Jump to content

Kcr inka bratike unnadu ga..


psycopk

Recommended Posts

Harish Rao: అరికెపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి... హరీశ్ రావు హౌస్ అరెస్ట్

13-09-2024 Fri 10:42 | Telangana
Harish Rao house arrest in Hyderabad

 

  • సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్
  • అరికెపూడి ఇంటి వద్ద బీఆర్ఎస్ భేటీ ఉంటుందని ప్రకటించిన కౌశిక్ రెడ్డి
  • అరికెపూడి, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద పోలీసుల మోహరింపు

పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఈరోజు బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు... హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్‌పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

శంభీపూర్ రాజు నివాసం నుంచి ర్యాలీ

శంభీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరాలని నిర్ణయించారు. దీంతో గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులను మోహరించారు.
Link to comment
Share on other sites

Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

13-09-2024 Fri 11:12 | Telangana
Police case filed against Padi Kaushik Reddy

 

  • కౌశిక్ రెడ్డిపై ఏఎస్పీ రవి చందన్ ఫిర్యాదు
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో ఏఎస్పీ పేర్కొన్నారు. దీంతో 132, 351 (3) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
Link to comment
Share on other sites

Arekapudi Gandhi: నాపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి: అరెకపూడి గాంధీ

13-09-2024 Fri 14:16 | Telangana
Arekapudi Gandhi demands KCR to respond on

 

  • కౌశిక్ రెడ్డి మాదిరే తాను కూడా బతకడానికి హైదరాబాద్ కు వచ్చానన్న గాంధీ
  • కౌశిక్ రెడ్డి చీటర్, బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • బీఆర్ఎస్ చెప్పిన వాళ్లకే పీఏసీ పదవి ఇవ్వాలనేం లేదని వ్యాఖ్య

తనను ఆంధ్రోడన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి బతకడానికి హైదరాబాద్ కు వచ్చినట్టే తాను కూడా హైదరాబాద్ కు వచ్చానని ఆయన చెప్పారు. 

ఎంతో మందిని చీటింగ్ చేసిన కౌశిక్ రెడ్డితో తనకు పోలికేంటని ఎద్దేవా చేశారు. తనను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించింది హరీశ్ రావు అని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రకటించారని చెప్పారు. 

బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి నాశనం చేశారని గాంధీ దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి చీటర్, బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను ప్రతిస్పందించాల్సి వచ్చిందని చెప్పారు. పదేపదే తనను రెచ్చగొట్టడం వల్లే స్పందించాల్సి వచ్చిందని అన్నారు. పిల్లిని గదిలో బంధించి కొడితే... అది కూడా తిరగబడుతుందని చెప్పారు. 

సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూచించిన వారికే పీఏసీ పదవి ఇవ్వాలని ఏమీ లేదన్నారు. గతంలో పీఏసీ పదవిని కాంగ్రెస్ నేతకు కాకుండా అక్బరుద్దీన్ ఒవైసీకి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు 'ఛలో గాంధీ' నివాసానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
Link to comment
Share on other sites

Danam Nagender: ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువస్తారా?: దానం నాగేందర్ ఆగ్రహం

13-09-2024 Fri 13:34 | Telangana
Danam Nagendar fires at Koushik Reddy

 

  • కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వైఖరా? లేక వ్యక్తిగతమా? అని నిలదీత
  • ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని మండిపాటు
  • కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తెలుసునని చురక

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా? లేక వ్యక్తిగతమా? చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ ఇవాళ అరికెపూడి గాంధీ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని సూచించారు.

అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పేరిట బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. తాము అన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైతే బీఆర్ఎస్ ఆయనను సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎక్కడైనా ఇంట్లో చేస్తారా? అని నిలదీశారు. అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Natti Kumar: బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ల ఓట్లు వద్దా? కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి: నట్టి కుమార్

13-09-2024 Fri 15:07 | Entertainment
Do BRS dont want Andhra people votes asks film producer Natti Kumar

 

  • ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడటం దారుణమన్న నట్టి కుమార్
  • ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్న
  • కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సినీ నిర్మాత నట్టి కుమార్ విమర్శలు గుప్పించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిందని... రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారని... అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడటం దారుణమని అన్నారు. కౌశిక్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. 

కౌశిక్ రెడ్డిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ ను నట్టి కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విధానం కూడా కౌశిక్ రెడ్డి విధానమేనని భావించాల్సి వస్తుందని చెప్పారు. ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో, తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించడంలో ఆంధ్ర ప్రజలు కీలక పాత్ర పోషించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

ఎన్నికలప్పుడు ఆంధ్ర వాళ్ల ఓట్లను బీఆర్ఎస్ ఉపయోగించుకుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపులో ఆంధ్ర వాళ్ల ఓట్లు కీలకం కాదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్ల ఓట్లు మీకు అవసరం లేదా? అని అడిగారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. 

ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదంలో... ఆంధ్ర ప్రజల పేరెత్తి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.
Link to comment
Share on other sites

Arekapudi Gandhi: నేను ఆంధ్రావాడినా?.. బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి: అరికెపూడి గాంధీ

13-09-2024 Fri 09:43 | Telangana
BRS Should Apologize About Kaushik Reddy Comments

 

  • ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గాంధీ డిమాండ్
  • పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలన్న ఎమ్మెల్యే
  • కౌశిక్‌రెడ్డి భార్య కూడా తన అనుచరులపై దాడి చేశారని ఆరోపణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. చివరికి అరెస్ట్‌లకు దారితీసింది. తాజాగా, ఈ విషయమై స్పందించిన గాంధీ.. తనను ఆంధ్రావాడిగా పేర్కొన్న కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కనుక బాధ్యత వహిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడంతోపాటు పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డి ఆహ్వానిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లానని తెలిపారు. అక్కడ తన అనుచరులపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడిచేశారని, కౌశిక్‌రెడ్డి భార్య స్వయంగా పై నుంచి పూలకుండీలు విసిరారని గాంధీ ఆరోపించారు.
Link to comment
Share on other sites

Arikepudi Gandhi: ఆంధ్రా-తెలంగాణ అంటావా... ఇది నీ బాబు సంపాదించిన తెలంగాణనా?: కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ నిప్పులు

13-09-2024 Fri 16:24 | Telangana
Arikepudi Gandhi fires at Padi Koushik Reddy

 

  • కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని మండిపాటు
  • కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించేలా మాట్లాడారన్న గాంధీ
  • కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే రాళ్లు, పూలకుండీలు విసిరారని ఆరోపణ
  • కేసీఆర్ అంటే ఇప్పటికీ గౌరవం ఉందన్న అరికెపూడి గాంధీ

ఆంధ్రా, తెలంగాణ అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మండిపడ్డారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పారని, కానీ ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చే వ్యక్తితో తాను కలిస్తే తాను కూడా కౌశిక్ రెడ్డి లాంటి వాడినని సమాజం భావిస్తుందన్నారు. అయినప్పటికీ తాను కౌశిక్ రెడ్డిని తన ఇంటికి ఆహ్వానించానని... కానీ ఆయన రాలేదన్నారు. తానే అతని ఇంటికి వెళ్తే దాడి చేశారని ఆరోపించారు.

ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారని, ఆయన రెండుచోట్ల పోటీ చేసినందువల్ల హుజూరాబాద్‌పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోవడంతో కౌశిక్ రెడ్డి గెలిచారన్నారు. అయినప్పటికీ గెలుపు గెలుపే అన్నారు. కానీ కౌశిక్ రెడ్డి నోటి దురద వల్ల తాను ఈరోజు బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా? అని ధ్వజమెత్తారు.

కౌశిక్ రెడ్డి ప్రజలు, మహిళలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కౌశిక్ రెడ్డి తనను రెచ్చగొట్టినందువల్లే ఆయనపై తాను విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. తన ఇంటికి వచ్చి కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కానీ తాను ఆయన ఇంటికి వెళ్తే రాళ్లు రువ్వారు... పూలకుండీలు విసిరారని ఆరోపించారు. మా పైనే బీఆర్ఎస్ వాళ్లు దాడి చేశారన్నారు. తాము ఒక్కరిపై కూడా దాడి చేయలేదన్నారు.

కేసీఆర్ అంటే ఇప్పటికీ గౌరవం

కేసీఆర్ అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని అరికెపూడి గాంధీ అన్నారు. ఆయన తనను ఆదరించారని... ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. కానీ కౌశిక్ రెడ్డి వంటి చీడపురుగుతో పార్టీకి మచ్చ వస్తోందన్నారు. అధికారం కోల్పోయామని ఆవేశపడి మాట్లాడటం సరికాదన్నారు. కౌశిక్ రెడ్డి వల్ల కేసీఆర్ గొప్ప మనస్తత్వం, గతంలో ఆయన చేసిన మంచి పనులకు చెడ్డపేరు వస్తుందన్నారు. నోరు అదుపులో లేని మనిషిని ఊరిమీదకు వదిలేశారన్నారు.

నీ అయ్య జాగీరా.. నీ బాబు సంపాదించిన తెలంగాణనా ఇది?

తనను వదిలిపెట్టేది లేదని కౌశిక్ రెడ్డి అంటున్నారని, కానీ నీ అయ్య జాగీరా... ఈ తెలంగాణ నీ బాబు సంపాదించిందా? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి నిక్కర్ వేసుకోని రోజుల్లో తాను హైదరాబాద్ వచ్చానన్నారు. ఒక జూనియర్ ఎమ్మెల్యే తనలాంటి సీనియర్ ఎమ్మెల్యేపై ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. తనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌లో నాయకులే లేరా? అని ప్రశ్నించారు. తనతో మాట్లాడేందుకు కౌశిక్ రెడ్డికి పదవి ఇచ్చిందా? అని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి రౌడీయిజం దేనికో చెప్పాలన్నారు.

కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకొని... క్రమశిక్షణతో ఎదగాలని సూచించారు. ఆంధ్రా, తెలంగాణ అనకుండా... నోరు మూసుకొని రాష్ట్రం ఎదగడానికి సహకరించాలని కోరారు. చీరలు, గాజులు అంటూ మాట్లాడటం కాదని, తల్లివద్ద కూర్చొని చరిత్ర వినాలని సూచించారు. ఇష్టారీతిన మాట్లాడవద్దని ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నానన్నారు. 

ఆంధ్రా, తెలంగాణ కుటుంబ సభ్యులు

తనది అక్రమ సంపాదన అని కౌశిక్ రెడ్డి అంటున్నారని, ఎక్కడో నిరూపించాలన్నారు. ఆయన రమ్మన్న చోటికి వెళ్తానని చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నీ నోరు మూయిస్తానన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని... ఎవరూ తనకు మాటలు నేర్పించలేదని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నానన్నారు.
Link to comment
Share on other sites

Bapu phone chesi esukunatu unnadu..

 

Kaushik Reddy: ఆంధ్ర ఓటర్లను బీఆర్ఎస్ కు దూరం చేసే కుట్ర జరుగుతోంది: కౌశిక్ రెడ్డి 

13-09-2024 Fri 17:22 | Telangana
There is a conspiracy to alienate Andhra voters from BRS says Kaushik Reddy
 

 

  • సెటిలర్లు అంటే తమకు చాలా గౌరవమన్న కౌశిక్ రెడ్డి
  • కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని వ్యాఖ్య
  • రేవంత్ నీచ రాజకీయాల వల్ల సెటిలర్లు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ
ఆంధ్ర సెటిలర్లను తమ పార్టీకి దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఏనాడు ఇబ్బందులు కలగలేదని చెప్పారు. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కేసీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు గౌరవమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీచమైన రాజకీయాల వల్ల సెటిలర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

సెటిలర్స్ అనే పదాన్ని తాను వాడలేదని... తాను ఆంధ్రా అనే పదాన్ని వాడి ఉంటే... అది తనకు, అరికెపూడి గాంధీకి వ్యక్తిగతమని కౌశిక్ రెడ్డి చెప్పారు. సెటిలర్లను కేసీఆర్ కంటికి రెప్పలా చూసుకున్నారని... అందుకే హైదరాబాద్ లో సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. 

కాంగ్రెస్ మంత్రులు కూడా తన స్థాయికి దిగజారిపోయారని కౌశిక్ ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వ రౌడీయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడపలేరని చెప్పారు. 

ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. తనకు అండగా నిలిచిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...