Jump to content

నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు ఇచ్చిన హైడ్రా


Sam480

Recommended Posts

15 hours ago, Sam480 said:

 

Shock ledu em ledu..anta GM showoff...pracharam...pakshapatam lekunda dare and dashing anukovalani GM gadi natakam...

Already jayabheri gadu responded..just 3 feet rekula sheddu undata..Danni vade kulchutadata...enni crores nastamo...

Link to comment
Share on other sites

రెండు రోజుల్లో షెడ్‌ను తొల‌గిస్తాం.. హైడ్రా నోటీసుల‌పై స్పందించిన ముర‌ళీ మోహ‌న్..

టీడీపీ మాజీ ఎంపీ, టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ముర‌ళీ మోహ‌న్ హైడ్రా నోటీసుల‌పై స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగ‌లాల్ కుంట చెరువును ప‌రిశీలించారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించారు.. ఆ షెడ్ మేమే తొలగించేస్తాం. నేను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను.. ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. మంగళవారంలోపు తాత్కాలిక షెడ్ తొలగిస్తామ‌ని ముర‌ళీ మోహ‌న్ స్ప‌ష్టం చేశారు.

Link to comment
Share on other sites

HYDRA: హైడ్రా రానక్కర్లేదు.. ఆ షెడ్‌ను మేమే తొలగిస్తాం: మురళీ మోహన్ 

08-09-2024 Sun 12:51 | Entertainment
Will Demolish On Tuesday HYDRA Need Not To Come Says Murli Mohan
 

 

  • గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువు బఫర్‌జోన్‌లో జయభేరి షెడ్
  • కూల్చివేతకు 15 రోజుల సమయమిచ్చిన హైడ్రా
  • మంగళవారం సాయంత్రం లోపు తామే కూల్చేస్తామన్న మురళీమోహన్
  • తానెప్పుడూ ఆక్రమణలకు పాల్పడలేదని వివరణ
జయభేరి సంస్థకు వచ్చిన హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. హైడ్రా నోటీసులు నిజమేనని తెలిపారు. జయభేరి ఎక్కడా, ఎప్పుడూ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు తమ సైట్‌కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్‌‌లో మూడు అడుగుల మేర ముందుకు వచ్చినట్టు గుర్తించారని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువు బఫర్ జోన్‌లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారు. ఆ షెడ్‌ను తామే తొలగించేస్తామని, హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఈ షెడ్ తొలగించేందుకు జయభేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రానక్కర్లేదని మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామన్నారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడూ అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...