Jump to content

anduke chepanu... ee mind set unna yedavalanini ori veyali ani....only ycp supporters..


psycopk

Recommended Posts

Boats: ఆ మూడు బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కు చెందినవి: టీడీపీ 

08-09-2024 Sun 14:18 | Andhra
TDP alleges the boats hit Prakasam Barrage gates were belonged to Komati Ram Mohan
 

 

  • ఇటీవల కృష్ణా నదికి భారీ వరద
  • ప్రకాశం బ్యారేజి గేట్లను ఢీకొన్న బోట్లు
  • విజయవాడ వన్ టౌన్ లో కేసు నమోదు
కృష్ణా నది వరదకు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను బలంగా ఢీకొట్టిన బోట్లు నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ బోట్లు ఒకే రంగును కలిగి ఉండడం, ఒకే సమయంలో గేట్లను ఢీకొట్టడంపై అనుమానాలు ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు మేరకు దీనిపై విజయవాడ వన్ టౌన్ పీఎస్ లో కేసు కూడా నమోదైంది. ఈ బోట్లు ఎవరివి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ప్రకాశం బ్యారేజిని కూల్చి విజయవాడను జలసమాధి చేయడానికి జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర బట్టబయలైందని పేర్కొంది. 

ఆ బోట్లు... జగన్ నమ్మినబంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కి చెందినవని వెల్లడించింది. మూడు బోట్లను ఒకదానికి ఒకటి కట్టేసి, మూడింటిని కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజి మీదకు వదిలారని ఆరోపించింది. 

సరిగ్గా... బ్యారేజికి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే ఇలా చేసి బ్యారేజిని కూల్చేయాలని జగన్ క్రిమినల్ ప్లాన్ వేశాడని టీడీపీ తన ట్వీట్ లో వివరించింది. అదృష్టవశాత్తు బ్యారేజికి ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొంది. 

అయితే, పోలీసులు విచారణ మొదలుపెట్టడంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ పారిపోయాడని వెల్లడించింది. దీనిపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

Nimmala Rama Naidu: బోట్లకు లంగరు వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారు: నిమ్మల రామానాయుడు 

09-09-2024 Mon 15:16 | Andhra
Nimmala Rama Naidu on boats hitting Prakasam barriage
 

 

  • ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందన్న నిమ్మల
  • బ్యారేజీని ఢీకొన్న బోట్లలో మూడు బోట్లు ఒకే యజమానికి చెందినవని వెల్లడి
  • బోట్లకు ఉన్న వైసీపీ రంగులు అనుమానాలకు తావిస్తున్నాయని వ్యాఖ్య
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లోని 3 బోట్లు ఒకే యజమానికి చెందినవని... ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు. ఈ బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు. 

ఒక్కో బోటు 45 నుంచి 50 టన్నుల బరువు ఉందని... ఈ బోట్లు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొన్నాయని నిమ్మల తెలిపారు. అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం, గేట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనిషని అన్నారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్ పనులు విజయవంతంగా పూర్తి.. కన్నయ్య నాయుడికి సన్మానం 

09-09-2024 Mon 17:09 | Andhra
The repair work of the damaged Prakasam Barrage gates has been successfully completed
 

 

  • 5 రోజుల్లోనే పనులు పూర్తి
  • సమర్థవంతంగా పనిచేస్తున్న 67, 69,70వ గేట్లు
  • నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో పనులు పూర్తి చేసిన ఇంజనీర్లు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే వరదలో కొట్టుకొని వచ్చిన బోట్లు బలంగా తాకడంతో దెబ్బతిన్న బ్యారేజీ 67, 69, 70 గేట్ల మరమ్మతులు ఇవాళ (సోమవారం) పూర్తయ్యాయి. బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు ముగిశాయి. నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనంలో బెకెమ్‌ ఇన్‌ఫ్రా సంస్థ‌కు చెందిన ఇంజినీర్లు పనులు పూర్తి చేశారు. స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్‌ వెయిట్లను ఇంజినీర్లు అమర్చారు. 

కాగా 5 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. కాగా ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో కీలక సూచనలు చేసిన నిపుణుడు కన్నయ్య నాయుడిని ఇంజినీర్లు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం, ప్రోత్సాహంతోనే పనులు త్వరగా పూర్తి చేశామని అన్నారు. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటను కాపాడటం ఆనందంగా ఉందని, అన్నదాతలకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో రేయింబవళ్లు కృషి చేసి మరమ్మతు పనులను పూర్తి చేశామని చెప్పారు. 

దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మూడు గేట్లు ఇప్పుడు సమర్థవంతంగా పని చేస్తున్నాయని కన్నయ్య నాయుడు చెప్పారు. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు చేసి పంట పొలాలను రక్షించడం సంతోషం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...