Jump to content

శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? ఒక్కరోజు కూడా ఆగలేరా’


Undilaemanchikalam

Recommended Posts

HYDRA: ఎందుకింత దూకుడు

‘అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? ఒక్కరోజు కూడా ఆగలేరా’ అని హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది.

ఒక్క రోజు కూడా ఆగలేరా.. హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి?
వ్యక్తిగతంగా హాజరై వివరణివ్వండి
హైడ్రా కమిషనర్, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌లకు హైకోర్టు ఆదేశం

ఎందుకింత దూకుడు!

ఈనాడు, హైదరాబాద్‌: ‘అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? ఒక్కరోజు కూడా ఆగలేరా’ అని హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలోనే రెండు పిటిషన్లలో అడిగామని, మళ్లీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం నోడల్‌ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్‌లో మహమ్మద్‌ రఫీ, గణేష్‌ కన్‌స్ట్రక్షన్‌లకు చెందిన ఆసుపత్రి భవనం కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. ఈ భవనానికి సంబంధించి చట్టప్రకారం వ్యవహరించాలంటూ సెప్టెంబరు 5వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్, హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన కూల్చివేతలపై ఈనెల 30వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అమీన్‌పూర్‌ తహసీల్దార్, హైడ్రా కమిషనర్‌లకు ఆదేశాలిచ్చింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేని పక్షంలో ఆన్‌లైన్‌లో అయినా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈలోగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ వివరణను సమర్పించాలని దాని తరఫు న్యాయవాదిని ఆదేశించింది. అమీన్‌పూర్‌లోని సర్వే నం.164లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20వ తేదీన తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసును సవాల్‌చేస్తూ డాక్టర్‌ మహమ్మద్‌ రఫీ, అమీన్‌పూర్‌కు చెందిన గణేష్‌ కన్‌స్ట్రక్షన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది నరేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 20న జారీచేసిన నోటీసులు 21న సాయంత్రం 6.30కి అందజేసి, 22న ఉదయం 7.30 గంటలకు జేసీబీ, బుల్డోజర్లు, 50మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్నారు. వాస్తవంగా సర్వే నం.165, 166లోని మహమ్మద్‌ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేష్‌ కన్‌స్ట్రక్షన్‌కు విక్రయించారన్నారు. ఇందులో 2022 నవంబరు 10వ తేదీన పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో హైడ్రా తరఫు న్యాయవాది తన వాదనల్లో.. ఆసుపత్రి ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడూ సందర్శించలేదని, కూల్చివేయాలని అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఏవైనా చర్యలు చేపడితే జీవో 99 ప్రకారం ఉంటాయని న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో పిటిషన్‌పై సెప్టెంబరు 5న హైకోర్టు విచారణను మూసివేసిందన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించడానికి యంత్రాలు, సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్‌ లేఖ ఈ నెల 21వ తేదీన అందిందని.. జీవో 99, తహసీల్దార్‌ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ నిమిత్తం యంత్రాలు, సిబ్బందిని పంపినట్లు తెలిపారు. 

 

కాగా పిటిషన్లపై విచారణ ముగిసేదాకా.. కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో ఉత్తర్వులున్నాయని, వాటితోపాటు జీవో 99 ప్రకారం చట్ట నిబంధనలను అనుసరించాలని హైడ్రాను ఆదేశిస్తూ సెప్టెంబరు 5న జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్, హైడ్రా కమిషనర్‌ కూల్చివేతలు చేపట్టారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

Link to comment
Share on other sites

5 hours ago, Joker_007 said:

maa employees andariki Sugar Undi . emaina vaste aapukolem antunna HYDRA.. 

alaney undi bro.. saw in news today oka avida home hydra Vallu demolish cheystharu emo ani chanipoyindhi.. main stream media cover cheyatam ledu..

Link to comment
Share on other sites

57 minutes ago, akkum_bakkum said:

Did they knowingly bought the property or the venture ppl mislead the buyers?

Venture hmda approved or gram panchayat  approved bank loan vachindi, inka emi chestadu anna buyer

Poyi inka research cheyala endi oka employee with his savings and dream , malli registration fee kuda tiuskoni register chesaru

 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Sreeven said:

Asalu first avi register chesina vallani jail lo veyyali..including govr..real estate dabbulu kosam valle anni animathulu istunnaru

Alani jail lo vesthe bestaru emo anna according to guidelines of hmda govt etc evadni jail lo vesthe buyer ki emi vastadi ? Okadu savings tho konukunadu 10 years back evadni jail lo vesthe vidiki emi vastadi??

He lost his life savings 

Link to comment
Share on other sites

3 hours ago, Sreeven said:

Asalu first avi register chesina vallani jail lo veyyali..including govr..real estate dabbulu kosam valle anni animathulu istunnaru

That is the problem here.  I will make a post.

Link to comment
Share on other sites

3 hours ago, akkum_bakkum said:

Did they knowingly bought the property or the venture ppl mislead the buyers?

The other one Kaka.. there is solid backup statement they use for this "Hyderabad antha inthe no property is clean" 

Link to comment
Share on other sites

21 hours ago, csrcsr said:

Alani jail lo vesthe bestaru emo anna according to guidelines of hmda govt etc evadni jail lo vesthe buyer ki emi vastadi ? Okadu savings tho konukunadu 10 years back evadni jail lo vesthe vidiki emi vastadi??

He lost his life savings 

Ade kada, govt officers ni jail lo vesi janalaki dabbulu pay chesi kulchukomanali..Kumari aunty story gurthunda, same cm traffic police laki eam cheppadu. 

Link to comment
Share on other sites

19 hours ago, kakatiya said:

That is the problem here.  I will make a post.

Kastapadina dabbulu pothe telustundi..evo chesina mistake ki common people suffer aithe a pain e love da lo politicians ki eam telustundi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...