Jump to content

తిరుమల లడ్డు లో నెయ్యి కి బదులు జంతువుల fat తో చేసిన ఆయిల్ వాడారు వైసీపీ గవర్నమెంట్ లో


psycopk

Recommended Posts

35 minutes ago, psycopk said:

Jagans hindu paytm dogs

 

 

Annagoru Subramanya Swami Supreme Court lo case vesaru nethi vyavaharam meedha. Mari CBI teesukunte neeku ok na?

Link to comment
Share on other sites

8 hours ago, CanadianMalodu said:

INR  478 iche nethi lo kalthi ledha? Market rate INR 700, aithe takkuvaki ela isthunnarantaru Anna goru?

Rey erri pushpam 

anduke anedi mee jaffas ki mee anna laagane burra ledhu ani 

for example nuv oka kilo chicken 250 inr ki kontunnav anuko 

Daily oka 1000 kgs kontu unte … neeku kuda kilo 250 ke istara …. Danne wholesale priceing antaru … adi kuda telvadu 

Link to comment
Share on other sites

6 hours ago, React said:

Rey erri pushpam 

anduke anedi mee jaffas ki mee anna laagane burra ledhu ani 

for example nuv oka kilo chicken 250 inr ki kontunnav anuko 

Daily oka 1000 kgs kontu unte … neeku kuda kilo 250 ke istara …. Danne wholesale priceing antaru … adi kuda telvadu 

Orini Chevilo puvvu malokam, 50-60 taagithe anukovachu kani 220 + Etta istharu? Ee whole sale lo ammithe isthadu? Andhulo dalda kalapanidhe avvadhu.

Link to comment
Share on other sites

1 hour ago, CanadianMalodu said:

Orini Chevilo puvvu malokam, 50-60 taagithe anukovachu kani 220 + Etta istharu? Ee whole sale lo ammithe isthadu? Andhulo dalda kalapanidhe avvadhu.

Online lo nandini ghee 600 ra kuyya 

vellaki 380 ki istunnaru 

wholesale and retail ki diff telusa asala neeku 

and moreover temple ki ante inka koncham discount istaru

malodivi ga

neeku ee temples gurinchi etla telustadi le 

Link to comment
Share on other sites

LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీ నిజమే.. బోర్డు గురించి జగన్ కు చెప్పినా వినలేదు: మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం 

24-09-2024 Tue 11:39 | Andhra
Ex CS LV Subrahmanyam on Tirumala Laddu
 

 

  • ల్యాబ్ రిపోర్ట్ ద్వారా లడ్డూ విషయం వెలుగు చూసిందన్న ఎల్వీ
  • నిర్ధారించుకోవడానికి సీఎంకు సమయం పట్టి ఉంటుందని వ్యాఖ్య
  • సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న ఎల్వీ
  • టీటీడీ బోర్డులో ఎక్కువ మంది ఉంటే ఇబ్బందులేనని వ్యాఖ్య
  • తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని ఆవేదన
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతానని ఏపీ మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతో, ల్యాబ్ రిపోర్ట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత... అందులో నిజం ఎంత ఉందో అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ధారించుకోవడానికి ముఖ్యమంత్రికి కొంత సమయం పట్టి ఉంటుందని... అందుకే లడ్డూ కల్తీపై ఆయన ప్రకటన చేయడం కొంత ఆలస్యమై ఉంటుందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఒక పవిత్రమైన హైందవ క్షేత్రంపై కుట్ర ప్రకారం ఏమైనా చేశారా? లేదా కొంత డబ్బును వెనకేసుకోవడానికి (అవినీతి) చేసిన ప్రయత్నమా? అనేది తనకు తెలియదని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 

తాను సీఎస్ గా ఉన్న సమయంలో టీటీడీ బోర్డులోకి పెద్ద సంఖ్యలో సభ్యులను తీసుకున్నారని... ఇది కరెక్ట్ కాదని సీఎం జగన్ కు చెప్పానని, ఆయన వినలేదని ఎల్వీ తెలిపారు. బోర్డు సభ్యులకు హిందూ ధర్మం గురించి తెలియదని, వారు వారి పనులతో బిజీగా ఉంటారని చెప్పారు. బోర్డు మీటింగులకు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని అన్నారు. బోర్డు సభ్యులు ఎక్కువైతే ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువని చెప్పారు. బోర్డు మీటింగులకు హాల్ సరిపోదని... పెద్ద ఆడిటోరియం కావాల్సి ఉంటుందని అన్నారు. ఈవో మెత్తగా ఉంటే... బోర్డు సభ్యులు ఒత్తిడికి గురి చేసి ఈవోను ఆటాడించే అవకాశం ఉందని చెప్పారు.

తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని... అన్యమతానికి చెందిన పాంప్లెట్స్ కూడా దొరికాయని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లో కొందరి పేర్లు రికార్డుల్లో హిందువులుగానే ఉంటాయని... కానీ తర్వాతి రోజుల్లో వారు అన్యమతం స్వీకరించి ఉంటారని చెప్పారు. శ్రీశైలంలో కూడా తాను ఇలాంటివి చూశానని తెలిపారు. మతం మారిన వారికి హిందూ ధర్మంపై విశ్వాసం ఉండదని చెప్పారు. 

తిరుమల లడ్డూ అపవిత్రంపై తాను కూడా ప్రాయశ్చిత్తాన్ని పాటిస్తున్నానని ఎల్వీ చెప్పారు. జూబ్లీహిల్స్ లోని వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని... జరిగిన తప్పుకు క్షమించాలని స్వామిని కోరుకున్నానని తెలిపారు.
Link to comment
Share on other sites

Budda Venkanna: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని చంపేశారనే అనుమానం కలుగుతోంది: బుద్దా వెంకన్న 

24-09-2024 Tue 12:27 | Andhra
Budda Venkanna comments on Dharma Reddy
 

 

  • ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలన్న బుద్దా వెంకన్న
  • పొన్నవోలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
  • ఆలయాలను అపవిత్రం చేయాలని జగన్ యత్నించారని మండిపాటు
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని ఆయన కోరారు. వైఎస్ వివేకాను చంపినట్టే ధర్మారెడ్డిని కూడా చంపేశారనే అనుమానం తనకు కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఏం జరిగిందనే విషయాలను ధర్మారెడ్డి బయటకు వచ్చి చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. 

తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కారుకూతలు కూశాడని అన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ పాలేరులా పని చేశారని విమర్శించారు. నిబంధనలు పట్టించుకోని పొన్నవోలు న్యాయ పట్టా రద్దు చేయాలని... హైకోర్టు సుమోటోగా తీసుకుని పొన్నవోలుపై విచారణ జరపాలని కోరారు. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా వాగితే బుద్ధి చెపుతామని హెచ్చరించారు.

భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండపై నిన్న డ్రామా ఆడారని బుద్దా మండిపడ్డారు. తాను హిందువు అని చెప్పుకుంటున్న భూమన... వాళ్ల ఇంట్లో క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేయలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నించారని అన్నారు. ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 
Link to comment
Share on other sites

Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు.. వైవీ సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సిందే: పవన్ కల్యాణ్ 

24-09-2024 Tue 10:45 | Andhra
Pawan Kalyan warning to Prakash Raj
 

 

  • తిరుమల లడ్డూ అపవిత్రం అయిందంటే చాలా ఆవేదన కలుగుతోందన్న పవన్
  • భూమన తిరుమలలో హైడ్రామా చేశారని విమర్శ
  • పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని మండిపాటు
సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను ఈరోజు పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గతంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఎక్కుడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని... ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని... లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మీమీద లేదా? అని ప్రశ్నించారు. 

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన గురించి మాట్లాడారని... ఏం జరిగిందో తెలుసుకుని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే టూ వే అని... వన్ వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ప్రకాశ్ రాజ్ ను హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Roja: సొంత యూట్యూబ్ ఛానల్ లో రోజాకు షాక్ 

24-09-2024 Tue 12:52 | Andhra
Shock to Roja in her youtube channel
 

 

  • తిరుమల లడ్డూపై యూట్యూబ్ ఛానల్ లో పోల్ నిర్వహించిన రోజా
  • లడ్డూ విషయంలో జగన్ దే తప్పన్న 74 శాతం మంది
  • చంద్రబాబు పాలన బాగుందన్న 77 శాతం మంది
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఏదో అనుకుంటే... మరేదో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డూ అంశంపై ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు రోజాకు షాక్ ఇచ్చాయి.  

తిరుపతి లడ్డూను కల్తీ చేసింది ఎవరని ఆమె పోల్ చేపట్టగా జగన్ దే తప్పంటూ 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా... చంద్రబాబు పాలనలో బాగుందని 77 శాతం మందికి పైగా ఓటు వేశారు. ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకు ఝలక్ ఇచ్చాయనే చెప్పచ్చు! 
Link to comment
Share on other sites

Chandrababu: జగన్.. తిరుమల ఎందుకు వెళ్లావు?: ట్విట్టర్ లో చంద్రబాబు ఫైర్ 

24-09-2024 Tue 13:15 | Andhra
AP CM Chandrababu Tweet on Jagan Tirumala Visit
 

 

  • అప్పట్లో తిరుమల సందర్శించినపుడు డిక్లరేషన్ ఇవ్వని విషయం గుర్తుచేసిన సీఎం
  • సంప్రదాయాలపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందని వ్యాఖ్య
  • శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారంటూ మండిపాటు
హిందూ సంప్రదాయాలపై నమ్మకంలేనపుడు సీఎం హోదాలో జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గతంలో జగన్ తిరుమల పర్యటనను ప్రస్తావిస్తూ.. హిందూవేతరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినపుడు ముందుగా డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయమని, అందరూ దానిని పాటిస్తారని గుర్తుచేశారు. అయితే, క్రిస్టియన్ అయిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నాడని మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.

‘‘వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్న అన్యమతస్థులు కూడా తిరుమలకు వెళ్లొచ్చు. అయితే, ముందుగా శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. అన్యమతస్థులు ఎవరైనా సరే దీనికి అతీతులు కారు. అయితే, జగన్ మాత్రం ఈ పద్ధతిని పాటించలేదు. ప్రజలు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు అనే విషయం జగన్ గుర్తించలేదు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లారని ప్రశ్నించినందుకు మమ్మల్ని బూతులు తిట్టారు. రథం కాలిపోతే.. తేనెటీగలు కారణమని అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక ఆయనే చూసుకుంటాడు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

Pawan Kalyan: లడ్డూ ఇష్యూ.. హీరో కార్తీ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం 

24-09-2024 Tue 13:30 | Andhra
Pawan comments on Actor Kart
 

 

  • కార్తీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో లడ్డూ టాపిక్
  • లడ్డూ మీద జోకులేస్తున్నారని పవన్ మండిపాటు
  • సనాతన ధర్మానికి మద్దతుగా ఉండాలని హితవు
తమిళ హీరో కార్తీని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డూను ఉద్దేశించి కార్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వివరాల్లోకి వెళ్తే... హీరో కార్తీ తాజా చిత్రం 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో... 'లడ్డూ కావాలా నాయనా' అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డూ గురించి వద్దు... అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. 'మీకోసం మోతిచూర్ లడ్డూ తెప్పిస్తాం' అని యాంకర్ అడగడంతో... ఇప్పుడు వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరబూశాయి. 

ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని... లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలని అన్నారు. లడ్డూ మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని... అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. మీమీద తనకు గౌరవం ఉందని... మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్... ఒక మాట మాట్లాడే ముందు వెయ్యిసార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతనధర్మాన్ని గౌరవించాలని... మీరు అభిమానించే హీరోలకంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Link to comment
Share on other sites

Pawan Kalyan: ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌.. ఇంద్ర‌కీలాద్రి ఆల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ శుద్ధి కార్య‌క్ర‌మం 

24-09-2024 Tue 09:24 | Andhra
AP Deputy CM Pawan Kalyan at Vijayawada Kanaka Durga Temple
 

 

  • శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష
  • క‌న‌క‌దుర్గ ఆల‌యం మెట్లు క‌డిగి, ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన జ‌న‌సేనాని
  • తిరుమ‌ల‌లో అక్టోబ‌ర్ 1న ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌ విరమణ  
తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్ష‌లో భాగంగా ఆయ‌న ఇవాళ విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ఆల‌యంలో శుద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణ మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 

మొద‌ట ఆల‌యం మెట్ల‌ను నీటితో జ‌న‌సేనాని శుభ్రం చేశారు. అనంత‌రం మెట్ల‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు బాలశౌరి, కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఇక ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌ను తిరుమ‌ల‌లో అక్టోబ‌ర్ 1న ప‌వ‌న్ విర‌మించ‌నున్నారు. దీనికోసం ఆయ‌న తిరుప‌తి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమ‌ల‌కు న‌డుచుకుంటూ వెళ్ల‌నున్నారు. 2వ తేదీన వెంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్న త‌ర్వాత దీక్ష విర‌మించ‌నున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...