Jump to content

Lokesh tour for investors


psycopk

Recommended Posts

Just now, psycopk said:

kanesam.. news kuda chudav..... edi  vayya nee nasa... nee kante 90yrs vachi bed meda padi mulige musli valluu better kada... nuvvu nee nasa...

 

News ? News ante edi nijalu cheptaru ade na ? Etv, abn lanti News channels lo cheppe nijalu ae na ? 
 

Sare ayanni enduku lenkani, Arcelor Mittal and Nippon vallaku aithe telise vuntadi kada…Phase-1 and 2 upto one lakh crore investment, 6500 acres alloted already ante chala serious plan..

Valla nundi emaina official release/ press note emana vunte cheppu samara…else, its just another bhajan batch. 

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

News ? News ante edi nijalu cheptaru ade na ? Etv, abn lanti News channels lo cheppe nijalu ae na ? 
 

Sare ayanni enduku lenkani, Arcelor Mittal and Nippon vallaku aithe telise vuntadi kada…Phase-1 and 2 upto one lakh crore investment, 6500 acres alloted already ante chala serious plan..

Valla nundi emaina official release/ press note emana vunte cheppu samara…else, its just another bhajan batch. 

news lo nijalu cheparu.. nuvvu okadive... rendu states ki nijalu chepi janani uddarinchataniki vachina paytm purusha pungavudivi... nee bokka

Link to comment
Share on other sites

21 minutes ago, psycopk said:

news lo nijalu cheparu.. nuvvu okadive... rendu states ki nijalu chepi janani uddarinchataniki vachina paytm purusha pungavudivi... nee bokka

Arcelor Mittal and Nippon news about investing in AP…no where else other than yellow tweets. 
 

A big LOL

Link to comment
Share on other sites

Nara Lokesh: ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన ఎకోసిస్ట‌మ్ సిద్ధం.. న్యూయార్క్ పెట్టుబ‌డిదారుల భేటీలో మంత్రి లోకేశ్‌ 

02-11-2024 Sat 08:45 | Andhra
380.jpg
Minister Nara Lokesh Met Investors in New York
 

 

  • భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామ‌న్న మంత్రి
  • నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ తయారీ ఉంటుంద‌ని వెల్ల‌డి
  • ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్లిన లోకేశ్‌
ఏపీలో విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్ట‌మ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.  యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోందన్నారు. అమెరికా పర్యటన చివరిరోజున మంత్రి లోకేశ్‌ న్యూయార్క్ లోని విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్ మహానగరంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. 

అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భారత్ లో ఏ రాష్ట్రంలో లేని అనుకూల వాతావరణం ఏపీలో ఉంద‌న్నారు. 974 కిమీల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంద‌ని పేర్కొన్నారు. 

రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురంవద్ద జీఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంద‌ని తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంద‌న్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయ‌ని తెలిపారు. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలిపారు. 

దీనిద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తామ‌న్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యతోపాటు యువతకు ప్రత్యేకమైన  నైపుణ్య శిక్షణ ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేయబోతున్నామ‌ని తెలిపారు. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయస్థాయి ఏఐ నిపుణులు తయారవుతార‌ని చెప్పారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా లోకేశ్‌ అమెరికా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.   

ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సీఈఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్‌ సీఈఓ, యూఎస్ న్యూస్ అండ్‌ వరల్డ్ రిపోర్ట్, రాబర్ట్ టిచియో (సీఈఓ, ఫోర్టెస్క్ క్యాపిటల్, సంజయ్ పటేల్ (వైస్ చైర్మన్, అపోలో క్యాపిటల్), రిచర్డ్ డ్రెస్డేల్ ( సీనియర్ ఎండి, మెడి మేడిసన్ రివర్ క్యాపిటల్), కెన్ నోవాక్ (ఎండీ, అలెక్చ్ బ్రౌన్ అండ్‌ రేమండ్ జేమ్స్), సుసాన్ ఫోర్సింగ్డల్ (ఎండీ, ఎలయెన్స్ క్యాపిటల్), డ్యానీ ఫ్రాంక్లిన్ (పార్టనర్, బుల్లీ పల్పిట్ ఇంటర్నేషనల్), థామస్ పొంపిడో (పార్టనర్ అండ్‌ ఫౌండర్, మార్కర్ ఎల్ఎల్‌సీ), జిమ్ ఊలెరి (ఫౌండింగ్ పార్టనర్, ఊలెరి అండ్‌ కో), మిచైల్ డబ్లియర్ (ఫౌండర్, డబ్లియర్ అండ్‌ కంపెనీ), జెఫ్ న్యూక్ టెర్లీన్ (మేనేజింగ్ పార్టనర్, న్యూ క్యాపిటల్), ధ్రువ్ గోయల్ (సీఈఓ, ఫోర్ లయన్ క్యాపిటల్), నిఖిల్ సిన్హా (సీఈఓ, వన్ వ్యాలీ), సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివ్ ఖేమ్కా, ఎండీ వైద్యనాథన్ శివకుమార్, డైరక్టర్లు జయశ్రీ ఖేమ్కా, ఇలినా దూబే పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Nara Lokesh: జైత్రయాత్రలా సాగిన మంత్రి లోకేశ్ పెట్టుబడుల యాత్ర! 

02-11-2024 Sat 11:51 | Andhra
 
Minister Nara Lokesh USA Tour
 

 

  • బ్రాండ్ ఏపీ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్
  • పరిశ్రమదారుల్లో  విశ్వాసాన్ని నింపిన యువ కెరటం
  • వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన మంత్రి లోకేశ్‌
  • 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుస భేటీలు
రాష్ట్రంలో దారితప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి  వారం రోజులపాటు యువనేత లోకేశ్ చేపట్టిన అమెరికా టూర్ జైత్రయాత్రలా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేశ్‌ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. లోకేశ్‌లో చంద్రబాబు విజన్‌ను చూసిన పారిశ్రామికవేత్తలు బ్రాండ్ ఏపీ మళ్లీ పట్టాలు ఎక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పెట్టుబడులపై మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ప్రస్తుతం ఏపీలో కొలువైన ప్రభుత్వం పనితీరుతో మళ్లీ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో జరిగే పెట్టుబడుల సమావేశం నాటికి లోకేశ్‌ చేసిన తొలి ప్రయత్నం సత్ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆశాకిరణంలా మారారు. 

మంత్రి లోకేశ్‌ ఏం చేశారు?
గతనెల 25వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌ వారం రోజులపాటు 100మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజనరీ లీడర్, ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు నేతృత్వాన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారం రోజులు అవిశ్రాంతంగా సాగించిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్ విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కన్ ఎక్స్, ఈక్వెనెక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.  

గత నెల 29వతేదీన లాస్ వేగాస్‌లో 23దేశాల నుంచి 2300 చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు హాజరైన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌కు విశిష్ట అతిథిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమంటూ చైతన్యాన్ని నింపారు. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదవడంతో పాటు ప్రపంచబ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి తాము చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలు, డిజిటల్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను ఆయా కంపెనీల అధినేతలకు తెలియజేశారు. ఏపీపై గత అయిదేళ్లుగా నెలకొన్న దురభిప్రాయాన్ని తొలగించి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేశ్‌ కృతకృత్యులయ్యారు. 

గత 5 ఏళ్లలో ఏం జరిగింది?
2014-19 నడుమ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రూ.2వేల కోట్ల విలువైన కియా అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. 

రేణిగుంటలో రిలయన్స్ (రూ.15వేలకోట్లు), విశాఖలో అదానీ డేటా సెంటర్ (రూ.70వేలకోట్లు), బీఆర్ శెట్టి సంస్థలు (రూ.12వేల కోట్లు), ఒంగోలులో ఏపీ పేపర్ మిల్స్ (రూ.24వేల కోట్లు) ఏర్పాటుకు కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే, వైసీపీ పాలనలో అవన్నీ త‌ర‌లిపోయాయి. దీంతో పరిశ్రమదారుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి భరోసా కల్పించడం ద్వారా తిరిగి రాష్ట్రానికి రప్పించే గురుతర బాధ్యతను మంత్రి నారా లోకేశ్‌ తలకెత్తుకున్నారు.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆపరేషన్
వాస్తవానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఈ ఏడాది జూన్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేశ్‌ అప్పటి నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు పలు దఫాలుగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) సీఈఓ, సీఐఐ ప్రతినిధులు సభ్యులుగా ఏర్పాటైన ఇండస్ట్రీస్ కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 

విశాఖలో రెండుసార్లు ఏపీ ఐటీ అసోయేషన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి లోకేశ్‌ చేపట్టిన చర్యలతో పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు భేటీ అయి విశాఖకు టీసీఎస్ రావడానికి ఒప్పించారు. దీనిద్వారా 10వేలమంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. 

రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకు వచ్చిన హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యాక, మరో 15వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ఆ సంస్థ సిధ్ధమైంది. బ్రాండ్ ఏపీ కోసం కేవలం 4నెలల వ్యవధిలో మంత్రి లోకేశ్‌ చేసిన ప్రయత్నాలతో పెట్టుబడిదారుల్లో జోష్ నెలకొంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...