Jump to content

Lokesh tour for investors


psycopk

Recommended Posts

Nara Lokesh: గూగుల్ క్లౌడ్ సీఈఓ, వైస్ ప్రెసిడెంట్‌లతో మంత్రి లోకేశ్ భేటీ 

31-10-2024 Thu 07:30 | Andhra
Minister Nara Lokesh Met Google Cloud CEO Thomas Kurian
 

 

  • విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి
  • యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాల‌ని కోరిన మంత్రి
  • ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల‌ని అభ్య‌ర్థ‌న‌
భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ఏపీ విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌ శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్) లతో భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆన్‌లైన్ రీసెర్చ్‌, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 2.01 ట్రిలియన్ డాల‌ర్లుగా ఉందని తెలిపారు. 

అనంత‌రం మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా తయారవుతోంద‌ని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించిన‌ట్లు పేర్కొన్నారు. పీపీపీ మోడ్ లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల‌ని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతమ‌న్నారు. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేస్తోంద‌ని తెలిపారు. 

ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల‌న్నారు. 

డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాల‌ని మంత్రి లోకేశ్‌ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ... సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
20241031fr672303503a0cc.jpg
Link to comment
Share on other sites

Nara Lokesh: గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేశ్‌ 

31-10-2024 Thu 08:24 | Andhra
Minister Nara Lokesh Met SalesForce President
 

 

  • సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • డేటా సేవలరంగ పెట్టుబడులకు విశాఖలో అనుకూల వాతావరణమ‌న్న మంత్రి
  • విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి
సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌ రాగినేనితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. ఈ సంద‌ర్భంగా సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వారు మాట్లాడుతూ... సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం), క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉంద‌న్నారు. కస్టమర్ ఇంటరాక్షన్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుంద‌ని తెలిపారు. 

సేల్స్ ఫోర్స్ కు సంబంధించిన‌ కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయ‌ని గుర్తు చేశారు. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంద‌న్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ 224.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం 36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌ రాగినేని తెలిపారు.

మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ...  ఇ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది త‌మ‌ లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఆర్ఎం సొల్యూషన్‌లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరారు. డేటా సేవల రంగానికి అనువైన వాతావరణం కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు త‌మ‌కు ఉపకరిస్తాయని మంత్రి తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు.
20241031fr6722f21601094.jpg
Link to comment
Share on other sites

Nara Lokesh: ఇండియాస్పోరా, యూఎస్‌-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ 

31-10-2024 Thu 10:09 | Andhra
Minister Nara Lokesh met Representatives of Indiaspora and US India Business Council
 

 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంద‌న్న మంత్రి
  • ఏఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయ‌ని తెలిపిన లోకేశ్‌
  • పెట్టుబడులకు ఇదే సరైన సమయమంటూ వ్యాఖ్య‌ 
  • అభివృద్ధి వికేంద్రీకరణమే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నామ‌న్న మంత్రి లోకేశ్‌
యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో  రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయు రవాణా మార్గాలు కలిగిన ఏపీలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని అన్నారు. 

ఇంకా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శ‌ర‌వేంగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంద‌న్నారు. రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు కాబోతోంద‌ని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్న‌మ‌న్నారు. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించిన‌ట్లు తెలిపారు. 

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్హానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయ‌న్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్న‌ట్లు చెప్పారు. అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొన్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్‌ కోరారు.

ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ రంగస్వామి, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కవితా మరియప్పన్ (జడ్ స్కేలర్), శివ శివరాం (సీఈఓ, క్వాంటమ్ స్కోప్), రమాకాంట్ ఆలపాటి (సీఈఓ, యూల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్), సోహిల్ చావ్లా (ఫౌండర్ అండ్ సీఈఓ టీ సెకండ్), అన్యా మాన్యుయల్ (ప్రిన్సిపాల్, రైస్ హాడ్లీ గేట్స్ అండ్‌ మాన్యుయల్ ఎల్ఎల్‌సీ), రియా షిమా (గ్లోబల్ బిజినెస్ హెడ్, జెట్ సింథసిస్), డీన్ గార్ ఫీల్డ్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నెట్ ఫ్లిక్స్), మిచైల్ డిపాలా కోయ్లే (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ, ఐబిఎం), నిక్ క్లెగ్ ( ప్రెసిడెంట్, మెటా గ్లోబల్ ఎఫైర్స్), బెకీ ఫ్రాసర్ ( వైఎస్ ప్రెసిడెంట్, క్వాల్కమ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), చంతాల్ అలకంత్రా (ఎండి, లాంరీసెర్చ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), ప్రభురాజా (ప్రెసిడెంట్, సెమీకండక్టర్స్ పొడక్ట్ గ్రూప్, అప్లయ్డ్ మెటీరియల్స్) పాల్గొన్నారు.

అలాగే గ్రేస్ కోహ్ (వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ రిలేషన్స్, సియానా), తోబి యాంగ్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్), స్టాట్ ఆంటోని (పార్టనర్, కోవింగ్టన్ అండ్‌ బర్లింగ్), ఎమి హరియానీ (సీనియర్ అడ్వయిజర్, యూఎస్ఐబీసీ) , ఇండియాస్పోరా ప్రతినిధులు ముద్దు సుధాకర్ (ఆసియారా), సతీశ్ అంబటి (హెచ్20 ఏఐ), భాస్కర్ శ్రీనివాసన్ (యావియేషన్ టెక్నాలజీ లిమిటెడ్), శ్యామ్ బాలాజీ (డెలాయిట్), సంజయ్ ఖండవేరు (ఐవిక్యాప్ వెంచర్స్), కృష్ణ యార్లగడ్డ (ఫాల్కన్ ఎక్స్), ప్రభ భాష్యం (యాపిల్), ప్రియా రామచంద్రన్ (జోమ్ క్యాపిటల్), రాజీ భాస్కర్ (సూపర్ బ్లూమ్), రాజురెడ్డి (సియారా అట్లాంటిక్), రాకేష్ వైద్య నాథన్ (ధ జై గ్రూప్), రమణన్ షణ్ముగం (ఒవెన్యూ), రావి రవికుమార్ (కోటా క్యాపిటల్), సతీశ్‌ కంచి (వన్ హబ్, పీఓఎస్), జియా రెహమాన్ (స్ప్రౌట్ ఏఐ), అనిల్ అద్వానీ (ఇన్వెంటస్ లా), నవ దావులూరి, శివచైతన్య (ఇంటరాక్ట్లీ ఏఐ), నవ్య దావులూరి (క్యూరీ ఏఐ), అంజి మారం (క్రిటికల్ రివర్), విశేష్ పువాడి (హెచ్ఎఎస్‌బీసీ), ప్రసాద్ ఆకెళ్ల (ఆప్టెస్సా), సంజయ్ వర్మ (అలిక్స్ పార్టనర్స్), మనోహర్ పాలూరి (మెటా), రాంభూపాల్ (డైకెమ్) కూడా పాల్గొన్నారు.
20241031fr67230bc992ac0.jpg20241031fr67230be1698b9.jpg
Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

 

Anakapalli kuda na ? Paaye…oka 50,000 acres paaye…

Panikatukuni Anakapalli antunnaru ante manollu already esesi vuntaru..

Link to comment
Share on other sites

29 minutes ago, Android_Halwa said:

Anakapalli kuda na ? Paaye…oka 50,000 acres paaye…

Panikatukuni Anakapalli antunnaru ante manollu already esesi vuntaru..

1.4lk crs nothing annatu bhale covering chesav samra… by the way  50,000 acers number bharathi ichinda??

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Phase 1 and 2 motham kalipina below 6500acers alloted… ipudu petukovachaa pakka state paytm sir 

https://www.instagram.com/reel/DByJS9Lu7MI/?igsh=Y3FuNDdlb2l2d3l4

Lol comedy….6500 acres land kuda alloted anta..!

Agu, ie vishayam Arcelor Mittal and Nippon Steel ki cheputham…Vallu kuda shock tintaru, maake teliyakunda land ala ela allot chesinaru ani…

 

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Lol comedy….6500 acres land kuda alloted anta..!

Agu, ie vishayam Arcelor Mittal and Nippon Steel ki cheputham…Vallu kuda shock tintaru, maake teliyakunda land ala ela allot chesinaru ani…

 

kanesam.. news kuda chudav..... edi  vayya nee nasa... nee kante 90yrs vachi bed meda padi mulige musli valluu better kada... nuvvu nee nasa...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...