psycopk Posted October 31 Report Share Posted October 31 YS Jagan: ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వైఎస్ జగన్ బెంగళూరుకు .. ఆలస్యంగా టేకాఫ్ .. ఎందుకంటే..? 31-10-2024 Thu 09:42 | Andhra మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగించుకొని బెంగళూరుకు వెళ్లిన వైఎస్ జగన్ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రత్యేక హెలికాఫ్టర్ కు ఆలస్యంగా ఏటీసీ నుండి అనుమతి పొగమంచు తగ్గిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బెంగళూరు వెళ్లారు. అయితే షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయమే జగన్ బెంగళూరుకు బయలుదేరాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాఫ్టర్ టేకాఫ్ ఆలస్యం అయ్యింది. ఉదయం జగన్ బెంగళూరు వెళ్లేందుకు అధికారులు హెలికాఫ్టర్‌ను సిద్ధం చేయగా, ఉదయం నుంచి దట్టమైన పొగమంచు ఉండటంతో హెలికాఫ్టర్ టేకాఫ్ అయ్యేందుకు ఎయిర్ కంట్రోల్ సెంటర్ (ఏటీసీ) నుంచి త్వరగా అనుమతులు రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్ బెంగళూరు ప్రయాణం కాస్త ఆలస్యంగా ప్రారంభమయింది. పొగమంచు తగ్గిన తర్వాత ఏటీసీ నుండి అనుమతులు రావడంతో జగన్ ఇడుపులపాయ నుంచి హెలికాఫ్టర్‌లో బెంగళూరు బయలుదేరి వెళ్లారు. కాగా కడప జిల్లా పర్యటనలో మూడు రోజుల పాటు బిజీబిజీగా గడిపిన వైఎస్ జగన్ .. నాయకుల మధ్య ఉన్న విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టారు. జమ్మలమడుగు ఇన్ చార్జి వ్యవహారంపై నెలకొన్న సమస్య పరిష్కారానికి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదర్ఛడానికి జగన్ కృషి చేశారు. ఈ క్రమంలో మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో మూడు మండలాలకు రామసుబ్బారెడ్డి ఇన్చార్జ్ లు గా వ్యవహరించాలని సూచించారు. అలానే కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పని చేయాలని ఆదేశించారు. బుధవారం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు విన్న జగన్.. పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 31 Author Report Share Posted October 31 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 31 Author Report Share Posted October 31 Quote Link to comment Share on other sites More sharing options...
Keth Posted October 31 Report Share Posted October 31 4 minutes ago, psycopk said: emaindi eediki urine posta antadu emiti? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.