Jump to content

CBN encouragement for sports players in AP


psycopk

Recommended Posts

Chandrababu: దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ: సీఎం చంద్రబాబు

04-11-2024 Mon 17:24 | Andhra
CM Chandrababu reviews on New Sports Policy

 

  • క్రీడలపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు
  • అందరికీ క్రీడలు అనే కాన్సెప్టుతో స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన
  • గ్రామస్థాయి నుంచి క్రీడా వికాసానికి ప్రణాళిక 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని సీఎం అన్నారు. అందరికీ క్రీడలు అనే కాన్సెప్టుతో రూపొందించిన పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. 

రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ తో కూడిన పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. 

ఈ నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 

ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. 
Link to comment
Share on other sites

Sports Quota: క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు... ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు

04-11-2024 Mon 17:46 | Andhra
AP Govt decides to hike sports quota rervation in recruitments

 

  • కొత్త స్పోర్ట్స్ పాలసీపై చంద్రబాబు సమీక్ష
  • కీలక ప్రతిపాదనలకు ఆమోదం
  • ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 శాతం నుంచి 3 శాతానికి పెంపు

నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్టు వెల్లడించారు. 

ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్ లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. అంతేకాకుండా, శాప్ లో గ్రేడ్-3 కోచ్ ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. 

ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని...అన్ని ఆటలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని... ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని తెలిపారు.
Link to comment
Share on other sites

Sports Policy: ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే రూ.7 కోట్లు ఇస్తాం... దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ: సీఎం చంద్రబాబు

04-11-2024 Mon 18:06 | Andhra
CM Chandrababu suggests Rs 7 crores for Olympic gold medalists

 

  • ఏపీ కొత్త క్రీడా విధానంపై చంద్రబాబు సమీక్ష
  • క్రీడా పోటీల్లో పతకాలు గెలిచేవారికి భారీగా ప్రోత్సాహకాలు 
  • క్రీడా ప్రోత్సాహకాలు అందించడంలో దేశంలోనే నెంబర్ వన్ కానున్న ఏపీ

క్రీడా పోటీల్లో పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన రాష్ట్ర నూతన క్రీడా పాలసీపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా.....ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహలు ఇచ్చే రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.  

ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా... ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా.....ఇకపై రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ. 30 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. 

అంతేకాదు, ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు. అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు.

వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. 

ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు. 

ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్ లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Kesineni Chinni: ఐపీఎల్ త‌ర‌హాలోనే ఏపీఎల్: ఎంపీ కేశినేని చిన్ని

04-11-2024 Mon 13:01 | Andhra
MP Kesineni Chinni Press Meet

 

  • గ్రామీణ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ఐపీఎల్ త‌ర‌హాలో ఏపీఎల్ అన్న ఎంపీ
  • గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ఆట‌గాళ్ల వెలికితీత‌కు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
  • అతి త్వ‌ర‌లో అందుబాటులోకి మూల‌పాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్
  • మూల‌పాడుకు అన్నీ అనుకూలిస్తే గోల్ఫ్ కోర్స్ కూడా వ‌స్తుంద‌న్న కేశినేని చిన్ని

గ్రామీణ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ఐపీఎల్ త‌ర‌హాలో ఏపీఎల్ నిర్వ‌హిస్తామ‌ని విజ‌య‌వాడ‌ ఎంపీ కేశినేని చిన్ని (శివ‌నాథ్‌) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ఆట‌గాళ్ల వెలికితీత‌కు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు. అతి త్వ‌ర‌లో మూల‌పాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్ అందుబాటులోకి వ‌స్తుందని తెలిపారు. 

మూల‌పాడులో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ నిర్మాణానికి ప్ర‌ణాళిక సిద్ధం చేశామ‌న్నారు. ఇక్క‌డి మైదానాన్ని సంద‌ర్శించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఏసీఏ త‌రఫున మూల‌పాడులో ఏడాదిలోపు క్రికెట్ అకాడ‌మీ వ‌స్తుంద‌ని చెప్పారు. మూల‌పాడుకు అన్నీ అనుకూలిస్తే గోల్ఫ్ కోర్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. 

రాజ‌ధాని ప్రాంతంలో మూల‌పాడు, మంగ‌ళ‌గిరిలో రెండు క్రికెట్ స్టేడియాలు ఉండ‌టం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ రెండు స్టేడియాల‌ను ఏడాదిలోపు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.   
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...