకులు వేదనకు గురయ్యారని, ఓ వ్యక్తి అహంభావానికి ప్రజలు ఇబ్బందులు పడాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. అందరికీ నాణ్యమైన ఆహారం అందజేస్తామని, ముంపు ప్రాంతాల్లో ఆహారంతో పాటు తాగునీరు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. 8 లక్షల వాటర్ బాటిల్స్ అందించామని చెప్పారు. కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అధికారులందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు.

వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడానని, వరద ప్రాంతాల్లో పర్యటించాలని కోరానని వెల్లడించారు. 

రేపు ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుందని భావిస్తున్నామని వెల్లడించారు. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల వరద వస్తే విజయవాడకు మరింత ప్రమాదం అని అన్నారు.
Link to comment
Share on other sites

Nara Lokesh: నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు 

04-09-2024 Wed 14:56 | Andhra
Chandrababu key orders to Nara Lokesh
 

 

  • బుడమేరు గండ్లను పూడ్చే కార్యక్రమాలను పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • గండ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న లోకేశ్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న లోకేశ్
విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను పూడ్చివేసే కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేశ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నారా లోకేశ్ రంగంలోకి దిగారు. బుడమేరు కుడివైపు, ఎడమవైపు పడిన గండ్ల గురించి అధికారులను అడిగి వివరాలను లోకేశ్ తెలుసుకున్నారు. గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు లోకేశ్ బుడమేరు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. విజయవాడలో వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

నిన్న రాత్రి, ఈ ఉదయం ఎగువన కురిసిన వర్షాల వల్ల బుడమేరుకు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... కొండపల్లి శాంతినగర్ వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తెగిందని చెప్పారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నవారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను జక్కంపూడి కాలనీ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో వరద బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నానని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు.
Link to comment
Share on other sites

Chandrababu: ప్రధాని మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు 

04-09-2024 Wed 21:08 | Andhra
CM Chandrababu thanked PM Modi and Amit Shah
 

 

  • ఏపీలో వరద నష్టం అంచనాకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
  • ప్రత్యేక బృందాన్ని స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు
  • వారు చేసే సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి 
ఏపీలో వరద పరిస్థితులపై సత్వరమే స్పందించారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

వరద బాధితులకు తక్షణ సాయం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రాకను స్వాగతిస్తున్నామని, వారు చేసే సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. 

కాగా, ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు, తగిన సిఫారసులు చేసేందుకు కేంద్రం నేడు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ అదనపు కార్యదర్శి ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు.
Link to comment
Share on other sites

 

Nimmala Rama Naidu: గండ్లు పూడ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను: నిమ్మల రామానాయుడు 

04-09-2024 Wed 21:04 | Andhra
Nimmala Rama Naidu on Vijayawada floods
 

 

  • బుడమేరుకు మూడు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయన్న నిమ్మల
  • వరదలకు ఇదే కారణమన్న మంత్రి
  • బుడమేరు నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శ
బుడమేరుకు మూడు ప్రాంతాల్లో గండ్లు పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గండ్లు పూడ్చేంత వరకు తాను ఇక్కడి నుంచి కదలనని చెప్పారు. 

సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పారు. విజయవాడ వరదలకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. 

 

 

Link to comment
Share on other sites

Pawan Kalyan: ఈ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి లోతట్టు ప్రాంతాలకు వెళ్లడం ప్రశంసనీయం: పవన్ కల్యాణ్ 

04-09-2024 Wed 17:38 | Andhra
Pawan Kalyan appreciated CM Chandrababu who works tirelessly
 

 

  • విజయవాడలో వరదలు
  • జేసీబీ ఎక్కి సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు
  • వైసీపీ నుంచి విమర్శలు
  • వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలన్న డిప్యూటీ సీఎం పవన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు లోతట్టు ప్రాంతాలకు జేసీబీ ఎక్కి వెళ్లడం తెలిసిందే. అయితే, వైసీపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఎంతో క్లిష్ట  పరిస్థితుల్లోనూ చంద్రబాబు సమర్థవంతంగా పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. మామూలుగా చేరలేని ప్రాంతాలకు... ఈ వయసులోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు బుల్డోజర్లు ఎక్కి, పొక్లెయినర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి వెళుతున్నారని కితాబిచ్చారు. దీన్ని అభినందించాల్సింది పోయి, విమర్శించడం సరికాదని, ఈ పద్ధతి మార్చుకోవాలని వైసీపీ నేతలకు పవన్ హితవు పలికారు. 

"వైసీపీ నాయకులకు నా విజ్ఞాపన, నా విన్నపం. ఇది విమర్శించేందుకు సమయం కాదు. ఇది మనందరి ఉమ్మడి సమస్య... రాష్ట్ర సమస్య ఇది. మీరు కూడా బయటికి వచ్చి, నడుం వంచి సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

Akkineni Family: తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన నాగార్జున 

04-09-2024 Wed 21:52 | Both States
Akkineni family announces Rs 1 crore assistanse to AP and Telangana
 

 

  • తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం
  • రూ.1 కోటి విరాళం ప్రకటించిన అక్కినేని ఫ్యామిలీ
  • ఈ సవాలును నిబ్బరంగా ఎదుర్కొందామన్న నాగార్జున
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు కుదిపేయడం పట్ల అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. రూ.1 కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్టు అక్కినేని నాగార్జున వెల్లడించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను వేగంగా చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు మనమంతా సంఘటితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సవాలును నిబ్బరంగా ఎదుర్కొందామని, బలంగా నిలుద్దామని నాగార్జున పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

Sai Dharam Tej: రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన సాయి దుర్గా తేజ్ 

04-09-2024 Wed 21:43 | Entertainment
Sai Durga Tej donations to AP and TG
 

 

  • రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సాయి తేజ్
  • అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షల విరాళం
  • విపత్తు కష్టాలు త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్నానన్న సాయి తేజ్
కుండపోత వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. రెండు రాష్ట్రాలకు భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి దుర్గా తేజ్ రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. 

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నట్టు సాయి తేజ్ ప్రకటించారు. దీంతోపాటు విజయవాడలో తాను, మెగా అభిమానులు, జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షల విరాళం అందిస్తున్నానని తెలిపారు. విపత్తు కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. 

ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ తదితరులు విరాళాలను ప్రకటించారు.
Link to comment
Share on other sites

Balusu Srinivasa Rao: సీఎం చంద్రబాబుకు రూ.1 కోటి విరాళం చెక్ అందించిన బీఎస్సాఆర్ ఇన్ ఫ్రా ఎండీ 

04-09-2024 Wed 20:02 | Andhra
BSR Infrastructure MD Balusu Srinivasa Rao donates Rs 1 crore to Vijayawada flood victims
 

 

  • విజయవాడలో వరద విలయం
  • లక్షలాది మందిపై ప్రభావం
  • భారీగా ముందుకు వస్తున్న దాతలు
విజయవాడ వరద బాధితుల కడగండ్లు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తాజాగా, బీఎస్సార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు వరద బాధితుల సహాయార్థం రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఇవాళ ఆయన సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా బలుసు శ్రీనివాసరావును చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల కోసం పెద్ద మనసుతో ముందుకొచ్చిన ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఇక, రూ.25 లక్షలు విరాళం అందించిన సినీ నిర్మాత అశ్వినీదత్ కు, రూ.25 లక్షలు విరాళం అందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం వారికి కూడా చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కష్టకాలంలో మీరు అందిస్తున్న మద్దతు నిజంగా అభినందనీయం అని కొనియాడారు. ఈ విరాళాలు వరద బాధితులకు ఎంతో ఊరటనిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

క్లిష్ట సమయంలో చాలా సంస్థలు, వ్యక్తులు విరాళాలతో ముందుకు వస్తున్నారని, వారందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వివరించారు.
20240904fr66d86f3977828.jpg20240904fr66d86f487d0ca.jpg
Link to comment
Share on other sites

Andhra Pradesh: వరదల కారణంగా ఏపీలో ఎంత మంది చనిపోయారంటే..? 

04-09-2024 Wed 22:13 | Andhra
32 dead in AP due to floods
 

 

  • ఏపీ వ్యాప్తంగా 32 మంది మృతి
  • ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 24 మంది మృతి
  • దెబ్బతిన్న 3,973 కిలోమీటర్ల రోడ్లు
ఏపీలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్నే మిగిల్చాయి. జల విలయం కారణంగా ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 24 మంది చనిపోయారని  ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారని పేర్కొంది. 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయారని తెలిపింది. 1,69,370 ఎకరాల్లో పంట... 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగిందని చెప్పింది. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయని వెల్లడించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా 3,973 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తెలిపింది. 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. 50 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు పని చేస్తున్నాయిని చెప్పింది.
Link to comment
Share on other sites

Prabhas: ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! 

04-09-2024 Wed 13:33 | Both States
Prabhas and Allu Arjun Donation to Two Telugu States
 

 

  • భారీ వ‌ర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అస్త‌వ్య‌స్తం
  • వ‌ర‌ద‌ బాధితుల‌కు టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖుల ఆప‌న్న‌హ‌స్తం
  • ఇప్ప‌టికే చిరు, ఎన్‌టీఆర్‌, మ‌హేశ్ బాబు స‌హా ఇత‌ర న‌టీన‌టుల విరాళాలు
  • ఇప్పుడు ప్ర‌భాస్ రూ.2కోట్లు, బ‌న్నీ రూ.కోటి విరాళం
భారీ వ‌ర్షాల కార‌ణంగా అస్త‌వ్య‌స్త‌మైన రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద‌ బాధితుల‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నారు. ఇరు రాష్ట్రాల‌ సీఎం రిలీఫ్ ఫండ్‌ల‌కు భారీగా విరాళాలు అందిస్తూ ఉదార‌త‌ను చాటుతున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్‌టీఆర్‌, మ‌హేశ్ బాబు స‌హా ఇత‌ర న‌టీన‌టులు విరాళాలు ప్ర‌క‌టించారు. 

తాజాగా న‌టులు ప్ర‌భాస్, అల్లు అర్జున్ సీఎం స‌హాయనిధికి విరాళాలు ఇచ్చారు. ప్ర‌భాస్ రూ. 2కోట్లు విరాళంగా అందించ‌నున్న‌ట్లు ఆయ‌న టీమ్ తెలిపింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌ల‌కు చెరో రూ. కోటి ఇవ్వ‌నున్నట్లు పేర్కొంది. 

అలాగే బ‌న్నీ కూడా రెండు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.కోటి విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. ఈ క‌ష్ట స‌మ‌యం తొలిగిపోయి, రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆనందంగా ఉండాల‌ని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నాన‌ని బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

"ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు మొత్తం రూ.కోటి విరాళంగా ఇస్తున్నాను. ఈ విప‌త్తు నుంచి అందరూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అల్లు అర్జున్‌ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...