Jump to content

Chandrababu - సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు 


psycopk

Recommended Posts

Chandrababu - సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు 

04-10-2024 Fri 12:42 | Andhra
Chandrababu Says Welcome the Honourable Supreme Court order of setting up SIT on Adulteration of Tirupati Laddu
 

 

  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్‌తో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
  • ఐదుగురు సభ్యులతో స్వ‌తంత్ర‌ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచ‌న‌
  • సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్ర‌బాబు
  • సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు పేర్కొన్న ముఖ్య‌మంత్రి

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. ఐదుగురు సభ్యులతో స్వ‌తంత్ర‌ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఉండాల‌ని సూచించారు. 

ఇక అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పును సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తించారు. సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. "తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

 

 

Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    21

  • Android_Halwa

    4

  • vetrivellunza

    2

  • Joker_007

    1

Supreme Court: తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వివాదంపై విచార‌ణ‌.. స్వతంత్ర సిట్ కు సుప్రీంకోర్టు ఆదేశం 

04-10-2024 Fri 11:29 | National
Supreme Court Key Decision on Tirumala Lauddu Adulteration Issue
 

 

  • సిట్ విచార‌ణ‌పై ఎలాంటి సందేహాలు లేవ‌న్న సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్
  • స్వతంత్ర ద‌ర్యాప్తు జ‌రిగితే మంచిదేన‌న్న అత్యున్న‌త న్యాయ‌స్థానం
  • సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు స‌భ్యుల‌తో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశం  
తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ తో విచార‌ణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారణ చేపట్ట‌గా ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.
 
సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా అభిప్రాయం కోరిన విష‌యం తెలిసిందే. దీంతో సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ సిట్ విచార‌ణ‌పై త‌మ‌కు ఎలాంటి సందేహాలు లేవు అని అన్నారు. అయితే, సిట్‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఇక స్వతంత్ర ద‌ర్యాప్తు జ‌రిగితే మంచిదేన‌ని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో  ద‌ర్యాప్తు సంస్థ‌లో ఐదుగురు స‌భ్యులు ఉండాల‌ని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్ద‌రు, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఇద్ద‌రితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాల‌ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జ‌రిపింది.
Link to comment
Share on other sites

Jaggadiki shivering started

 

YS Jagan: వైసీపీ కీల‌క నేత‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం 

04-10-2024 Fri 13:06 | Andhra
YS Jagan Meet YSRCP Key Leaders
 

 

  • తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు తీర్పు
  • ఈ విష‌య‌మై పార్టీ కీల‌క నేత‌ల‌తో అధినేత జ‌గ‌న్ భేటీ
  • సీనియ‌ర్లు బొత్స, క‌న్న‌బాబు స‌హా ప‌లువురు నేత‌ల హాజ‌రు
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విష‌యమై వారితో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. 

సీనియ‌ర్ నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, క‌న్న‌బాబు స‌హా ప‌లువురు నేత‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. స్వ‌తంత్ర సంస్థతో విచార‌ణ జ‌ర‌పాల‌న్న సుప్రీంకోర్టు ఆదేశాల‌పై స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. 

కాగా, మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు జ‌గ‌న్ మీడియా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడ‌నున్నారు. ఇక సీఎం చంద్ర‌బాబు సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన విష‌యం తెలిసిందే. స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు. 

 

 

Link to comment
Share on other sites

Tirumala Laddu Row: విజిలెన్స్ విచారణ అనగానే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు?: హోంమంత్రి అనిత 

04-10-2024 Fri 14:37 | Andhra
AP Home Minister Anitha responds on Surpeme Court verdict over Tirumala Laddu row
 

 

  • తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు
  • స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
  • సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఏపీ హోంమంత్రి అనిత
  • స్వతంత్ర సిట్ దర్యాప్తుతో నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని వెల్లడి
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 

లడ్డూ వ్యవహారం అనేది సెంటిమెంట్లతో కూడిన విషయం అని, కల్తీ జరిగిందని తెలిశాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసిందని అన్నారు. కల్తీ జరిగిందన్న ఆరోపణలు రాగానే, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. 

సరిగ్గా గమనిస్తే... తప్పు చేయని వాళ్లు భయపడరు... కానీ విజిలెన్స్ విచారణ అనగానే వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు? అని అనిత ప్రశ్నించారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు నేడు ప్రస్తావించిందని వెల్లడించారు. 

సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యమేనని... సీబీఐ అధికారులు, స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. ఇప్పుడు నిజానిజాలు తేలాలి... సిట్ దర్యాప్తుతో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయి అని అనిత స్పష్టం చేశారు. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...