Jump to content

తిరుమల లడ్డు లో నెయ్యి కి బదులు జంతువుల fat తో చేసిన ఆయిల్ వాడారు వైసీపీ గవర్నమెంట్ లో


psycopk

Recommended Posts

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన చిలుకూరు ప్రధాన అర్చకులు 

20-09-2024 Fri 22:01 | Both States
Chilukuru Rangarajan responds on Laddu Prasadam issue
 

 

  • తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న రంగరాజన్
  • ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అని ఆవేదన
  • విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి తిరుమలలో ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమన్నారు. ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అన్నారు.

నిజానిజాలు తేల్చడానికి విచారణను చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లు జాతీయస్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు.
Link to comment
Share on other sites

సర్వాధికారి అయిన దేవుడు సదా కాలం మీకు తోడై ఉండును గాక

Link to comment
Share on other sites

Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్

21-09-2024 Sat 21:07 | Andhra
Pawan Kalyan opines on Tirumala Laddu issue

 

  • రేపు నంబూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ దీక్ష ప్రారంభం
  • 11 రోజుల తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం
  • సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్న పవన్

విచ్చలవిడి మనస్తత్వం ఉన్నవాళ్లే తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడగలరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డూ అంశం ప్రజా పోరాటంలో ఉన్న తన దృష్టికి రాకపోవడం బాధ కలిగించిందని, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని తెలిపారు. 

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి పట్ల ఇది నిజంగా ఘోర అపచారం అని, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ దీనికి ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు (సెప్టెంబరు 22) దీక్ష ప్రారంభిస్తానని వెల్లడించారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులు గత రాక్షస పాలకులకు భయపడి, తప్పిదాలపై మౌనంగా ఉండిపోయారా? అనిపిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.
Link to comment
Share on other sites

Raghu Rama Krishna Raju: తిరుమల లడ్డూ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు ఏమన్నారంటే...!

21-09-2024 Sat 19:17 | Andhra
RRR said there is no suspicion of laddu adulteration in Tirumala

 

  • తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన ఆర్ ఆర్ ఆర్  
  • తిరుమల లడ్డు ప్రసాదంపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
  • ఆవు నెయ్యి లోనే కల్తీ జరిగిందని నిర్ధారణ అయిందన్న రఘురాజు 

తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం సృష్టిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రేడ్ మార్క్ లడ్డూ నాణ్యతపై వినిపిస్తున్న వార్తలతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ఉన్న విశిష్టత దృష్ట్యా, అక్కడి ప్రసాదం స్వీకరిండాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. 

మరోవైపు తిరుమలలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

 రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ  "లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో పందికి సంబంధించిన కొవ్వు, అలాగే మటన్ లో ఉండే టాలో అనే కొవ్వు పదార్థం కలిసినట్టు లేబరేటరీ టెస్టుల్లో నిర్ధారణ కూడా జరిగింది. ఒకరిద్దరు కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వార్త బయటకు రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. 

కొన్ని చానల్స్ ముఖ్యంగా బ్లూ ఛానల్స్ ని మినహాయిస్తే మిగతా అన్ని చానల్స్ ఇదే వార్తను టేకప్ చేసి నిజానిజాలు ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదని ఈవో కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు" అని రఘురామ తెలిపారు. 
Link to comment
Share on other sites

Chandrababu: ఆ ఏడుకొండలవాడే నాతో లడ్డూ గురించి మాట్లాడించాడేమో!: సీఎం చంద్రబాబు

21-09-2024 Sat 19:13 | Andhra
CM Chandrababu comments on Tirupati laddu issue

 

  • వినతులు తీసుకునేందుకు టీడీపీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు
  • అక్కడున్న మీడియా ప్రతినిధులతో చిట్ చాట్
  • తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందర్శకుల నుంచి వినతులు తీసుకునేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో....మనం నిమిత్త మాత్రులం.....దేవుడే అన్నీ చేయిస్తాడు... ఇదీ అంతే అనుకుంటున్నా" అని వ్యాఖ్యానించారు. 

తిరుమల లడ్డూ తరహాలో తయారు చేయడం ఎవరి వల్ల కాలేదు

తిరుమల శ్రీవారి లడ్డు కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. వందల ఏళ్లుగా శ్రీవారి లడ్డూ అక్కడ తయారవుతోంది. అయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డూ తయారు చేయాలని చూశారు. ఇక్కడ నుంచి కార్మికులను తీసుకువెళ్లారు. కానీ సాధ్యం కాలేదు. ఈ విషయం నాకు అక్కడి వారే చెప్పారు. అంత మహత్మ్యం ఉన్న ప్రసాదం అది.

రాములవారి విగ్రహం తల తొలగిస్తే దిక్కులేదు

గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తొలిగిస్తే దిక్కులేదు... కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటని కాదు... నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదు. నాడు ప్రజల సెంటిమెంట్ తో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. 

పోలవరం, అమరావతి నాశనం చేసి... ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో... నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారు. 

వైసీపీ నాయకులు నేరాలు చేసి....ఎదురుదాడి, బుకాయింపు, ఫేక్ ప్రచారం అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తప్ప... బాధ్యత అనేది లేదు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చాను.

గతంలో వైఎస్ ఏడు కొండలు కాదు... రెండు కొండలు అన్నాడు

కేరళ గురువాయూర్ టెంపుల్ లో దర్శనానికి చొక్కా విప్పి వెళ్లాలి.....అది సాంప్రదాయం. అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి. 

గతంలో వైఎస్ ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు... అప్పుడు వ్యతిరేకించాం, పోరాడాం. అమరావతిలో రూ.250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కుదించారు. వీళ్లు మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
Link to comment
Share on other sites

Mohan Babu: తల్లడిల్లిపోయాను... నేరస్తులను కఠినంగా శిక్షించాలని నా ఆత్మీయుడు చంద్రబాబును కోరుతున్నా: మోహన్ బాబు

21-09-2024 Sat 18:16 | Entertainment
Mohan Babu response on Tirumal laddu

 

  • తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలపడంపై మోహన్ బాబు స్పందన
  • ఇలా జరగడం ఘోరం, హేయం, నీచమని వ్యాఖ్య
  • చంద్రబాబు నూరేళ్లు చల్లగా ఉండాలన్న మోహన్ బాబు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉందనే ఆరోపణలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ వార్త వినగానే ఒక భక్తుడిగా తాను తల్లడిల్లిపోయానని చెప్పారు. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు ఎంతో భక్తితో పూజించే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు. 3 నెలల క్రితం వరకు స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, అత్యంత నీచం, హేయం, అరాచకమని తెలిపారు

స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం నిజమైతే నేరస్తులను కఠినంగా శిక్షించాలని తన మిత్రుడు, ఆత్మీయుడు, సీఎం చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని వివరించారు. కలియుగదైవం శ్రీనివాసుడి ఆశీస్సులను తన మిత్రుడు అందుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Link to comment
Share on other sites

BJP Leader Madhavi Latha: మతమార్పిడి చేసుకున్న నేతల వల్లే ఈ పరిస్థితి: తిరుపతి లడ్డూ వ్యవహారంపై మాధవీలత వ్యాఖ్యలు

21-09-2024 Sat 19:59 | Telangana
Madhavilatha who came to the screen for the first time after the election Comments on Tirumala Laddu

 

  • తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత 
  • ఈ వ్యవహారాన్ని అత్యాచారంతో పోల్చిన మాధవి లత 
  • నిజం తెలిసే వరకు పోరాడతానన్న మాధవి

సాక్షాత్తు వైకుంఠ వాసుడే మనకోసం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్షేత్రం కూడా తిరుమలే. అటువంటి క్షేత్రంలో భగవంతుని ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వ్యవహారంపై తాజాగా తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలత స్పందించారు. 

ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి స్పందించాలని కోరారు. కేంద్రంలో ఉన్న మంత్రులు ఈ వ్యవహారంపై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు. 

"మతమార్పిడి చేసుకున్న నాయకులు పరిపాలించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్లకి సంబంధించిన మందిరాల్లో హిందువులని నియమించుకుంటారా... అలాంటివి ఏమీ ఉండవు కదా, మరి హిందూ దేవాలయాల్లో అలాంటి వారు ఎలా నియమించబడుతున్నారు? ఈ విషయంపై హిందువులందరూ కలిసి పోరాడాలి. ఎవరు వదిలిపెట్టినా ఈ విషయంలో నిజం తేలే వరకు నేను వదిలిపెట్టను" అని మాధవీలత స్పష్టం చేశారు.
 
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అపచారం మాటల్లో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య పరిస్థితి అది. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న ప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్ధంతో చేయడం అంటే... ఈ జన్మకి ఇంతకన్నా పాపాన్ని అంట కట్టుకోవడం ఇంకోటి ఉండదు. 

అందరం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం అనే కంటే ఆ ప్రసాదాన్ని భక్షిస్తున్నాం అనడం సబబుగా ఉంటుందేమో. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన తర్వాత... ప్రసాదాన్ని తింటున్నాం అనే మాట నేను అనలేకపోతున్నాను. భక్షించే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇన్ని వేలమంది, కోట్ల మంది హైందవుల నమ్మకాన్ని భక్తిని అడ్డం పెట్టుకొని మోసం చేయాలనుకున్న ఆ దుర్మార్గులు ఎవరో కానీ పరమేశ్వరుడు వారికి పుట్టగతులు లేకుండా చేస్తాడు. వాళ్ళు ఎవరన్నది తేలాల్సిందే" అని మాధవీలత పేర్కొన్నారు.
 
Link to comment
Share on other sites

Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం... టీటీడీ కీలక నిర్ణయం

21-09-2024 Sat 16:39 | Both States
TTD to do Maha Shanthi Yagam at Tirumala

 

  • ఆగమ సలహాదారులు, అధికారులతో ఈవో శ్యామలరావు భేటీ
  • లడ్డూ కల్తీ అయిందన్న నేపథ్యంలో సలహా కోరిన అధికారులు
  • మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమశాస్త్ర పండితులు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంలో భాగంగా శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమసలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు.

శ్రీవారి లడ్డూ కల్తీ అయిందన్న నేపథ్యంలో, ఆగమశాస్త్రాలపరంగా సూచనలు ఇవ్వాలని కోరారు. దీంతో మహాశాంతి యాగం నిర్వహించాలని ఆగమశాస్త్ర పండితులు సూచించారు. వచ్చే సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

Tirumala Laddu: తిరుపతిలో జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు

21-09-2024 Sat 15:34 | Andhra
Janasena cadre burns Jagan and other YCP leaders effigies in Tirupati

 

  • తీవ్రరూపం దాల్చిన తిరుమల లడ్డూ వ్యవహారం
  • ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినా జగన్ బుకాయిస్తున్నాడంటోన్న జనసేన నేతలు
  • తిరుపతిలో వైసీపీ నేతల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగింపు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, తిరుపతిలో జనసేన పార్టీ శ్రేణులు జగన్ తదితర వైసీపీ ముఖ్య నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. 

జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగింపు చేపట్టారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసివారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. 

కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ చెబుతున్నా జగన్ బుకాయిస్తున్నారని, ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గోవింద నామస్మరణ చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
Link to comment
Share on other sites

Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు

21-09-2024 Sat 13:26 | Both States
AP CM Chandrababu High Level Review On TTD Laddu Controversy

 

  • తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఏపీ సీఎం
  • మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష
  • సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశం

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం చాలా సున్నితమైందని చెబుతూ.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని స్పష్టం చేశారు. 

ఈమేరకు శనివారం ఉదయం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో లడ్డు తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ పక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

Nagababu: ఇలాంటి ద్రోహులను క్షమించకూడదు: నాగబాబు

21-09-2024 Sat 12:41 | Andhra
Nagababu response on Tirumala laddu controversy

 

  • తిరుమల లడ్డూను జంతు కొవ్వుతో కల్తీ చేశారన్న నాగబాబు
  • హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమని వ్యాఖ్య
  • హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్న నాగబాబు

పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే అంశం కలకలం రేపింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందిస్తూ... ద్రోహులను క్షమించకూడదని పేర్కొన్నారు.  

ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ.. "ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల తిరుపతి దేవస్థానం' ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కానీ... కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు. 

ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది. తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు. అంతటి విశిష్టమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో... జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు. అందుకే తితిదేలాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

TTD: తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై టీటీడీ అత్య‌వ‌స‌ర భేటీ

21-09-2024 Sat 12:41 | Both States
TTD Emergency Meeting on Tirumala Laddu Adulteration

 

  • తిరుప‌తి ప‌రిపాల‌న భ‌వనంలో ఆగ‌మ స‌ల‌హాదారులు, ఉన్న‌తాధికారుల స‌మావేశం
  • ల‌డ్డూ అప‌విత్ర‌త నేప‌థ్యంలో సంప్రోక్ష‌ణ‌పై చ‌ర్చ
  • ప్ర‌ధాన అర్చ‌కుడు, ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చిస్తున్న టీటీడీ ఈఓ శ్యామ‌ల‌రావు    

శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాటు చేసింది. తిరుప‌తి ప‌రిపాల‌న భ‌వనంలో ఆగ‌మ స‌ల‌హాదారులు, ఉన్న‌తాధికారులు స‌మావేశ‌మ‌య్యారు. ల‌డ్డూ అప‌విత్ర‌త నేప‌థ్యంలో సంప్రోక్ష‌ణ‌పై ఈ భేటీలో చ‌ర్చిస్తున్నారు. 

ప్ర‌ధాన అర్చ‌కుడు, ఆగ‌మ పండితుల‌తో టీటీడీ ఈఓ శ్యామ‌ల‌రావు చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశంలో అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని టెస్టుల్లో తేలిందని టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడీ విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది.
Link to comment
Share on other sites

Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

21-09-2024 Sat 11:44 | Andhra
TTD Ready To Establish Lab For Checking Ghee

 

  • ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్‌ ల్యాబ్‌లో ఇటీవల లడ్డు శాంపిల్స్ పరీక్ష
  • అదే సంస్థతో నాణ్యతను పరిశీలించే మిషన్ల కోసం ఒప్పందం
  • డిసెంబర్ నాటికి తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు

తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాజా వివాదం నేపథ్యంలో ప్రముఖ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని ఇటీవల నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు.. సెంటర్ ఫర్ అనలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ (ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్) ల్యాబ్‌కు పంపింది.

ఈ సందర్భంగా వారితో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. నెయ్యిలో నాణ్యతను పరీక్షించే రూ. 75 లక్షల విలువైన పరికరాలు ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ సిద్ధమైంది. వీటిని దిగుమతి చేసుకున్న అనంతరం టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 2015-16లో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దానిని పట్టించుకునేవారు లేకపోవడంతో అది కాస్తా మరుగున పడింది. రిటైర్డ్ ఉద్యోగి ఒకరు నాణ్యత పరీక్షలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Link to comment
Share on other sites

Tirumala Laddu: తిరుపతి లడ్డు ప్రసాదం వివాదం ఎఫెక్ట్: ప్రసాదం నాణ్యతపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపెయిన్

21-09-2024 Sat 11:25 | National
Amid Tirupati row Rajasthan govt to run special campaign for prasad quality check

 

  • తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయన్న ఆరోపణ
  • రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాన్ని పరీక్షించాలని రాజస్థాన్ నిర్ణయం
  • ఇందుకోసం ప్రత్యేకంగా బృందం ఏర్పాటు

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో సమర్పించే భోగం, ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ విభాగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపనుంది. 

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇందుకోసం ప్రత్యేకంగా ‘శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్’ అనే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజూ ప్రసాదం తయారుచేసే పెద్దపెద్ద ఆలయాల్లోనూ విచారణ జరపనున్నట్టు ఆహార భద్రత విభాగాపు అదనపు కమిషనర్ పంకజ్ ఓఝా తెలిపారు. ఇందులో భాగంగా ప్రసాదానికి ఉపయోగించే వివిధ పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తారు. రాష్ట్రంలో 54 ఆలయాలు ఇప్పటి వరకు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతను పరీక్షించడంతోపాటు పరిశుభ్రతను కూడా పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...