Jump to content

Munda ki polavaram ane project undi ani gurthuku vachindi


psycopk

Recommended Posts

Chandrababu: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఆక్షేపణ .. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం 

31-10-2024 Thu 06:37 | Andhra
YS Jagan Slams Chandrababu
 

 

  • ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్
  • స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా? అని విమర్శ
  • పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? చంద్రబాబు గారూ..?
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాజా అంశాలు బయటకి రావడంతో సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబుగారూ… ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా?’  అని విమర్శించారు. 
 
‘పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడంలేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదలచేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయలేం. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నిటికంటే సుజలస్రవంతి ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబుగారూ?’ అని ప్రశ్నించారు. 
 
‘పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబు గారు… మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడంకోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రాని ఇక జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు’ అంటూ విమర్శించారు. 
 
‘చంద్రబాబు గారు..  గతంలో మీరు మీ స్వార్థంకోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్‌డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తిచేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రంవాల్‌ కట్టారు. ఆ నిర్మాణాల్లోకూడా లోపాలే. కాఫర్‌డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్‌డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు. ఆ ఖాళీలుగుండా వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి మీ నిర్వాకాలే కారణమని సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవలే తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు స్పిల్‌వేలో పిల్లర్లుకూడా పూర్తిచేయకుండా గేట్లుపెట్టామంటూ ఫొటోలకు ఫోజులిచ్చిన చరిత్ర మీది. అయినా తప్పులు అంగీకరించడానికి, చేసినవాటిని సరిదిద్దుకోవడానికి మీకు మనసు రాదు. మీ చేతిలో ఉన్న మీడియాతో నిరంతరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పులనుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప, పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయితీ లేదు’ అని విమర్శించారు. 
 
మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది, ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైసీపీ హయాంలో చేశామన్నారు. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్, అప్రోచ్‌ఛానల్‌, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశామని పేర్కొన్నారు. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. అంతేకాదు   వైసీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, కాని, చంద్రబాబుగా మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా, అడ్డుకున్నారని విమర్శించారు. 
 
ఇప్పుడు ఆ డబ్బును విడుదల చేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించిందన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు  చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రంవాల్‌ను పూర్తిచేసి, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాంను కట్టడంతోపాటు, ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇవ్వాలని, ఇవన్నీ పూర్తిచేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? అని ప్రశ్నించారు. వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు అని జగన్ హెచ్చరించారు. 

 

 
 
 
Link to comment
Share on other sites

Just now, psycopk said:

Simple ga tablet veskoni tongo ra ani chepadu…

45.72 varaku nimpanika ie project emana mee aothu anukunturra endi…

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

45.72 varaku nimpanika ie project emana mee aothu anukunturra endi…

Pakka state vallu tuppaloki povalama

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Pakka state vallu tuppaloki povalama

Current charges penchinaru…

wealth generation ante endo anukunna…rates penchadama ?

Link to comment
Share on other sites

YS Jagan: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదు: మంత్రి నిమ్మల రామానాయుడు

31-10-2024 Thu 07:29 | Andhra
AP Minister Nimmala Ramanaidu Slams YS Jagan over Polavaram Project Issue

 

  • వైఎస్ జగన్ విమర్శలకు మంత్రి నిమ్మల కౌంటర్ 
  • 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణం జరుగుతుందన్న మంత్రి నిమ్మల
  • రెండు ఫేజులు అంటూ ప్రాజెక్ట్  ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శ  

పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో తాము ప్రతిపాదించినట్లు 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రతిపాదనకు చంద్రబాబు సర్కార్ ఒప్పుకుని రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందంటూ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నిమ్మల స్పందించారు. వైసీపీపై కౌంటర్ విమర్శలు చేశారు. 

రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో బుధవారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. రెండు ఫేజులు అంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజుల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలు మార్లు  ప్రతిపాదనలు పంపిన గత ప్రభుత్వం, ఆ బురదను తమ ప్రభుత్వంపై రుద్దే విధంగా దుష్ప్రచారం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 అంటూ 41.15 మీటర్ల ఎత్తును ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సీఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ వ్రాస్తూ రూ.10,911.15 కోట్ల మేర నిధులు  కావాలంటూ అడగడం జరిగిందన్నారు. తదుపరి జలవనరుల శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, సీఈ తదితరులు కూడా పలు మార్లు లేఖలు వ్రాయడం జరిగిందన్నారు. వాటిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారని చెప్పారు.  
 
2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ ఎప్పుడూ విభజించలేదని, సుప్రీంకోర్టు, గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసే విధంగా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55,545 కోట్లకు టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ ఆమోదాన్ని కూడా పొందడం జరిగిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏమాత్రం రాజీ పడబోదని, నూటికి నూరు శాతం 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అయితే గత ప్రభుత్వం ఫేజ్-I లో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిధులు విడుదల అవుతాయన్నారు. కానీ ఫేజ్-2 లో మాత్రం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టు ఎత్తుకు అనుగుణంగా రూ.30 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అవసరం అవుతాయని తాము ప్రతిపాదించామన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే 2020 లో వచ్చిన వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని  హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం కూడా నిర్థారించినట్లు ఆయన తెలిపారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే కేవలం రూ.6,764 కోట్లు మాత్రమే కేంద్రం నుండి రీయంబర్స్‌మెంట్ రూపేణా వచ్చాయన్నారు. అయితే గత ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిందని, అయితే కేంద్రం నుండి రూ.8,382 కోట్లు రీయంబర్స్‌మెంట్ రూపేణా  నిధులు వస్తే అందులో రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం మళ్లించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఫేజ్-I ప్రతిపాదించిన విధంగా కేంద్రం నుండి రూ.12,250 కోట్ల నిధులు ఈ మధ్యనే అందాయని, అదే గత ప్రభుత్వ హయాంలో అందితే ఈ నిధులను కూడా మళ్లింపు చేసేవారని మంత్రి విమర్శించారు. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...