Jump to content

ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు: కార్తి


Hitman

Recommended Posts

3 minutes ago, Mr Mirchi said:

Veedu anna matalo thappu emundhi pk alaa react avvataniki

koncham over chestunnadu ani nuvve cheppav gaaa... PK showing this level of aggression is not justified. 

Link to comment
Share on other sites

10 minutes ago, Mr Mirchi said:

Veedu anna matalo thappu emundhi pk alaa react avvataniki

He is a Hindu right? why cant he comment? and why to laugh for that? if he is not interested in commenting he could have said i will talk about it at another occasion. do u expect same from a Turk?

Link to comment
Share on other sites

Pawan Kalyan: లడ్డూ ఇష్యూ.. హీరో కార్తీ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం 

24-09-2024 Tue 13:30 | Andhra
Pawan comments on Actor Kart
 

 

  • కార్తీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో లడ్డూ టాపిక్
  • లడ్డూ మీద జోకులేస్తున్నారని పవన్ మండిపాటు
  • సనాతన ధర్మానికి మద్దతుగా ఉండాలని హితవు
తమిళ హీరో కార్తీని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డూను ఉద్దేశించి కార్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వివరాల్లోకి వెళ్తే... హీరో కార్తీ తాజా చిత్రం 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో... 'లడ్డూ కావాలా నాయనా' అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డూ గురించి వద్దు... అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. 'మీకోసం మోతిచూర్ లడ్డూ తెప్పిస్తాం' అని యాంకర్ అడగడంతో... ఇప్పుడు వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరబూశాయి. 

ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని... లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలని అన్నారు. లడ్డూ మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని... అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. మీమీద తనకు గౌరవం ఉందని... మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్... ఒక మాట మాట్లాడే ముందు వెయ్యిసార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతనధర్మాన్ని గౌరవించాలని... మీరు అభిమానించే హీరోలకంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Link to comment
Share on other sites

1 hour ago, Hitman said:

koncham over chestunnadu ani nuvve cheppav gaaa... PK showing this level of aggression is not justified. 

valla anna, vaadu Jagan supporters baa..there is always some hidden reasons behind these aggressions, comments..

  • Thanks 1
Link to comment
Share on other sites

danini support cheyaledu, joke vesukunnadu.. ela react avvalo kooda velle decide avutara? Siggundaali. ayina daaniki okkadinanna jail lo veyaledu, political issue chestu tirugutunnaru.. rosham vunte iragadeeyandi chesina vallani. Pawala budhi.

Link to comment
Share on other sites

okka arrest ledu power lo undi .. deniki press meet petti chunchukuntunnadu pk bhayya teliyetledu. evaranna gurtu cheyyandi vadu ippudu opposition kadu power lo unnadu he is dy cm ani. 

 

Link to comment
Share on other sites

34 minutes ago, Jatka Bandi said:

danini support cheyaledu, joke vesukunnadu.. ela react avvalo kooda velle decide avutara? Siggundaali. ayina daaniki okkadinanna jail lo veyaledu, political issue chestu tirugutunnaru.. rosham vunte iragadeeyandi chesina vallani. Pawala budhi.

ap mottam lo evaru laddu meeda sambandam leni joke kuda veyyakudada pk deeksha ayipoyedaaka? em rajyammngam bhayya idi? karthi gadu did not even make any direct comment on anything. so now they are coming for people who says no-comment too? 

Link to comment
Share on other sites

Pawan Kalyan: కార్తీ క్షమాపణ తెలియజేయడం పట్ల పవన్ కల్యాణ్ స్పందన 

24-09-2024 Tue 21:51 | Andhra
Pawan Kalyan responds on Karthi apology
 

 

  • 'సత్యం సుందరం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూపై వ్యాఖ్యలు
  • అసహనం ప్రదర్శించిన పవన్
  • క్షమాపణ తెలియజేసిన కార్తీ
  • హృదయపూర్వకంగా అభినందించిన పవన్
సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూ అంశంపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరో కార్తీ, తదితరులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో, కార్తీ వెంటనే పవన్ కు క్షమాపణలు తెలియజేశారు. ఓ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. 

"డియర్ కార్తీ గారూ... మీరు చూపించిన సహృదయత, మన సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం, మీరు వెంటనే స్పందించిన తీరు పట్ల అభినందిస్తున్నాను. 

తిరుపతి పుణ్యక్షేత్రం, లడ్డూలు అనేవి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన తీవ్ర భావోద్వేగభరిత అంశాలు. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో అవసరం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకున్నానే తప్ప నాకు మరే ఉద్దేశం లేదు. 

మీ కార్యక్రమంలో లడ్డూ ప్రస్తావన కాకతాళీయంగా వచ్చిందన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులుగా మనం మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా ఐక్యతను, గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యతను కలిగి ఉండాలి. ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. 

అంతేకాదు, మీలోని నటనా ప్రతిభకు నేను అభిమానిని. మీరు అంకితభావంతో ఎంతో స్థిరంగా మన సినిమా రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఇక, మీ కొత్త చిత్రం 'సత్యం సుందరం' విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సూర్యా గారికి, జ్యోతిక గారికి, యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...