BattalaSathi Posted October 6 Report Share Posted October 6 bedmate kooda ..maaku thelusule ookovamma antunna db youth tharuvatha deeni cheelli peru kooda Samantha ne ani thelisi mookummadigaa tongue bite chesukunna adhe db youth. సమంత నా సోల్‌మేట్: శోభితా ధూళిపాళ Eenadu 5–6 minutes సమంత నా సోల్‌మేట్: శోభితా ధూళిపాళ మిస్ ఇండియా పోటీలతో జీవితం మొదలుపెట్టి... మోడల్‌గా అవకాశాలు దక్కించుకుంది. నటిగానూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది శోభిత ధూళిపాళ. బాలీవుడ్‌లోనూ, దక్షిణాది భాషల్లోనూ, Updated : 06 Oct 2024 17:48 IST మిస్ ఇండియా పోటీలతో జీవితం మొదలుపెట్టి... మోడల్‌గా అవకాశాలు దక్కించుకుంది. నటిగానూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది శోభిత ధూళిపాళ. బాలీవుడ్‌లోనూ, దక్షిణాది భాషల్లోనూ, ఓటీటీ సిరీస్‌లోనూ నటిస్తున్న ఈ తెలుగందం.. ఇటీవల హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్యతో ఏడడుగులు వేయబోతున్న శోభిత తన గురించి ఏం చెబుతోందంటే... లక్ష్యం లేకుండానే సినీ రంగంలోకి వచ్చా. మోడల్‌గా ఆడిషన్స్‌కు వెళ్లే క్రమంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఎంతో బాధపెట్టాయి. కానీ అవే తెలియకుండా నాలో పట్టుదలనీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి. ఇప్పుడవి గుర్తు చేసుకుంటే... నా ప్రయాణం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను పుట్టింది తెనాలిలో. నాన్న నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేయడంతో అక్కడే పెరిగా. అమ్మ టీచర్. ఇంట్లో కేబుల్ కనెక్ష్షన్కు బదులు లైబ్రరీ ఉండేది. చదవడాన్ని హాబీగా మార్చుకున్న నేను ఊహ తెలిశాక చదివిన తొలి పుస్తకం ‘బుడుగు’. ఇంటర్లో ఉన్నప్పుడు ఆర్థిక విషయాలకు సంబంధించిన వార్తలు చదివేదాన్ని. రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేయాలని కలలు కనేదాన్ని. క్లాస్‌లో వాళ్లు ‘రణ్‌బీర్ అంటే క్రష్, ఫలానా హీరో’ చాలా ఇష్టం అని మాట్లాడేవారు. నేనేమో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్, చిదంబరం, శశిథరూర్ గురించి చెబుతుంటే అంతా నన్ను వింతగా చూసేవారు. వైజాగ్‌లో ఇంటర్ అయ్యాక ముంబయి వచ్చి డిగ్రీలో చేరా. అప్పుడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయాలని ప్రయత్నించా. ఈ క్రమంలో తెల్లగా లేనని ఎందరో విమర్శించారు. ఓ షాంపూ యాడ్ కోసం ఆడిషన్‌కి వెళితే నువ్వు బ్యాక్‌గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావన్నారు. ఇంటికెళ్లి అద్దంలో చూసుకుని బాధపడిన రోజులెన్నో. నిదానంగా ఆ ఆలోచనల్లోంచి బయటపడ్డా. అందం అనేది ఎదుటివారి ఆలోచనలకు సంబంధించిన విషయం కాబట్టి నా రూపాన్ని చూసి ఎవరు ఏమనుకుంటారోనని ఆలోచించడం మానేశా. నాతో నిత్యం మాట్లాడే కొందరు స్నేహితులు ‘నీ వాయిస్ బాగుంది’ అనేవారు. ఆ మాటలు నాలో ఉత్సాహాన్ని నింపడంతో ఆడిషన్స్‌కు వెళుతూనే ఉండేదాన్ని. దాదాపు వంద ఆడిషన్లకు హాజరైన నాకు 2016లో అనురాగ్ కశ్యప్ ‘రామన్ రాఘవ్ 2.0’లో అవకాశం వచ్చింది. అంతేకాదు ఒకప్పుడు నన్ను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ ఐశ్వర్యరాయ్ పక్కన యాడ్‌లో నటించ మనడంతోపాటు, తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగింది. ‘గూఢచారి’, ‘కురుప్’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్-1’, ‘పొన్నియిన్ సెల్వన్-2’, ‘లవ్సితార’ సినిమాలూ; ‘మేడిన్ హెవెన్’, ‘ద నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లు నాకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఈ మధ్య ‘మంకీ మ్యాన్’అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించా. వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరిగే ఎమ్మీ అవార్డుల నామినేషన్స్‌కు భారత్ నుంచి- నేను నటించిన ‘ద నైట్ మేనేజర్’ ఎంపికవడం ఎంతో సంతృప్తినిస్తోంది. ‘కల్కి’లో దీపిక పదుకొణెకి డబ్బింగ్ చెప్పడం ఓ ప్రత్యేక అనుభూతి. మా చెల్లి సమంత నా సోల్‌మేట్ . ఈ మధ్యనే తన పెళ్లైంది. కెరీర్లో బిజీగా ఉండి కుటుంబానికీ, బంధువులకీ దూరంగా ఉన్నా. చెల్లి పెళ్లిలో అందర్నీ కలుసుకున్నా. అన్ని పనులూ చూసుకుంటూనే నేనూ చెల్లిలా తయారవ్వాలనుకున్నా. కానీ బాధ్యతల వల్ల కుదరలేదు. అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న సమంతను చూసినప్పుడు మాత్రం ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. నా జీవితంలోని కొన్ని బెస్ట్ మూమెంట్స్‌లో అదీ ఒకటి. నాకు భక్తి ఎక్కువే. ఉదయాన్నే పూజ చేయడం, సూర్యాష్టకం చదవడం అలవాటు. వీలు కుదిరినప్పుడల్లా గుళ్లకు వెళుతుంటా. నేను శాకాహారిని. వంట చాలా బాగా చేస్తా. బయటకు వెళ్లినప్పుడు ఇంటి భోజనం తీసుకెళుతుంటా. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు ఎంతిష్టమో. చిన్నప్పట్నుంచీ ఓ కోరిక మాత్రం ఉండేది. అదే అమ్మ కావడం. అమ్మా అని పిలిపించుకోవడం, మాతృత్వపు మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తాయి. ఆ అనుభూతుల్ని నేనూ ఆస్వాదించా లనుకుంటున్నా. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇతరుల పట్ల దయ, కరుణ చూపించాలి. ఈ జీవితం చాలా చిన్నదన్న విషయాన్ని గుర్తించి ప్రతి క్షణాన్నీ ఆస్వాదించే లక్షణాలున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. చైతూ విషయాని కొస్తే తను చాలా మర్యాదస్తుడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతనిలో ఈ క్వాలిటీస్ బాగా నచ్చుతాయి. Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu2 Posted October 6 Report Share Posted October 6 Got it 1 Quote Link to comment Share on other sites More sharing options...
hunkyfunky2 Posted October 6 Report Share Posted October 6 13 minutes ago, jaathiratnalu2 said: Emi Anukunna kaani , This statements proves that she is very matured woman By this statement , she wons majority of people’s She is talking about her real sister, whose name is also Samantha 1 Quote Link to comment Share on other sites More sharing options...
Gorantlamdhav Posted October 6 Report Share Posted October 6 17 minutes ago, jaathiratnalu2 said: Emi Anukunna kaani , This statements proves that she is very matured woman By this statement , she wons majority of people’s this statement proves that you read only title not matter 1 Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu2 Posted October 6 Report Share Posted October 6 4 hours ago, jaathiratnalu2 said: Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.