Jump to content

Lokesh tour for investors


psycopk

Recommended Posts

Nara Lokesh: బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి.. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయితో మంత్రి లోకేశ్‌ 

30-10-2024 Wed 10:19 | Andhra
Minister Nara Lokesh Met Former CEO of PepsiCo Indra Nooyi
 

 

  • టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి
  • మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలు ఇవ్వాల‌న్న మంత్రి
  • యువ నిపుణుల కెరీర్ డెవల‌ప్‌మెంట్ కోసం మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాల‌ని విజ్ఞ‌ప్తి
పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాల‌న్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల‌ని కోరారు. 

మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలివ్వండి..
మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామ‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తరపున కార్యక్రమాలను రూపొందించాల‌న్నారు. లింగ వైవిధ్యం సంస్థాగత విజయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో చర్చించాల‌ని పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్‌నెస్‌ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సి ఉంద‌న్నారు. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వరంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాల‌ని పేర్కొన్నారు. 

బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతునివ్వండి..
విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంద‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా యువ నిపుణులు వారి కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాల‌ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడటానికి త‌మ‌ రాష్ట్రాన్నిసందర్శించాల‌న్నారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతు ఇవ్వాల‌ని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందిస్తూ ఏపీలో పెట్టుబడుల రాబడికి తమవంతు సహకారం అందిస్తానని అన్నారు.

20241030fr6721ba6714547.jpg
  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ 

30-10-2024 Wed 10:00 | Andhra
Minister Nara Lokesh met Salesforce CEO Clara Shih
 

 

  • టెక్ స్టార్టఫ్‌ల‌కు ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ అందించాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ శిక్షణ ఇవ్వాల‌ని కోరిన మంత్రి
  • ఐన్‌స్టీన్ ఏఐని ఏపీలో పరిచయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి
సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ లాస్ వెగాస్ లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై త‌మ ప్ర‌భుత్వం దృష్టిసారించింద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల‌ని కోరారు. ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయాల‌ని తెలిపారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కావాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాల‌ని కోరారు. 

ఐన్‌స్టీన్ ఏఐని ఏపీలో పరిచయం చేయండి..
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం)ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ తాలూకు ఐన్‌స్టీన్ ఏఐ ఏపీలో పరిచయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఏఐ-పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు సహకారం అందించాల‌ని కోరారు. ఏపీలో ఈ-గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్‌ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరారు. పరిపాలనలో ఏఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల‌న్నారు. ఏపీలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగ మంత్రి లోకేశ్‌ కోరారు. 

నైతికతతో కూడిన ఏఐపై దృష్టి సారించాం: క్లారా షిహ్ 
ఈ సందర్భంగా క్లారా షిహ్ మాట్లాడుతూ... సేల్స్ ఫోర్స్ ఏఐ వ్యూహ పర్యవేక్షణ, కస్టమర్ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం)లో ఆఫర్లను మెరుగుపర్చడం, ఏఐ అండ్‌ మిషన్ లెర్నింగ్ లో నవీన ఆవిష్కరణలపై తాము దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ఐన్‌స్టీన్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధికి కసరత్తు చేస్తున్నామ‌ని తెలిపారు. కస్టమర్ మనోభీష్టానికి అనుగుణంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యాపార విధుల్లో ఆటోమేషన్‌ కోసం ఏఐ టూల్స్‌ రూపొందించడం వంటి సేవలు అందిస్తున్నామ‌న్నారు. 

సేల్స్‌ఫోర్స్ ఏఐ సంస్థ నైతికతతో కూడిన కృత్రిమమేధపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రభుత్వరంగ ప్రాజెక్టులలో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి తాము కట్టుబడి ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఏఐ అండ్‌ ఎంఎల్ నూత‌న‌ ఆవిష్కరణల్లో దూసుకుపోతున్న తమ సంస్థ ప్రస్తుతం 287 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చ‌ర్చిస్తామ‌ని క్లారా షిష్ పేర్కొన్నారు. 

20241030fr6721b1a1bb314.jpg
Link to comment
Share on other sites

Nara Lokesh: అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేశ్‌ భేటీ 

30-10-2024 Wed 08:54 | Andhra
Minister Nara Lokesh Met Amazon Web Services MD
 

 

  • ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాల‌న్న మంత్రి
  • సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి
  • స్మార్ట్ గవర్నెన్స్ కు  క్లౌడ్ సేవలు అందించాలంటూ అభ్య‌ర్థ‌న‌
  • రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్‌తో మంత్రి లోకేశ్‌ స‌మావేశం
అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. పెట్టుబడుల కోసం ఆయ‌న ప్ర‌ముఖ సంస్థ‌ల సీఈఓల‌తో వ‌రుస‌గా భేటీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో లాస్ వెగాస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేశ్‌ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ... క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్‌పై అమెజాన్ దృష్టి సారిస్తోంద‌ని తెలిపారు. ప్రపంచ మార్కెట్ లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో త‌మ‌ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంద‌న్నారు. ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు అత్యాధునిక డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడంతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా త‌మ‌ సంస్థ పాత్ర కీలకమైంద‌ని వివ‌రించారు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌బీఎన్‌బీ, 3ఎం వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉంద‌న్నారు. ఏడ‌బ్ల్యూఎస్‌ ప్రపంచవ్యాప్తంగా 32 శాతం మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్‌లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉంద‌ని తెలిపారు. 2023 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ వార్షిక ఆదాయం సుమారు 90.8 బిలియన్ డాల‌ర్లుగా ఉండగా, 2024కి 100 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుందని రేచల్ స్కాఫ్ చెప్పారు. 

స్మార్ట్ గవర్నెన్స్ కు  క్లౌడ్ సేవలు అందించండి..
మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడ‌బ్ల్యూఎస్‌ నాయకత్వం ఉపకరిస్తుంద‌ని పేర్కొన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడ‌బ్ల్యూఎస్‌ క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయ‌న్నారు. ఏఐ అండ్‌ మిషన్ లెర్నింగ్ లో వారు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలన్న త‌మ‌ ఆశయానికి ఊతమిస్తాయ‌ని తెలిపారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి ఏడ‌బ్ల్యూఎస్‌ కట్టుబడి ఉండటం... 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 గిగా వాట్‌ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న త‌మ‌ లక్ష్యానికి అనుగుణంగా ఉంద‌ని పేర్కొన్నారు. 

స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయ‌ని తెలిపారు. ఏడ‌బ్ల్యూఎస్‌ తదుపరి డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాల‌ని కోరారు. ఏపీలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడ‌బ్ల్యూఎస్‌ సహకారం అవసరం ఉంద‌న్నారు. ఏపీలో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్‌ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలకు ఏడ‌బ్ల్యూఎస్ సహకారం కావాల‌ని మంత్రి లోకేశ్ అన్నారు. దీనిపై రేచల్ స్పందిస్తూ ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్‌తో మంత్రి లోకేశ్‌ స‌మావేశం 
ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలోనే రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్‌ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటీ నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేయాలని అన్నారు. ఏపీలో స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతోంద‌ని తెలిపారు. స్థానిక స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా సంస్థలకు టెక్ టాలెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాన్ని అందించడంలో సహకారం అందించాల‌ని కోరారు. ఈ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి శిక్షణ పొందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను అందించడం ద్వారా ఏపీలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని లోకేశ్‌ కోరారు.

20241030fr6721a5c69a71f.jpg20241030fr6721a5d9701cf.jpg20241030fr6721a68b41127.jpg
Link to comment
Share on other sites

 

Nara Lokesh: భారత్‌లో డేటా విప్లవం ద్వారా ఏపీకి 100 బిలియన్ డాల‌ర్ల‌ పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌ 

30-10-2024 Wed 15:06 | Andhra
Minister Nara Lokesh Participated in IT Serve Alliance Synergy Summit
 

 

  • ఐటీ సర్వ్ ఎలయెన్స్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్న‌ మంత్రి నారా లోకేశ్‌
  • ఏఐ సమర్థ వినియోగంతో పరిపాలనలో దీర్ఘకాల సమస్యలకు చెక్ పెట్టొచ‌న్న మంత్రి
  • రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశాన‌ని వ్యాఖ్య‌
  • త‌న స్థానాన్ని ప్రజలే నిర్ణయిస్తార‌న్న లోకేశ్‌
  • ఆర్థికంగా స్థిరపడ్డాకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని సూచ‌న‌
దైనందిన పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. లాస్ వేగాస్ లోని ఐటీ సర్వ్ అలయెన్స్ సినర్జీ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన లోకేశ్‌... ఫైర్ సైడ్ చాట్ లో పారిశ్రామికవేత్త రవి తొట్టెంపూడి అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. 23 దేశాల నుంచి 2,300 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. 

మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... 1992లో విడుదల చేసిన ఒక జీఓ కారణంగా ఇంటర్మీడియట్ లో దివ్వాంగులు కేవలం 5 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు రాసే విధానం వల్ల ఇటీవల రాష్ట్రానికి చెందిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. నీట్ లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులు ఈ విషయాన్ని త‌న‌ దృష్టికి తెచ్చిన‌ట్లు తెలిపారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని కదిలించి ఫ్రెష్ గా జీఓ విడుదల చేయడంతో వారికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు లభించాయ‌న్నారు. 

అధికారులు చొరవ చూపకపోతే వారి పరిస్థితి ఏమయ్యేది? గవర్నెన్స్ లో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏఐని వినియోగించాలని భావిస్తున్న‌ట్లు చెప్పారు. గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామ‌న్నారు. 

అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీపడతాం..
రానున్న రోజుల్లో భారత్ లో డేటా విప్లవం రాబోతోంది. డేటా సేవల రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రాబోతున్నాయి. అందులో వంద బిలియన్ డాలర్లను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీపడతామ‌న్నారు లోకేశ్‌. సవాళ్లను అవకాశాలుగా తీసుకుని పనిచేయడం త‌మ‌కు అలవాటైంద‌ని పేర్కొన్నారు. ఇటీవల కృష్ణానదికి గత 248 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా వరదలు వచ్చాయ‌ని గుర్తు చేశారు. 

ఆ సమయంలో వ్యవసాయానికి వాడే డ్రోన్లను వరదబాధితులకు సాయం అందించేందుకు ఉపయోగించామ‌ని తెలిపారు. తమ ప్రయత్నం విజయవంతం కావడంతో డ్రోన్ల ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించడంపై దృష్టి సారించిన‌ట్లు పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ లో 5 గిన్నిస్ రికార్డులు రావడం ఆనందంగా ఉంద‌న్నారు. ప్రజలకు మెరుగైన  సేవలందించేందుకు ప్రత్యేక డ్రోన్ పాలసీ తెచ్చిన‌ట్లు చెప్పారు. ఏఐ వినియోగంతో పాలనా పరమైన సమస్యలను అధిగమించడానికి త్వరలో రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు. ఇది అంతర్జాతీయస్థాయి నిపుణులను తయారు చేస్తుంద‌ని తెలిపారు.  

గత అయిదేళ్లూ ఏపీకి చీకటి యుగం..
గత అయిదేళ్లూ ఏపీకి చీకటి యుగం అని మంత్రి లోకేశ్‌ అన్నారు. చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను చవి చూశార‌ని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే ఒక చాప్టర్ సరిపోద‌న్నారు. గత అయిదేళ్లలో ఇదివరకెన్నడూ లేనివిధంగా ఆయన చీకటి జీవితాన్ని అనుభవించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేయని తప్పుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులు జైలుశిక్ష అనుభవించార‌ని వాపోయారు. ఇకపై కొత్త చంద్రబాబు నాయుడును ప్రజలు చూడబోతున్నార‌ని తెలిపారు. 

2014-19 మ‌ధ్య‌ ఆయన అభివృద్ధి చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే బాబు గారిని నిర్బంధించ‌డం క‌లిచివేసింద‌న్నారు. ఆనాటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన త‌న భార్య బ్రాహ్మణి ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా అని ప్రశ్నించిన‌ట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి 45వేల మందికి పైగా హాజరుకావడంతో ఆమె తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. బ్రాహ్మణి సహకారం వల్లే తాను రాజకీయాల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 226 రోజుల యువగళం పాదయాత్రలో ఆమె పూర్తి సహాయ, సహకారాలు అందించార‌ని తెలిపారు. తాను త‌న‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే సరికి ప్రతిరోజూ రాత్రి 11 గంటలు అవుతుంద‌న్నారు. రాజకీయాల్లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్నిత్యాగం చేయక తప్పద‌ని పేర్కొన్నారు. రాజకీయాల్లో తాత ఎన్టీఆర్ లెగసీని కొనసాగించడం త‌న‌కు గర్వంగా ఉంద‌న్నారు.

రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశాను..
రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశాన‌ని లోకేశ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో భవిష్యత్తు కోసం ఎవరైనా సేఫ్ సీటు ఎంచుకుంటారు. కానీ, తాను మాత్రం 1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గాన్నిఎంచుకున్న‌ట్లు తెలిపారు. 2014లో పోటీచేసి 5,300 ఓట్ల తేడాతో ఓటమి పాలైన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ సేవలందించాన‌ని తెలిపారు. ఫలితంగా ఇటీవల ఎన్నికల్లో త‌న‌ను అక్క‌డి ప్ర‌జ‌లు 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని హ‌ర్షం వ్యక్తం చేశారు. 

గెలుపుఓటములతో సంబంధం లేకుండా నిత్యం జనంలో ఉండే నేతలనే ప్రజలు ఆదరిస్తార‌ని తెలిపారు. జాతీయస్థాయి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా అన్న ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ... నా రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తార‌ని తెలిపారు. శాఖలు నిర్ణయించే సమయంలో లక్షలాది మంది భావిభారత పౌరుల భవిష్యత్తుతో ముడివడి ఉన్న విద్యాశాఖను ఎంపిక చేసుకున్న‌ట్లు చెప్పారు. సవాల్ గా తీసుకుని విద్యా వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాన‌న్నారు. ప్ర‌స్తుత రాజకీయాలు సంక్లిష్టంగా మారాయ‌ని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే రాజకీయాల్లోకి రావాలని సూచించారు.  తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిద‌ని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో ఉన్న నేతల మూలాలు టీడీపీతోనే ముడివడి ఉన్నాయ‌న్నారు.

అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తాం..
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పని చేస్తున్నామ‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన‌ట్టు పేర్కొన్నారు. త్వరలో అక్కడ టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయ‌ని తెలిపారు. పారిశ్రామీకరణ నేపథ్యంలో వ్యవసాయరంగం దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పాదకతకు మధ్య పొంతన లేకపోవడంతో గిట్టుబాటు సమస్య ఏర్పడుతోంద‌ని తెలిపారు. రాయలసీమలో బంగారం పండే భూములున్నాయ‌ని పేర్కొన్నారు. 

తాను పాదయాత్ర నిర్వహించే సమయంలో మామిడి, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు పండించే రైతులు త‌న‌ను కలిసి పలు సమస్యలను తెలియజేశార‌న్నారు. అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న రకాలను సాగుచేయాల్సిందిగా తాను వారికి సూచించిన‌ట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్కెట్ ఇంటర్వెన్షన్ తో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. 2017లో ఐటీ సర్వ్ సదస్సుకు వచ్చాన‌ని, మళ్లీ ఇదే సదస్సుకు హాజరై మిత్రులను కలవడం ఆనందంగా ఉందని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

20241030fr6721fdf8f1ace.jpg20241030fr6721fe08c8116.jpg

 

 

Link to comment
Share on other sites

Nara Lokesh: అడోబ్ సీఈఓతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ.. ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి 

29-10-2024 Tue 09:46 | Andhra
Minister Nara Lokesh Meet Adobe CEO
 

 

  • ఏపీలో పెట్టుబడులు పెట్టాల‌ని అడోబ్ సీఈఓను కోరిన మంత్రి లోకేశ్‌ 
  • స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపు
  • యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికా ప‌ర్య‌ట‌న‌ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని వివ‌రించారు. 

శంతను నారాయణ్ మాట్లాడుతూ... అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్ ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉంది. ఫోటోషాప్, అక్రోబాట్, ఇల్లస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చాం. సృజనాత్మకత, డాక్యుమెంట్ ఉత్పాదకత, ఏఐ-పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.17.95 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉందని తెలిపారు. 

మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో అడోబ్‌ చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుంద‌న్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫాంల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయం అన్నారు. ఏపీలో ఇ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాల‌ని కోరారు. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

డిజిటల్ విద్యా ప్లాట్‌ఫామ్‌లలో  ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో అడోబ్ భాగస్వామ్యాన్ని కోరారు. ఏపీలో అడోబ్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. డిజిటల్ ఎడ్యుకేషన్ ను మెరుగుపర్చడంలో భాగంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లను రాష్ట్రానికి తీసుకురావడానికి అడోబ్ తరపున సహకారం అంచాల‌ని కోరారు. డాక్యుమెంట్ ప్రొడక్టివిటీ, ఏఐ పవర్డ్ టూల్స్‌లో అడోబ్ నైపుణ్యం త‌మ‌కు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. 

డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, పబ్లిక్ సర్వీస్‌లను క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయాల‌ని కోరారు. ప్రభుత్వం, పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌరసేవల్లో  క్లౌడ్ ఇంటిగ్రేషన్‌ కు అడోబ్ భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాల‌న్నారు.

ప్రభుత్వ సేవలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ల్లో అడోబ్ ఏఐ ఆధారిత సేవలు, సృజనాత్మకత, డిజిటల్ అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడతాయ‌ని తెలిపారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లకు అడోబ్ సృజనాత్మక సాధనాలు ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయ‌న్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని లోకేశ్‌ కోరారు. మంత్రి చేసిన ప్రతిపాదనలపై శంతన్ నారాయణ్ స్పందిస్తూ... కంపెనీలోని సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

 

Nara Lokesh: యాపిల్ సంస్థ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రదేశం: మంత్రి నారా లోకేశ్‌ 

29-10-2024 Tue 10:33 | Andhra
Minister Nara Lokesh Meet Apple Vice President Priya Balasubramaniam
 

 

  • అందుబాటులో నైపుణ్యం గల కార్మికులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయ‌న్న మంత్రి
  • ఒకసారి ఏపీని సందర్శించి పెట్టుబడుల అవకాశాన్ని పరిశీలించాల‌ని విజ్ఞ‌ప్తి
  • యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా సుబ్రహ్మణ్యంకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సందర్శించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్  (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయ‌న‌ భేటీ అయ్యారు. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి  చెందుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేశ్‌ కోరారు. 

ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలో జగజ్జేతగా నిలచిన తీరును ప్రియా బాలసుబ్రహ్మణ్యం వివరించారు. యాపిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైనదిగా పేరొందిన ఐఫోన్, మ్యాక్, వాచ్‌లు, క్లౌడ్ సేవలు, యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్ లను అందిస్తుంద‌ని తెలిపారు. ప్రస్తుతం 3.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొన‌సాగుతోంద‌ని చెప్పారు. గతేడాది 383.29 బిలియన్ డాల‌ర్ల‌ ఆదాయాన్ని పొంది నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా నిలుస్తోందని ప్రియా బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

ఏపీలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్..
మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... యాపిల్ వైస్ ప్రెసిడెంట్ గా కంపెనీ సప్లయ్ చైన్, తయారీ కార్యకలాపాల నిర్వహణలో ప్రియా బాలసుబ్రహ్మణ్యం పోషిస్తున్న పాత్ర అభినందనీయమ‌న్నారు. భారతదేశంలో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఏపీకి ఆహ్వానించారు. అద్భుత‌మైన‌ మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వ్యాపార విధానాలతో ముందుకు సాగుతున్న త‌మ‌ ప్రభుత్వం.. యాపిల్ విస్తరణకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంద‌న్నారు. ఏపీలోని నాలుగు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో వారికి అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకోవ‌చ్చ‌ని తెలిపారు. 

యాపిల్ సంస్థ‌ కోరుకున్నచోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ఏపీని గ్లోబల్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామ‌న్నారు. యాపిల్ సంస్థ కొత్త‌ ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు త‌మవైపు నుంచి కావాల్సిన‌ మద్దతు ఉంటుంద‌న్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విష‌యాన్ని ఈ సంద్భంగా మంత్రి గుర్తు చేశారు. అంతేగాక ఏపీలో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ యాపిల్ సంస్థ‌కు ప్రయోజనకరంగా ఉంటాయ‌ని మంత్రి వివ‌రించారు. 

అంతర్జాతీయ పెట్టుబడులకు మద్దతు ఇస్తాం..
అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన మద్దతును అందిస్తుంద‌ని తెలిపారు. దీనిలో భాగంగా పన్నుల రాయితీ, ప్రోత్సాహకాలతో పాటు గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయ‌ని పేర్కొన్నారు. యాపిల్ గ్లోబల్ సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ లో వారికి ఉన్న‌ విస్తృత అనుభవం, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఏపీ చేస్తున్న కృషికి చక్కటి సమన్వయం ఉంటుంద‌న్నారు వినూత్న సప్లయ్ చైన్ పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ఏపీ వ్యూహాత్మకమైన ప్రాంతంగా పేర్కొన్నారు. త‌మ‌ ప్రభుత్వ ప్రో-బిజినెస్ చర్యలు యాపిల్ వంటి ప్రపంచస్థాయి సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు. 

పర్యావరణ లక్ష్యాలకు అనువైన ప్రాంతం..
యాపిల్ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్థిరమైన పద్ధతులను అమలు చేస్తున్నామ‌న్నారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ నిబద్ధతతో పనిచేస్తున్నందున యాపిల్‌ వంటి సంస్థలకు త‌మ‌ ప్రభుత్వం భాగస్వామ్య అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన నైపుణ్యం క‌లిగిన టీమ్‌ల‌కు నాయకత్వం వహిస్తున్న యాపిల్‌.. ఏపీలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడానికి త‌మ‌ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంద‌న్నారు. 

రాష్ట్రంలో యాపిల్ భాగస్వామిగా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు త‌మ వద్ద బలమైన విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయ‌ని వివ‌రించారు. యాపిల్‌ సంస్థ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన కార్మికులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న త‌మ‌ రాష్ట్రం యాపిల్ సంస్థ ఆర్ అండ్ డీ (పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుకూలమైన ప్రాంతంగా పేర్కొన్నారు.  

పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశం ఏపీ..
ప్రధాన మార్కెట్లకు సులభతరమైన యాక్సెస్ కలిగిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశమ‌ని మంత్రి లోకేశ్ వివ‌రించారు. తయారీ, పంపిణీలకు త‌మ వద్ద అనువైన ఎకోసిస్టమ్ ఉంద‌న్నారు. లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ నిర్వహణకు భరోసా నిస్తూ ఆధునిక నౌకాశ్రయాలు, రహదారి మార్గాలతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏపీ కలిగి ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. తయారీ యూనిట్లకు అనుకూలమైన విధానాలు, పన్ను ప్రోత్సాహకాలతో ముందున్న ఏపీ.. విదేశీ పెట్టుబడులకు  అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంద‌ని తెలిపారు. 

అన్నివిధాలా అనుకూలతలు ఉన్న ఏపీలో పెట్టుబడుల అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఒక‌సారి రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ప్రియా బాలసుబ్రహ్మణ్యంను ఆహ్వానించారు. యాపిల్ సంస్థ గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ స్ట్రాటజీలో  భాగస్వామ్యం వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. కేవలం ఆర్థిక వృద్ధిని సాధించడమేగాక సాంకేతిక పురోగతి, సమాజాభివృద్ధి లక్ష్యాల సాధనకు త‌మ‌తో కలిసి దీర్ఘకాలిక భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నామని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. మంత్రి ప్ర‌తిపాద‌న మేర‌కు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా బాల‌సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇక ఈ స‌మావేశంలో మంత్రి వెంట ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు. 

 

 

Link to comment
Share on other sites

Minister Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella

29-10-2024 Tue 11:26 | Local | Ap7am Desk
 
Minister Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella

News on the Go: Click the Play Button to Hear!

Seattle: Andhra Pradesh's Minister of Education, IT, and Electronics, Nara Lokesh, met with Satya Nadella, CEO of Microsoft, at Microsoft's headquarters in Redmond. During this visit, Telugu employees at Microsoft took photos with Lokesh. Nadella, originally from Andhra Pradesh, has climbed the corporate ladder to lead Microsoft through his remarkable intellect. His father, B.N. Yugandhar, was an IAS officer in erstwhile Andhra Pradesh, noted for his work in uplifting rural communities.

Nadella, who has significant expertise in Artificial Intelligence (AI) and Cloud Computing, has been leading Microsoft as CEO since 2014, establishing it as a global leader in software, cloud computing, and enterprise technology. As of October 2024, Microsoft holds a market cap of $3.1 trillion, making it one of the world’s most valuable companies. Nadella highlighted that Microsoft generated revenue of $211.9 billion in FY 2023, driven by strong growth in cloud services and AI-driven solutions.

Supporting IT Hubs in Andhra Pradesh
Minister Lokesh emphasized how Hyderabad became an IT hub under the visionary leadership of former Chief Minister Chandrababu Naidu. Now, in his fourth term, Naidu is devising strategies to position Andhra Pradesh as a leader in the tech industry. Lokesh explained the state’s plan to build new IT hubs and innovation parks across Andhra Pradesh, for which he requested Microsoft’s support to transform these hubs into world-class technology centers.

Lokesh also stated that Andhra Pradesh, with cloud infrastructure and data centers, has the potential to serve as a regional base for global companies. The state has policies favorable for such investments and the necessary land availability. He invited Microsoft to collaborate on establishing a state-of-the-art tech ecosystem powered by Microsoft’s expertise in cloud services.

Focus on IT Talent in Andhra Pradesh
Lokesh underscored that Andhra Pradesh has a strong educational foundation, producing skilled IT and engineering professionals, many of whom contribute globally. He urged Nadella to consider tapping into Andhra’s talent pool, highlighting the state's agricultural backbone and the potential for AI to transform agri-tech in Andhra Pradesh.

Lokesh proposed that Microsoft collaborate to develop productivity-enhancing agricultural practices leveraging AI. He added that Andhra Pradesh has streamlined approvals and pro-business policies to support fast-track project implementation and create a conducive environment for business and commerce with enhanced digital governance.

Developing Amaravati as an AI Capital
Lokesh discussed the government’s digital governance initiatives, seeking Microsoft’s assistance in establishing cloud-based platforms, advancing data analytics with AI, and enhancing cybersecurity. He shared Andhra Pradesh's goal to develop Amaravati as an AI capital and announced plans to set up an AI university in Amaravati.

He invited Nadella to visit Andhra Pradesh, inspect the infrastructure, and explore potential investment opportunities. Nadella assured his support, expressing a commitment to aiding Andhra Pradesh’s development in digital transformation and AI. The meeting included key government representatives such as Karthikeya Mishra and Saikant Verma.
20241029fr672078f8779af.jpg

Link to comment
Share on other sites

Andhra Minister Lokesh pitches Anantapur as perfect spot for Tesla’s EV, battery units

28-10-2024 Mon 16:28 | Local | IANS
 
Andhra Minister Lokesh pitches Anantapur as perfect spot for Tesla’s EV, battery units

News on the Go: Click the Play Button to Hear!

Amaravati, Oct 28 : Andhra Pradesh Minister for Information Technology, Electronics & Communications, and Human Resources Development, Nara Lokesh, has pitched Anantapur as the perfect spot for Tesla’s EV and battery units.

The minister, who is currently on a visit to the United States, visited Tesla headquarters in Austin.

Lokesh shared on X that he had an inspiring discussion with CFO Vaibhav Taneja about transforming Andhra Pradesh into an EV manufacturing hub.

He said under the visionary leadership of Chief Minister N. Chandrababu Naidu, the state was targeting 72 GW of renewable energy by 2029.

“Ready to lead the green energy revolution and eager to collaborate with global innovators like Tesla to make it happen,” he added.

Lokesh thanked Gannavaram MLA Yarlagadda Venkata Rao, TDP volunteers, and fans for their warm welcome at the Austin Airport.

The minister earlier met Ross Perot Jr., Chairman of Perot Group and Hillwood Development in Dallas.

The Perot Group, a global player in the real estate, technology, data centre and energy sectors, is recognised for developing the 27,000-acre master-planned community Alliance Texas.

Lokesh said the coastal region of Andhra Pradesh has an ideal environment for developing industrial and logistics parks on the lines of Alliance Texas and requested participation in these projects. He sought Perot Group’s cooperation in smart city projects and development of big cities.

Earlier, the minister addressed potential investors at a roundtable hosted by the Consul General of India in San Francisco.

Describing Andhra Pradesh as an ideal investment destination, Lokesh pointed out its strategic advantages, including India’s second-longest coastline.

Lokesh emphasised that Andhra Pradesh’s industrial policy prioritises employment generation, decentralised development, and streamlined business operations, positioning the State as a top choice for global investors.

He announced that development in the State’s capital region, with an investment of $5 billion, is set to begin in December and Visakhapatnam will be positioned as Andhra Pradesh’s financial capital.

He highlighted Chief Minister Chandrababu Naidu’s efforts to transform Andhra Pradesh into an investment-friendly destination, citing Kia Industries as a key example of the State’s ‘Speed of Doing Business’ model.

He said plans were underway for four new seaports, and various districts are set to become specialised hubs: Kurnool will be developed as ‘Drone Valley,’ Chittoor and Kadapa as electronics hubs.

He noted that Andhra Pradesh already manufactures 25 per cent of India’s mobile phones and 50 per cent of air conditioners.

Link to comment
Share on other sites

Nara Lokesh: ఈవీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశం..పెట్టుబడులు పెట్టండి: ఏపీ మంత్రి లోకేశ్‌ 

28-10-2024 Mon 09:10 | Andhra
Minister Nara Lokesh Meet Tesla CFO Vaibhav Taneja
 

 

  • టెస్లా కేంద్ర కార్యాలయంలో సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్‌ భేటీ
  • స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాల‌ని టెస్లాకు మంత్రి పిలుపు
  • పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామ‌న్న లోకేశ్‌
ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా సీఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజి పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. గతేడాది 18.8 శాతం వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 97 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. 

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంతో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తమ లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని గుర్తు చేశారు. కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించార‌ని తెలిపారు. 

ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై బాబు దృష్టిసారించారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంద‌న్నారు. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామ‌న్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తామ‌ని తెల‌పారు. ఏపీ రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజి పరిష్కారాలు అవసరం అని పేర్కొన్నారు. 

అందుకే టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంద‌న్నారు. రాష్ట్రవ్యాప్త ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం కావాల‌న్నారు. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా... ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.
Link to comment
Share on other sites

Nara Lokesh: ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ 

24-10-2024 Thu 18:34 | Andhra
AP Minister Nara Lokesh held meeting with NVIDIA CEO Jensen Huang
 

 

  • ముంబయిలో నారా లోకేశ్ కీలక భేటీ
  • పలు అంశాలపై జెన్సన్ హువాంగ్ తో చర్చ
  • ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి
ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలో భేటీ అయ్యారు. 

ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది తమ అభిమతం అని లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో  ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా జెన్సన్ హువాంగ్ ను మంత్రి లోకేశ్ కోరారు. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్ రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో వివరించారు. 

కాగా, స్పీచ్ రికాగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్ లను ఎన్ విడియా అందిస్తోంది. 

ఇటీవల బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ విడియా 3.5 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెన్సన్ హువాంగ్‌ ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.
20241024fr671a43993e104.jpg20241024fr671a43a37bba1.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...