Jump to content

Banisa la padi undu.. mood vachinapudu musti vesta..


psycopk

Recommended Posts

YS Family Disputes: తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెక్కడం జగన్ క్రూరత్వానికి నిదర్శనం: సోమిరెడ్డి

24-10-2024 Thu 14:40 | Andhra
Somireddy take a dig at Jagan over family assets issue

 

  • రచ్చకెక్కిన వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం
  • గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకుంటానంటూ జగన్ లేఖ!
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షర్మిల
  • తండ్రినే ముద్దాయిని చేసిన వ్యక్తి జగన్ అంటూ సోమిరెడ్డి విమర్శలు
  • తల్లిని, చెల్లిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వ్యాఖ్యలు

వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి ఇవ్వబోనంటూ జగన్ లేఖ, అందుకు ప్రతిగా షర్మిల తీవ్రస్థాయిలో స్పందించడం తదితర అంశాలు మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. 

తల్లికి, చెల్లికి ఆస్తి ఇచ్చేది లేదంటూ జగన్ కోర్టుకెళ్లడం అతడి క్రూరత్వానికి నిదర్శనం అని విమర్శించారు. ఆస్తి విషయంలో తల్లిని, చెల్లిని బ్లాక్ మెయిల్ చేయడం దారుణమని పేర్కొన్నారు. 

"నిన్న ఆయన ఎన్సీఎల్టీకి ఒక ఫిర్యాదు చేశాడు. తల్లి, చెల్లికి ఇచ్చిన ఆస్తి పంపకంలో గిఫ్ట్ డీడ్స్ రద్దు చేయాలని కోరాడు. జగన్ మోహన్ రెడ్డి ఎంతటి క్రూరుడు అంటే... ఓట్లు కోసం నా తల్లి, నా చెల్లి, నా తండ్రి, నా అక్క అని మాట్లాడతాడు. కానీ సొంత కుటుంబం విషయంలో... తల్లికి, చెల్లికి ఆస్తి విషయంలో ఓ నిర్ణయం తీసుకుని, మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానంటున్నాడు. రాజకీయంగా తనకు దాసోహం కావాలని వారిని బెదిరిస్తున్నాడు. రాజకీయాలకు, ఆస్తులకు ఏమిటి సంబంధం? 

కోట్ల విలువ చేసే ప్రజా ఆస్తులు దోచుకుని కూడా తల్లికి, చెల్లికి ఇవ్వడానికి నీకు మనసొప్పడం లేదు. ఇది ఎవరి ఆస్తి?... ఇది ప్రజల ఆస్తి! ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టుకు వరకు వెళ్లి... ఇందులో నాకేం సంబంధం లేదు, అంతా మా నాన్నకి సంబంధించిన విషయం అని చెప్పిన వ్యక్తి... జగన్! 

మీ తండ్రి రాజశేఖర్ రెడ్డిని కేసులో పెట్టించిన గొప్పవాడివి నువ్వు. చనిపోయిన తండ్రిని ముద్దాయిని చేశావు... అది నీ క్రూర మనస్తత్వానికి ఒక నిదర్శనం! దేశంలో ప్రజల ఆస్తులు సొంతానికి కూడగట్టుకున్న వారిలో నీది రెండోస్థానం. తమరు కాంగ్రెస్ తో లాలూచీ పడుతున్నారు... బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారనేది బయటికి వచ్చింది. 

నీ పాపాలన్నీ కోర్టుల ముందున్నాయి... ఈ లోపు కేంద్రం ఎక్కడ కన్నెర్ర చేస్తుందోనని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టావు. కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కోసం ఈ లేఖ నీ నాటకంలో ఓ భాగం అయ్యుండొచ్చని తెలుస్తోంది" అంటూ సోమిరెడ్డి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Chandrababu: ఇలాంటి వాడితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉంది: చంద్రబాబు

24-10-2024 Thu 19:21 | Andhra
Chandrababu fires on Jagan

 

  • జగన్ ఆస్తి వ్యవహారంపై చంద్రబాబు స్పందన
  • చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు
  • ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదని వెల్లడి 

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆస్తి వ్యవహారంపై స్పందించారు. నీ మీద, అవినాశ్ మీద ఏమీ మాట్లాడకూడదా.... చెల్లికి ఆస్తి ఇవ్వడానికి ఇలాంటి కండిషన్ పెడతావా? అని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేసే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదని అన్నారు. ఛీ ఛీ... ఇలాంటి వాడితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

తల్లి మీద కోర్టుకు వెళ్లింది నువ్వు... చెల్లిని రోడ్డు మీదికి లాగింది నువ్వు... ఇవన్నీ నువ్వు చేసి, డైవర్షన్ పాలిటిక్స్ అని మా మీద పడి ఏడుస్తున్నావు అంటూ విమర్శించారు. మీ కుటుంబ విషయాలతో మాకేంటి సంబంధం? అని ప్రశ్నించారు. భర్త సంపాదించిన ఆస్తిలో మొదటి హక్కు భార్యకు రాదా? మీ తల్లిని నువ్వు కోర్టుకు లాగి, అందుకు మేమే కారణమంటే ఎలా? అని చంద్రబాబు నిలదీశారు. 

విలువలు లేని రాజకీయం చేస్తూ, అందులో హీరోయిజం చూపించాలని జగన్ అనుకుంటున్నాడు... ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవద్దని మీ పిల్లలకు చెప్పండి అని వ్యాఖ్యానించారు. ప్రపంచం ముందుకు పరిగెడుతోందని, ఇంకా ఈ విలువలు లేని మనుషుల గురించి మనం ఆలోచిస్తూ ఉండడం ఎందుకని చంద్రబాబు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు తిండిపెట్టవని, చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడవని అన్నారు. విలువలు లేని వ్యక్తులు సమాజానికి చేటు అని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వారిని ప్రజలు మర్చిపోవాలని పిలుపునిచ్చారు. 

గత ఐదేళ్లలో తనను స్వేచ్ఛగా బయట తిరగనివ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. "ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు కదా... నిన్నేమైనా నిలువరించామా మేము? నాకు చేతకాదనుకున్నావా? నాకు రాజకీయాలు తెలియవా? నిన్ను నిలువరించడం నాకు ఒక్క నిమిషం పని" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Perni Nani: చెల్లెలిపై ప్రేమ ఉండడం వల్లే జగన్ ఆస్తులు రాసిచ్చారు: పేర్ని నాని

24-10-2024 Thu 20:15 | Andhra
Perni Nani press meet over YS family assets row

 

  • రచ్చకెక్కిన జగన్ కుటుంబ ఆస్తుల వ్యవహారం
  • విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ నేతలు
  • జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారన్న పేర్ని నాని
  • అందుకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శలు

వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే టీడీపీకి ఏమాత్రం పట్టదని, కానీ పెద్ద భూకంపం వచ్చినట్టుగా, ఏపీ బద్దలైపోతుందన్నట్టుగా జగన్ కుటుంబ వ్యవహారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

దేశంలోనే మొదటిసారి... తల్లి, చెల్లిపై కేసులు పెట్టిన జగన్, మార్కెట్లోకి మరో సంచలనంతో వస్తున్న శాడిస్టు, ఇలాంటి కష్టం ఏ చెల్లికి రాకూడదు, సొంత తల్లిపై కేసులు పెట్టిన సైకో జగన్, చెల్లి షర్మిల రాజకీయ జీవితంపై జగన్ అసూయ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని తెలిపారు. ప్రజల్లో జగన్ స్థానాన్ని దెబ్బతీయాలని, రాజకీయంగా ఆయనను ఎదుర్కొనలేకపోతున్నాం కాబట్టి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. 

"రాజశేఖర్ రెడ్డి గారు మరణించకముందే ఆస్తుల పంపకాలు చేశారు. జగన్ కు ఇవ్వాల్సినవి జగన్ కు ఇచ్చారు... షర్మిలకు ఇవ్వాల్సినవి షర్మిలకు ఇచ్చారు... బంజారాహిల్స్ లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్లో 35 శాతం వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్  కంపెనీ నూటికి నూరు శాతం పంపకాలు చేశారు. 

ఇవే కాకుండా పలు కంపెనీలు కూడా ఉన్నాయి... జగన్ వ్యాపారంలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగే క్రమంలో భారతి సిమెంట్స్, సాక్షి పేపర్ ఏర్పాటయ్యాయి. పల్నాడులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటైంది. సరస్వతి సంస్థ ఇంకా ఏర్పాటు కాలేదు కానీ, భూ సేకరణ జరిగింది, అనుమతులు అన్నీ ఉన్నాయి. ఈ కంపెనీలు జగన్ స్వార్జితపు ఆస్తుల్లో భాగం. ఎన్నికల అఫిడవిట్, ఇతర రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 

నెల్లూరు జిల్లాలో ఒక పండితుడు ఉన్నాడు... ఐదారుసార్లు డింకీలు కొట్టి మొన్న గెలిచాడు! సరస్వతి సంస్థ భూములు గవర్నమెంట్ లీజు అని ఆ పండితుడు అంటున్నాడు. కానీ రైతులకు డబ్బులిచ్చి ఆ భూములు కొనుగోలు చేశారు" అని పేర్ని నాని వివరించారు. 

ఇక, చెల్లెలు షర్మిలపై ప్రేమ ఉండబట్టే జగన్ ఆస్తులు రాసిచ్చారని పేర్ని నాని స్పష్టం చేశారు. పొరుగింట్లో గొడవ జరిగితే చంద్రబాబుకు అంత ఆనందం ఎందుకు? కుటుంబ విషయాలను అడ్డంపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన ఆస్తుల్లో చెల్లెలికి వాటాలు ఎప్పుడైనా రాశారా? అని ప్రశ్నించారు.

షర్మిలపై జగన్ కు ప్రేమ ఉంది కాబట్టే, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టారని... ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తులు, వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చేశారని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
Link to comment
Share on other sites

ipudu sharmila vadanaki sakshyam vijayamma okate.. ame ni lepesevadu power lo unte.. she should be safe....leka pote inko goddali episode repeat avudi

Link to comment
Share on other sites

22 hours ago, psycopk said:

peekindi em ledu ani nuvvu ikkada kurchoni vagatam kadu... okadu okadu aaina chalu vij locals cheta chepinchu... dammu unte.. neku siggu seram unte.. ide challenge

 

Link to comment
Share on other sites

1 hour ago, RPG_Reloaded said:

 

paytm kukkalani kadu.. neku telisina vallaki call chesi kanuko... mari inta tolu mandam gadivi endi samara..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...