Jump to content

బీరుట్‌లో జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది.


BattalaSathi

Recommended Posts

Y€zboo11@h Chief ni lepi para 10ngina B1B1 Net@ny@h00 ('s army) - aadu magadra bujji ... Nee yavva..ekkado vaani desham lo dakkuna naa kodukunu kooda kalugu lo unna eluka ni sampinattu sampi para 10ngaru .. neeku dandam saami ..

 
 
eenadu.net
 

Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మృతి.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌

Eenadu
3–4 minutes

Hassan Nasrallah: బీరుట్‌లో జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది.

Updated : 28 Sep 2024 14:50 IST

280924Nasrallah_1.webp

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెజ్‌బొల్లా (Hezbollah) లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ (Israel) శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు’’ అని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్‌ వార్‌ రూమ్‌ దీనిపై స్పందించింది. ‘ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌’ మిషన్‌ విజయవంతమైనట్లు వెల్లడించింది.

శుక్రవారం రాత్రి దక్షిణ లెబనాన్‌ (Lebanon)లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఐడీఎఫ్‌ (IDF) వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నస్రల్లా ఇదే కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్‌ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఇందులో నస్రల్లా సహా ఎవరూ బతికే అవకాశాలు లేవని ఆ తర్వాత ఐడీఎఫ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా అతడు మృతిచెందినట్లు ధ్రువీకరించింది.

కూరగాయల వ్యాపారి కొడుకు.. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు: ఎవరీ నస్రల్లా..?

ఈ దాడుల్లో ఆరుగురు మృతిచెందినట్లు లెబనాన్‌ ఆరోగ్య శాఖ  ప్రకటించింది. నస్రల్లా మరణ వార్తలపై హెజ్‌బొల్లా ఇంకా స్పందించలేదు. అయితే, నిన్న రాత్రి నుంచి అతడు కాంటాక్ట్‌లో లేడని హెజ్‌బొల్లా వర్గాలు వెల్లడించాయి. అటు నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దక్షిణ బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో జైనబ్‌ నస్రల్లా మరణించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆమె మృతిని కూడా హెజ్‌బొల్లా గానీ, లెబనాన్‌ అధికారులు గానీ ధ్రువీకరించలేదు.

శనివారం ఉదయం కూడా లెబనాన్‌లోని బెకా వ్యాలీలో ఐడీఎఫ్‌ వైమానిక దాడులతో విరుచుపడింది. ఇందులో హెజ్‌బొల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ మహమ్మద్‌ అలీ ఇస్మాయిల్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. మరోవైపు, బీరుట్‌లో దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది.

 
 

 

Link to comment
Share on other sites

Apparently BN speech at UN was a distraction.  Vaadu em septhado ani ee pichollu andaru Beirut lo oka chota cheri chicken 65 thintoo soosthunnattunnaru.  Andaru oka chota cheraru ani confirm chesukunnaka, Isr@e1 by@@mbu lagaa dengey ... em planning raa nee ayya BN and 1sr@e1 army..#Respect

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...