naidubava Posted November 5 Report Share Posted November 5 విశాఖలో సోనోవిజన్ ఎండీ వేమూరి భాస్కరమూర్తి దాష్టీకం, వేధింపుల వలనే తాను ఆత్మ హత్యచేసుకుంటానని చెప్పిన సెల్ఫీ వీడియోలో చెప్పిన శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ అధినేత సాయిగణేష్ చెప్పారు.. నిజంగానే భాస్కరమూర్తి వేధింపులతో వ్యాపారవేత్త గణేష్ ఆత్మహత్య చేసుకున్నారా..? ఆ వేధింపుల వీడియో తొలుత తేడా మీడియాకే ఎందుకు రిలీజ్ చేశారు..? సోనోవిజన్ వ్యాపారాన్ని అడ్డంపెట్టుకుని నల్లధనాన్ని వైట్ మనీగా మారుస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి గతంలో ఎన్ఏడి జంక్షన్ లో వాషింగ్ మిషన్, ఫ్రిజ్ లో డబ్బులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైనం నుంచి ఎందుకు తేడా మీడియాను మేనేజ్ చేస్తున్నారు..? ఎందుకు తప్పుడు బిల్లులతో అడ్డగోలు వ్యాపారం చేస్తున్న సోనోవిజన్ పై చర్య తీసుకోవాలంటూ గణేశ్ బంధువులు శవయాత్ర చేసి మరీ ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు..? సోనోవిజన్ వ్యాపారంపై లోతైన దర్యాప్తు చేస్తే విస్తుపోయే వాస్తవాలు నిజంగానే వెలుగు చూస్తాయా..? ఈ సూసైడ్ ఎపిసోడ్ ని ఎందుకు తేడా మీడియా పక్కదోవపట్టిస్తున్నది.. తేలాల్సి ఉంది..? బాహ్య ప్రపంచంలో వాస్తవాలను సమాచారం రూపంలో ప్రజల కళ్లకి కట్టినట్టు చూపించాల్సిన మీడియా.. విశాఖలో తప్పుదోవ పడుతోంది.. ఈ మధ్య మీడియాలో తేడా మీడియా విభాగం ప్రత్యేక స్థానం సంపాధించుకొని.. ఎక్కడ పడితే అక్కడ పైసలు ఏరుకోవడం మొదలు పెట్టింది. అందులో పలానా వాళ్లే ఉన్నారని అనుకోవడానికి లేనంతగా మారిపోయిందా విభాగం. ఆఖరికి ఓ కుటుంబం పెద్దనుకోల్పోయి భార్య, పిల్లలు, బాధితులు ఉసూరు మంటే.. ఆ విషయంలో సమాచారం బయటకు రాకుండా ఉండటానికి.. ఎలాంటి వార్తలు రాయకుండా చేయడానికి కాస్త ఖర్చు అవుతుందంటూ.. ఆ తేడా మీడియా ఈ శవంపై కూడా పైసలు దండుకున్నదట. ఈ మాటలు మేము అంటున్నవి కాదు.. విశాఖ మహానగరంలో శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ అధినేత సాయగణేష్ సెల్ఫీ వీడియోతీసుకొని.. తన చావుకి సోనోవిజన్ ఎండీ వేమూరి భాస్కరమూర్తి కారమంటూ ఆత్మహత్య చేసుకున్నారు. దానిపై కూడా కొందరు తేడా మీడియా ప్రతినిధులు వెళ్లి పీనుగను రాబందులు పీక్కుతిన్నట్టుగా.. ఆ శవాన్ని అడ్డుపెట్టుకొని అనుమానిత సంస్థ నుంచి లక్షలాది రూపాయలు కొట్టేశారట.. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని లాభం పొందలేక ప్రయత్నించి విఫలమైన బ్యాచ్ బయటకొచ్చి బావురు మంటే.. ఆ విషయం కాస్తా విశాఖ మొత్తం దావానంలా పాకేసింది..! విశాఖలో ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్నవారు.. వారికి మధ్య వర్తిగా ఉన్నవారి నుంచి కాస్తో కూస్తో దండుకున్న తేడా మీడియా బయటకొచ్చి ఇద్దరికి మాత్రమే చెప్పారట(అడిగినోడికి.. అడగనోడికి) దీనితో తామేమీ తక్కువ తిన్నామా అంటూ మిగిలిన వాళ్లంతా కూడా ఎగేసుకొని వెళ్లి అడుక్కు తెచ్చేసుకున్నారట.. ఈ సీక్వెన్స్ లో మరికొందరు కష్టపడినా పైసా కూడా ముట్టలేదని వినికిడి. దానితో ఈ విషయాన్ని కూడా పైసలు దక్కించుకోలేని మరో వర్గం మీడియా కూడా మళ్లీ ఇద్దరికే చెప్పడం మొదలు పెట్టిందట( ఒకటి అడిగిన వారికి.. రెండూ అడగని వారికి) దీనితో విషయం కాస్త గుప్పుమంది. జరిగింది ఆత్మహత్య కాదని.. కావాలనే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేలా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న బాధితులగోడు మహావిశాఖ నగరంలో సిసలు మీడియాకి కనీసం పట్టలేదనే ఆరోపణలున్నాయి. ఎవరిని కదిలించినా అటువైపు సంస్థ కాస్త పెద్దది.. వాళ్లతో మనకెందుకొచ్చింది.. మన మీడియాకి వచ్చే యాడ్స్ పోతాయ్.. దానితో ఉన్న ఆ కాస్త యాడ్స్ మార్కెట్ మసకబారిపోతుందని అందిన కాడికి దండేసుకొని వచ్చేశారట. అంతే తప్పా.. ఎవరు ఏ విధంగా వేధిస్తే మృతుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..? అలా చేసుకోవడానికి ప్రేరేపించిన కారణాలేంటి..? కేజిహెచ్ లోని శవపంచనామాలో ఏం తేలిందినే విషయాలు సాధారణ కేసుల్లో తెగ కూపీ లాగి వార్తలు గుద్దేసే మీడియా.. గంట గంటకీ చెప్పిందే చెప్పి.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సైతం భయంతో ఊరు వదిలేసి పోయేలా చూపించే సోకాల్డ్ ఛానళ్లు కూడా ఏమీ చేయకుండానే వదిలేశాయనే దుమారం విశాఖలో రేగింది.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలీదు గానీ..ఇదేదో పాత కక్షల గొడవలతోనే జరిగిందని.. ఇలాంటివి రాసినా.. టీవీల్లో చూపించినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సో కాల్డ్ విజన్ సంస్థ నుంచి నిత్యం వచ్చే యాడ్స్ పోతాయని కాస్త తెలివిగా ఆలోచించిన తేడా మీడియా గమ్మున ఉన్నదట. ఒక్క పైసా ఏమైనా చేయిస్తుంది.. ఒక్క ఆత్మ హత్య ఎన్ని యాడ్స్ నైనా వచ్చి పడేలా చేస్తుంది.. ఒక్క వార్త ఎంత మొత్తమైనా వసూల్ అయ్యేలా చేస్తుంది.. ఒక్క ఆత్మ హత్య శవం బాహ్య ప్రపంచాన్ని నమ్మించేందుకు ఎన్ని నాటకాలైనా ఆడిస్తుందని చెప్పడానికి విశాఖలో జరిగిన సెల్ఫీ వీడియో ఆత్మహత్యే ప్రధాన ఉదాహరణ అని.. దానిపై పైసలు దండుకున్న తేడా మీడియానే ప్రధాన సాక్షులని ప్రజలు ఉమ్మేసే పరిస్థితికి తెచ్చేశారు తేడాగాళ్లు. ఇంతకీ ఈ విషయంలో పోలీసుశాఖ ఏవిధంగా వ్యవహరిస్తుందనే ఇపుడు ప్రశ్నార్ధకం అయినా.. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వీడియోలు కేసు నమోదు చేయడానికి సరిపోవేమో అనినా అంటారని.. ఈవిషయంలో తేడా మీడియానా కాసుల ముసుగులో గమ్మునుంటే.. ఇక పోలీసులు మాత్రం ఏం చేస్తారులే అనే వాదన కూడా వినిపిస్తోంది. సెల్పీ వీడియో తీసుకొని బలవంతంగా తనువు చాలించి కుటుంబానికి తీరని అన్యాయం చేసినా.. తేడా మీడియాకి తన శవంపైనే కాసులు కురిపించిన కూల్ జోన్ అధినేత సాయి గణేష్ పేరుని తీసుకున్న మొత్తం అరిగే వరకూ దండుకున్న పైసలు ఖర్చైనంత వరకూ చెప్పుకుంటారేమో.. మీడియా అంటే సమాజంలో నాల్గవ స్థంబంగా బలంగా ఉండాలి.. కానీ సమాజంలో జరిగే చావు, పుట్టుకలపైనా పైసలు ఏరుకునే రాబంధుల్లా కాదు.. కాకూడదు.. నిజంగా సాయిగణేష్ సెల్ఫీ ఆత్మహత్యపై కాసులేరుకుంటే దానంత దరిద్రం మరొకటి ఉండదు.. ఉండబోదు. . మీకు ఇక్కడ అనుమానం రావొచ్చు.. కొంపదీసి మీకు ముట్టక ఇదంతా రాసారని అనుకోవచ్చు.. మేము తేడా మీడియాల శవాలపై పైసలు ఏరుకోము.. మాకంటూ కొన్ని విలువలున్నాయి.. సమాజంలోని ఫోర్త్ ఫిల్లర్ గా కొన్ని బాధ్యతలున్నాయి.. అందుకనే జరిగింది.. మాకు తెలిసినది.. విశాఖలో దావానమైనది అక్షర రూపంలో మీ ముందుంచాం. డబ్బు ఎవరికి చేదు చెప్పండి.. కానీ శవాలపై ఎరుకుంటే ఆ డబ్బు నిలువదు.. మృతుడి కుటుంబం శోకం పాపంపై వెంటాడక మానదు.. ఆ క్షణం కాసులు కళ్లకి ఇంపుగా కనిపించొచ్చు.. కానీ తరువాత అంతకు రెండింతలు మనం పోగొట్టుకోవాల్సి వస్తుందనే సత్యాన్ని మాత్రమే నమ్ముతాం.. సత్యమేవ జయతే..! Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.