Jump to content

Bharathi ee range lo boosting istundi kabate talli ni chelli ni vella gotadu


psycopk

Recommended Posts

Saraswathi Power: పవన్ ఆదేశాలు... సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అధికారుల సర్వే 

26-10-2024 Sat 15:01 | Andhra
Officials takes up survey in Saraswathi Power lands after minister Pawan Kalyan orders
 

 

  • జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో తెరపైకి సరస్వతి పవర్ సంస్థ పేరు
  • ఈ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఉన్నాయని కథనాలు
  • సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు
  • కదిలిన అధికార యంత్రాంగం
జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ పేరు తెరపైకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ సంస్థకు చెందిన 1,515 ఎకరాల భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి. 

దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించి, సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత మేర అటవీ భూములు ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

పవన్ ఆదేశాల నేపథ్యంలో, నేడు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు. దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 

సర్వే అనంతరం అటవీశాఖ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి మంత్రి పవన్ కల్యాణ్ కు సమర్పించనున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    24

  • ntr2ntr

    2

  • nokia123

    2

  • TeluguTexas

    2

1 hour ago, HighlyRespected said:

@vetrivel papam ra jaganna

Why? He is rich and powerful this is jujubi to him

but you should really peeel sad for TS who is working '23' hours nonstop posting aganist Jagan and going crazy like a maniac, looks like he is addicted to Jagan too much that he will become another bharath if Jagan doesn't exist 🤣🤣

2guqil4hyqmb1.gif

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, ntr2ntr said:

Bangalore palace ki vellakpothe Sharmila  aa palace ni kabja chestundani veltunnadanta 🤣

Cbn went to Hyd 8 times so far over the weekends after he became cm. Of course Jagan is still leading anuko. But where is cbn when he is in opposition? 70% of the time he was in Hyd at that time.

Link to comment
Share on other sites

5 hours ago, TeluguTexas said:

Why? He is rich and powerful this is jujubi to him

but you should really peeel sad for TS who is working '23' hours nonstop posting aganist Jagan and going crazy like a maniac, looks like he is addicted to Jagan too much that he will become another bharath if Jagan doesn't exist 🤣🤣

2guqil4hyqmb1.gif

Kanna talli enduku kannana ani edustundi.. alanti nista daridrudi ki paytm iste chalu evadidi aaian oke anukune ilanti vallu unnata varaku he is safe

Link to comment
Share on other sites

YS Sharmila: కన్నతల్లిని కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా?: షర్మిల 

26-10-2024 Sat 21:35 | Andhra
Sharmila fires on Jagan and YV Subbareddy
 

 

  • జగన్-షర్మిల మధ్య ఆస్తుల పంపకం వివాదం
  • జగన్ కు మద్దతుగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
  • వైవీకి కౌంటర్ ఇచ్చిన షర్మిల
జగన్ ఆస్తుల్లో వాటా ఉందంటూ షర్మిల చెబుతున్నదే నిజమైతే ఆమెపై ఈపాటికే ఈడీ కేసులు నమోదు చేసి ఉండేది కదా అంటూ వైవీ సుబ్బారెడ్డి నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. పేర్లు పెట్టుకుంటే ఆస్తులు ఇవ్వాలని ఉందా అని సుబ్బారెడ్డి అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన కుమారుడికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పేరు పెట్టుకోవడం తెలిసిందే. 

ఇక, ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్లాలి అని సుబ్బారెడ్డి అన్నారు... మరి ఆస్తులు భారతికి చెందినవి అయితే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా అని షర్మిల ప్రశ్నించారు. సుబ్బారెడ్డి నిన్న ఆలోచించి మాట్లాడితే బాగుండేది అని పేర్కొన్నారు. ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయని అంటున్నారు... కానీ కన్నతల్లిని కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా? కన్నతల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్ కీ కహానీయా? అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

"జగన్ ప్రయోజనాల కోసం నేను, అమ్మ చాలా కష్టపడ్డాం. జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్రలు చేశాను. ఓసారి ఏకంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నేను చేసిన తప్పేంటో చెప్పాలని వైసీపీ శ్రేణులను అడుగుతున్నా. 

జగన్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను... నా కోసం జగన్ ఏం చేశారు? ఆస్తులకు సంబంధించిన ఎంవోయూ పత్రాలు ఐదేళ్ల పాటు నా వద్దే ఉన్నాయి... ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఎంవోయూ నేను వాడుకోలేదు. వైఎస్ కుటుంబం గురించి చెడుగా చెప్పుకుంటారనే నేను మాట్లాడలేదు. విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరు? సొంత కొడుకే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా? ఇలాంటివి చూసేందుకే ఇంకా బతికున్నానని అమ్మ బాధపడుతోంది.  

లాభం కలుగుతుందని భావిస్తే జగన్ ఎవరినైనా వాడుకుంటారు. లాభం ఉండదని తెలిస్తే జగన్ ఎవరినైనా అణచివేస్తారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో, లేక ఉన్మాదో వైసీపీ శ్రేణులు ఆలోచించాలి" అని షర్మిల పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Sharmila: సుబ్బారెడ్డి... జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి: షర్మిల ఘాటు వ్యాఖ్యలు 

26-10-2024 Sat 18:04 | Andhra
Sharmila slams YV Subbareddy on assets issue
 

 

  • జగన్-షర్మిల ఆస్తుల వివాదంలో సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
  • జగన్ ఆస్తిలో షర్మిలకు భాగం ఉంటే షర్మిల కూడా జైలుకెళ్లి ఉండేదని వెల్లడి
  • సుబ్బారెడ్డి తన బిడ్డలు, మనవలపై ప్రమాణం చేయాలన్న షర్మిల
జగన్-షర్మిల ఆస్తుల వివాదంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... టీడీపీ కుట్రలో షర్మిల పావుగా మారిందని అనడం తెలిసిందే. జగన్ కు సంబంధించిన ఆస్తుల్లో షర్మిలకు కూడా వాటాలు ఉన్నది నిజమే అయితే, ఈడీ షర్మిలపై కూడా కేసులు పెట్టేది కదా... అని వైవీ వ్యాఖ్యానించారు. సరస్వతి సిమెంట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్నాయని, అలాంటి ఆస్తుల కోసం షర్మిల పోరాడుతున్నారా? అని ప్రశ్నించారు. 

ఆస్తుల విషయంలో ఇప్పటివరకు జగన్ ఒక్కరే జైలుకెళ్లారని, మరి ఆ ఆస్తులపై షర్మిలకు కూడా హక్కు ఉంటే ఆమె కూడా జైలుకు వెళ్లేవారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రెస్ మీట్లో ఘాటుగా స్పందించారు.

"సుబ్బారెడ్డి గారు ఎవరు...? సుబ్బారెడ్డి గారు జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి. జగన్ పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు.  సుబ్బారెడ్డి కుటుంబం రాజకీయంగానే కాదు, ఆర్థికంగానూ లబ్ధి పొందింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ఆర్థికంగా లాభపడ్డారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు? 

సుబ్బారెడ్డి గారు మాత్రమే కాదు... రేపు విజయసాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడొచ్చు. ఎందుకంటే, సాయిరెడ్డి కూడా వాళ్ల టీమ్ లోనే ఉన్నారు... వాళ్ల మోచేతి కిందే ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరూ కూడా జగన్ పక్షాన ఉన్నారని తెలిసి కూడా... నిన్న నేను రాసిన లేఖలో ఆ ఇద్దరి పేర్లను ఎందుకు ప్రస్తావించానంటే... వాళ్లలో ఇంకా ఏమైనా నిజాయతీ మిగిలుందా అని చూశాను. ప్రజలకు, ముఖ్యంగా అమ్మకు కూడా వాళ్ల గురించి తెలియాలి అనుకున్నాను. 

వీళ్లిద్దరికీ నిజాలన్నీ తెలుసు. వీళ్లకు రాజశేఖర్ రెడ్డి గురించి మొత్తం తెలుసు. రాజశేఖర్ రెడ్డి మనోభావాలు, ఆయన ఆశయాలు అన్నీ తెలుసు. అయినా కూడా ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. వాళ్ల నిజస్వరూపం బట్టబయలు కావాలనే లేఖలో వాళ్ల పేర్లను చేర్చాను. ముఖ్యంగా, అమ్మకు అర్థం కావాలని వాళ్ల పేర్లు రాశాను. 

నా విషయానికొస్తే... నేను చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలరా? భారతి సిమెంట్స్ అయితేనేమి, సాక్షి అయితేనేమి... ఇలాంటి ఆస్తులన్నింటిలో నలుగురి బిడ్డలకు (జగన్ ఇద్దరు పిల్లలు, షర్మిల ఇద్దరు పిల్లలకు) సమాన వాటా ఉండాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఇది నిజమని ఇవాళ నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నాను. 

రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు... పాప (షర్మిల) పేరు మీదకు ఇంకా ఆస్తులు బదలాయించలేదా? అని జగనన్నను అడిగారు. అందుకు జగనన్న... డోంట్ వర్రీ డాడ్... పాప మేలు కోరే వాళ్లలో నేను ముందు ఉంటాను అన్నాడు. ఇది నిజమని నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా. మరి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద, మనవల మీద ప్రమాణం చేసి చెప్పగలరా?" అని షర్మిల నిలదీశారు.
Link to comment
Share on other sites

Subba reddy kabati mocheti neellu annadi… ade vadi paytm dogs ni aaite inkoncham kinda nundi vache neelu anedi… 🤣🤣

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...