Jump to content

Tirumala peace protected


psycopk

Recommended Posts

Jagan: ఇది రాక్షస రాజ్యం... తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటున్నారు: జగన్ ప్రెస్ మీట్ 

27-09-2024 Fri 16:10 | Andhra
Jagan fires on AP Govt
 

 

  • స్వామిని దర్శించుకునేందుకు మాజీ సీఎంకు హక్కు లేదా? అని జగన్ ప్రశ్న
  • లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
  • తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం
తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఇవాళ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... దేవుడి దగ్గరకు వెళుతుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని... ఇది బీజేపీ పెద్దలకు తెలుసో? తెలియదో? అని జగన్ చెప్పారు. తిరుమలకు అనుమతి లేదంటున్నారని... మాజీ సీఎంకు స్వామిని దర్శించుకునే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. 

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.

తప్పులు చేయలేని విధంగా టీటీడీ వ్యవస్థ ఉంటుందని జగన్ చెప్పారు. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే టీటీడీ బోర్డులో ఉంటారని... వారే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. టీటీడీ టెండర్ల ప్రక్రియలో బోర్డుకు ప్రమేయం ఉండదని చెప్పారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికే ఆర్డర్లు ఇస్తారని తెలిపారు. టీటీడీ చరిత్రలో తొలిసారి లడ్డూ శాంపిల్ ను గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించారని అన్నారు.
Link to comment
Share on other sites

Silent ga family tho vachi darsanam cheskoni dobeyi… palana date ki vastuna ani ora kukkalaku paytm dogs ni veskoni vachi gabbu chesi akkada politics chesi ravatam kadu

Link to comment
Share on other sites

Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు 

27-09-2024 Fri 14:50 | Andhra
Jagan Tiruamala visit canceled
 

 

  • కొనసాగుతున్న శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం
  • నేడు తిరుమల చేరుకుని, రేపు శ్రీవారిని దర్శించుకోవాలని భావించిన జగన్
  • చివరి నిమిషంలో పర్యటన రద్దు నిర్ణయం!
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి. 

మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా...? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాసేపట్లో జగన్ మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

 

Bhumana Karunakar Reddy: జగన్ ఎందుకు సంతకం చేయాలి?: భూమన కరుణాకర్ రెడ్డి 

27-09-2024 Fri 15:18 | Andhra
Why should Jagan sign declaration asks Bhumana Karunakar Reddy
 

 

  • తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టరన్న భూమన
  • సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకుంటామని వ్యాఖ్య
  • తమను ఎవరూ అడ్డుకోలేరన్న టీటీడీ మాజీ ఛైర్మన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిపై తమకు విశ్వాసముందంటూ డిక్లరేషన్ లో జగన్ సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. 

డిక్లరేషన్ పై జగన్ ఎందుకు సంతకం పెట్టాలని భూమన ప్రశ్నించారు. జగన్ ఆ పని చేయరని స్పష్టం చేశారు. సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పారు. తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు చివరి క్షణంలో తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకోవడం గమనార్హం. 


 

 

Link to comment
Share on other sites

Chandrababu: ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధనలను పాటించాల్సిందే: చంద్రబాబు 

27-09-2024 Fri 15:03 | Andhra
Everyone should follow the rules of Tirumala says Chandrababu
 

 

  • తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు
  • భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వ్యాఖ్య
  • ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విన్నపం
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయరంగు పులుముకుంది. తిరుమల పర్యటనకు వెళుతున్నానని జగన్ ప్రకటించిన తర్వాత... ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం చెప్పారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని అన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని అన్నారు.

భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. 'ఓం నమో! శ్రీ వెంకటేశాయ నమః' అని ట్వీట్ చేశారు.

మరోవైపు, జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు.
Link to comment
Share on other sites

Anam Venkataramana Reddy: వందేళ్ల క్రితమే వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుంది... అప్పటి నుంచి వాళ్లు క్రీస్తునే నమ్ముతున్నారు: ఆనం 

27-09-2024 Fri 14:11 | Andhra
YS Jagan family took Christianity 100 years back says Anam Venkataramana Reddy
 

 

  • జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగిందన్న ఆనం
  • వైఎస్ సమాధి వద్ద శిలువ ఉంటుందని వ్యాఖ్య
  • తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనన్న ఆనం
వైసీపీ అధినేత జగన్ ఒక హాఫ్ టికెట్ అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందువా? లేక క్రిస్టియనా? అని ప్రశ్నించారు. వందేళ్ల క్రితం 1925లో వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుందని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం ఏసుక్రీస్తునే నమ్ముతోందని తెలిపారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అందరూ క్రైస్తవులేనని చెప్పారు. 

జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగిందని వెంకటరమణారెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, భారతి తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగాయని చెప్పారు. వైఎస్ సమాధి వద్ద శిలువ ఉంటుందని అన్నారు. జగన్ క్రిస్టియన్ కాకపోతే అక్కడున్న శిలువను తొలగించాలని చెప్పారు. క్రైస్తవులను కూడా జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐకి ఇచ్చిన అఫిడవిట్ లో జగన్ తనను క్రిస్టియన్ గానే చెప్పుకున్నాడని తెలిపారు. 

జగన్ ఏదో ఒక మతంలో మాత్రమే ఉండాలని ఆనం అన్నారు. జగన్ హిందువయితే... తల్లి, భార్య, కూతుళ్లతో కలిసి తిరుమలకు రావాలని... స్వామివారికి జగన్ తలనీలాలు సమర్పించాలని చెప్పారు. జగన్ కుటుంబమంతా దొంగలేనని అన్నారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాం వంటి గొప్ప వాళ్లు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకాలు చేశారని... నువ్వు వాళ్ల కంటే గొప్పవాడివా? అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనని అన్నారు.

ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ సుబ్బిగా నువ్వు గురుస్వామివా? అని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు వైవీ సుబ్బారెడ్డి పింక్ డైమండ్ కేసును విత్ డ్రా చేసుకోవాలనుకున్నాడని... అయితే కోర్టు అంగీకరించలేదని చెప్పారు. పొన్నవోలు కనపర్తిపాడులో పందులు మేపేవాడని... అందుకే పంది కొవ్వు ధరలు చెపుతున్నాడని ఎద్దేవా చేశారు.
Link to comment
Share on other sites

Idi basic ra meru chesina diku malina paniki denili kutra em undi..

YSRCP: తిరుప‌తిలో జ‌గ‌న్‌పై దాడికి కుట్ర‌... వైసీపీ సంచ‌ల‌న‌ ట్వీట్‌ 

27-09-2024 Fri 13:18 | Andhra
YSRCP Sensational Tweet about Attack on YS Jagan in Tirupati
 

 

  • శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమల వెళ్ల‌నున్న‌ జగన్
  • భక్తుల ముసుగులో ఆయ‌న‌పై దాడికి కుట్ర అంటూ వైసీపీ ట్వీట్‌
  • భానుప్రకాశ్, కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు వెల్ల‌డి
తిరుపతిలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహ‌న్ రెడ్డిపై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమలకి జగన్ వెళ్ల‌నున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయ‌న‌పై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జ‌నసేన‌), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు వైసీపీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. 

జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని పేర్కొంది. తిరుమలలో జ‌గ‌న్‌ పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్ర‌బాబు? అంటూ వైసీపీ ప్ర‌శ్నించింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.
Link to comment
Share on other sites

YS Sharmila: చంద్రబాబుకు ఓట్లు పడటానికి కారణం ఇదే: షర్మిల 

27-09-2024 Fri 10:43 | Telangana
YS Sharmila on Chandrababu win in AP
 

 

  • జగన్ పై వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయన్న షర్మిల
  • చంద్రబాబును 38 శాతం ఓటర్లు వద్దనుకున్నారని వ్యాఖ్య
  • ఏపీకి కాంగ్రెస్ మనుగడ చాలా ముఖ్యమన్న షర్మిల
వైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కూటమి పార్టీలపై ప్రేమతో ఓట్లు పడలేదని ఆమె చెప్పారు. చంద్రబాబు సీఎంగా వద్దు అనుకున్న ఓటర్లు కూడా 38 శాతం మంది ఉన్నారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏపీకి ఎంతో అవసరమని షర్మిల చెప్పారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని... ఆ ఎన్నికలను ప్రతి కార్యకర్త సవాల్ గా తీసుకోవాలని చెప్పారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. 

అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉండేలా చూసుకోవాలని పార్టీ నేతలకు షర్మిల చెప్పారు. కింది స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం జరగాలని అన్నారు. బీజేపీపై చంద్రబాబు, జగన్ ఇద్దరూ మాట్లాడరని... ఒకరు అధికారికంగా, మరొకరు ఆ పార్టీతో లాలూచీపడి పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై అక్టోబర్ 2న నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...