Jump to content

Teacher elagu pass cheyandu anduke school ki ranu antunatu undi…


psycopk

Recommended Posts

 

YS Jagan: మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు... జగన్ ఏమన్నారంటే...! 

08-11-2024 Fri 06:46 | Andhra
YSRCP Chief YS Jagan given Clarity on assembly session
 

 

  • ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • సమావేశాలకు వైసీపీ హజరుపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో అనుమానం
  • ప్రతిపక్ష హోదా ఇవ్వనందున సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
ఈ నెల 11వ తేదీ నుంచి  ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మూడో అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసింది. కూటమి రికార్డు మెజార్టీతో ఘన విజయాన్ని అందుకుంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో తొలి సమావేశాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. 

ఇక ఆ తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదంటూ వైసీపీ సభ్యులు సమావేశాలకు డుమ్మా కొట్టారు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హజరు అవుతారా ? లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హజరు అయ్యే విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తాము గళం ఎత్తుతామన్న భయంతోనే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం .. వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అటువంటప్పుడు సమావేశాలకు హజరవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హజరు కావడం లేదని స్పష్టీకరించారు. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.  

 

 

Link to comment
Share on other sites

Vangalapudi Anitha: తల్లిని, చెల్లిని తిడుతుంటే జగన్ పౌరుషం ఏమైంది?: హోంమంత్రి అనిత 

07-11-2024 Thu 20:01 | Andhra
Home minister Anitha slams Jagan over social media posts row
 

 

  • సోషల్ మీడియా పోస్టులపై అనిత స్పందన
  • వైసీపీ కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపణ
  • జగన్ రక్తం మరగలేదేమో కానీ... మా రక్తం మరుగుతోంది అంటూ ఫైర్
  • కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉందని వెల్లడి
సోషల్ మీడియా పోస్టుల అంశంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. తల్లి, చెల్లి గురించి వైసీపీ కార్యకర్తలే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత తల్లిని, చెల్లిని తిడుతుంటే జగన్ కు పౌరుషం రాలేదా? అని ప్రశ్నించారు. 

తల్లి, చెల్లి గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడారో మీకు తెలియదా? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో కానీ... మా రక్తం మాత్రం మరుగుతోంది అని జగన్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 

"సోషల్ మీడియాలో ఇష్టంవచ్చినట్టు వాగే కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం. మీరు సప్తసముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం" అంటూ అనిత వార్నింగ్ ఇచ్చారు. ఏపీ పరువును జగన్ ఎప్పుడో తీసేశారని, రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారని అనిత మండిపడ్డారు. 

వైసీపీ పాలనలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్క చూడాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని నేరాలు, ఘోరాలు జరిగినా జగన్ ఐదేళ్ల పాటు మాట్లాడలేదు... అత్యాచారాలు, హత్యలు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. ఇప్పుడొచ్చి, ఈ ఐదు నెలల్లో ఏదో జరిగిపోయిందని అభాండాలు వేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"నాడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమందిపై కేసులు పెట్టారు. చింతకాయల విజయ్, రంగనాయకమ్మ, గౌతు శిరీషలను ఇబ్బందిపెట్టారు. ప్రజాస్వామ్యం ఖూనీ అంటే ఏమిటో జగన్ కు తెలుసా? అమరావతి మహిళా రైతుల గురించి నీచాతినీచంగా మాట్లాడారు. జగన్ హయాంలో పోలీసులను డ్యూటీ చేయనివ్వలేదు. 

వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి దారుణమైన పోస్టులు పెట్టాడు. విజయమ్మ, షర్మిలపై ఘోరమైన పోస్టులు పెట్టడం మనం చూశాం. వైసీపీ కార్యకర్తలు పెట్టే కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది" అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Deepak Reddy: ఇవాళ జగన్ ప్రెస్ మీట్ అంతా ఓ డ్రామాలా ఉంది: దీపక్ రెడ్డి 

07-11-2024 Thu 20:45 | Andhra
Deepak Reddy take a jibe at Jagan press meet
 

 

  • ఏపీలో సోషల్ మీడియా పోస్టుల రగడ
  • ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందంటూ జగన్ ఫైర్
  • ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపణ
  • జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్న దీపక్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. తమ కార్యకర్తలు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలకు సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇవాళ జగన్ మీడియా సమావేశం అంతా ఓ డ్రామాలా ఉందని విమర్శించారు.  

జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు, అరాచకాలకు అడ్డు అదుపు లేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలను అరికట్టామని వెల్లడించారు. దీన్ని ఓర్వలేక వైసీపీ సోషల్ మీడియాలో నీచ రాతలు రాయిస్తున్నారని దీపక్ రెడ్డి ఆరోపించారు. మహిళల శీల హననం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారని... ఇలాంటి ఘోరమైన పోస్ట్ లు పెడితే చర్యలు తీసుకోక జగన్ లా ముద్దులు పెట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సొంత తల్లి, చెల్లిపై కూడా రోత రాతలు రాయించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డేనని అన్నారు. వర్రా రవీంద్రారెడ్డి లాంటి పిచ్చిమూకలను పెట్టుకుని. పచ్చి బూతులతో సోషల్ మీడియా వేదికగా సైకో చేష్టలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. హోంమంత్రిపైనే వల్గర్ పోస్టులు పెడుతున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కుమార్తెలను సోషల్ మీడియాలో ఏడిపించారని దీపక్ రెడ్డి పేర్కొన్నారు. 

ఈ పిల్ల సైకో పిశాచాలను అరెస్ట్ చేస్తుంటే.. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. జగన్ ను వీడి అందరూ పారిపోతున్నారని... ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ జమిలి ఎన్నికల మంత్రం చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ వచ్చే ఎలక్షన్ కు ఉండదని దీపక్ రెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు దమ్ముంటే 11 న అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. 

"మహిళలపై సోషల్ మీడియా వేదికగా రాయలేని భాషలో పోస్టులు పెడుతున్న వైసీపీ కాలకేయులను పెంచి పోషిస్తున్న నీకు మహిళలపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది జగన్ రెడ్డి? నీ తల్లి, చెల్లెళ్లపై కూడా సోషల్ మీడియాలో రోత పోస్టులు పెట్టిస్తున్నావ్.  నీ పిన్నమ్మ తాళి తెంచిన వాడికి రక్షణ కల్పించావ్. నీ పాలనలో తమకు రక్షణ లేదని చెల్లెళ్లు సునీత, షర్మిల వేడుకునే పరిస్థితి కల్పించావ్.

చంద్రబాబు నాయకత్వంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. గంజాయి , డ్రగ్స్ పై సిట్ వేసి ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ చూసి ఓర్వలేక అవినీతి సాక్షి, సోషల్ మీడియా వేదిక వైసీపీ కాలకేయులతో వికృత ప్రచారం చేయిస్తావా జగన్ రెడ్డీ?  

రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియా వేదికగా మహిళలపై నీచపు రాతలు రాయడానికి సిగ్గు అనిపించడం లేదా?  ఇకనైనా బుద్ధి తెచ్చుకో...లేకపోతే రాష్ట్ర మహిళలు చీపుర్లతో నీకు సన్మానం చేసే రోజు దగ్గరలోనే ఉంది" అంటూ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Sharmila: నా ఇంటి పేరు మార్చి రాక్షసానందం పొందారు: షర్మిల 

07-11-2024 Thu 18:37 | Andhra
Sharmila reacts on social media trolls
 

 

  • సోషల్ మీడియా పోస్టులపై షర్మిల స్పందన
  • సామాజిక మాధ్యమాలు సమాజానికి మేలు చేసేలా ఉండాలని వెల్లడి
  • సైకోలు సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారని విమర్శలు
  • తల్లి, చెల్లి అనే ఇంగితజ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారని ఆగ్రహం
ఏపీ అధికార టీడీపీ కూటమి, వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టులపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ అంశంపై స్పందించారు. సోషల్ మీడియా ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసేలా ఉండాలని అభిలషించారు. కానీ, కొందరు సైకోలు సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారని తెలిపారు. 

మానవ సంబంధాలు, రక్తసంబంధాలు మరిచి మృగాల్లా మారారని... తల్లి, చెల్లి అనే ఇంగితజ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారని   షర్మిల మండిపడ్డారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షసానందం పొందారని విమర్శించారు. 

"సోషల్ మీడియా సైకోల బాధితుల్లో నేను కూడా ఉన్నాను. అసభ్యకర పోస్టులతో పరువుప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరించారు. దారుణమైన పోస్టులతో పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాపై, నా తల్లిపై, నా సోదరి సునీతపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని దారుణాతిదారుణంగా అవమానించారు. నా ఇంటి పేరు కూడా మార్చి రాక్షసానందం పొందారు. 

నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కేసు పెట్టాను. సైకోలా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. దారుణమైన పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా వారి అంతు చూడాలి" అంటూ షర్మిల పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Jagan: ఇవి అందరూ అంటున్న మాటలే: చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ రిప్లయ్ 

07-11-2024 Thu 16:22 | Andhra
Jagan take a dig at Chandrababu over social media posts
 

 

  • సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
  • ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఫైర్
  • ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్న జగన్
  • సుప్రీం మార్గదర్శకాలు పాటించడంలేదని విమర్శలు
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదంటూ సీఎం చంద్రబాబు ఇవాళ గట్టి హెచ్చరికలు జారీ చేయగా... వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు వ్యాఖ్యలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే చాలు... అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

వీళ్ల అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదా? ఆఖరికి వరదసాయంపై నిలదీసినా తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక, కరెంట్ చార్జీలు, మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా? పోర్టుల ప్రైవేటీకరణపై ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే ఎవరూ నిలదీయకూడదా? అంటూ ధ్వజమెత్తారు. 

"విద్య వద్దు... మద్యం ముద్దు అని ఓ పిల్లవాడు పోస్టు పెట్టాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చెప్పిన మాటల్లో తప్పేముంది? నిజమే కదా... అమ్మ ఒడి ఇవ్వడంలేదు, విద్యా దీవెన ఇవ్వడంలేదు, వసతి దీవెన ఇవ్వడంలేదు. నాన్నకు ఫుల్లు... అమ్మకు నిల్లు అని ఆ పోస్టులో ఉంది... అందులో ఏం తప్పుంది? చంద్రబాబు గారి అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్టు ఉందని కేసు పెట్టారు.

మరో పోస్టును ఫార్వార్డ్ చేసినా కేసు పెట్టారు. జనసేన నేతలతో బలవంతంగా కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు... అని ఆ పోస్టులో ఉంది. ఇలాంటివి అన్ని టీవీ చానళ్లలో కూడా వచ్చాయి. ఆ విధంగా వచ్చిన దాన్ని వీళ్లు ఫార్వార్డ్ చేశారంతే! పాపం... వాళ్ల మీద కూడా కేసు పెట్టేశారు. 

మరో సోషల్ మీడియా యాక్టివిస్టు... చంద్రబాబు, పవన్ విజయవాడ వరదల పేరుతో రూ.534 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని... కేవలం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే రూ.23 కోట్లు ఖర్చు అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇవి అందరూ అంటున్న మాటలే. ఈ పోస్టు పెట్టినందుకు కూడా కేసు బుక్ చేశారు. 

తిరుమల ఆలయంలో చంద్రబాబు తలపై పట్టువస్త్రాలు పక్కకు ఒరిగితే.... లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు అసత్యప్రచారం వెంకటేశ్వరస్వామికి కూడా నచ్చలేదు... అందుకే పట్టువస్త్రాలు పక్కకి పడిపోయాయి అంటూ మరో సోషల్ మీడియా యాక్టివిస్టు పోస్టు చేశాడు... పాపం, అంతకంటే అతడేమీ అనలేదు... కానీ అతడిపైనా కేసు పెట్టేశారు. వారం రోజులుగా ఈ తంతు విచ్చలవిడిగా జరుగుతోంది. 101 మందిని బుక్ చేసేశారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ఇష్టం వచ్చినట్టు ఇంటికొచ్చి అరెస్ట్ చేయకూడదు, ఇష్టంవచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్లకూడదు... ఇలా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు ఓ ప్రొసీజర్ ఉంది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. 

విచారణ జరిపిన తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే వస్తే... ముందు వారెంట్ జారీ చేయాలి, ఆ తర్వాత మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి... ఇవి నేను చెబుతున్నవి కాదు... ఇవి సుప్రీంకోర్టు ఆదేశాలు. కానీ ఎక్కడా ఆదేశాలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేసే విధంగా అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు" అంటూ జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.
Link to comment
Share on other sites

Chandrababu: కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడంతో పవన్ బాధపడ్డారు: సీఎం చంద్రబాబు 

07-11-2024 Thu 14:40 | Andhra
CM Chandarababu fires on social media posts
 

 

  • సోషల్ మీడియా పోస్టులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
  • సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామని వెల్లడి
  • మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారని వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామని అన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. 

"విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారు... నాపై, అనితపై, పవన్ కల్యాణ్ పై కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ పైనే కాదు, ఆయన పిల్లలను కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏ ఆడపిల్లను వదలకుండా అందరి గురించి మాట్లాడుతున్నారు. 

సోషల్ మీడియాలో పోస్టులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా? ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా? ప్రశ్నే లేదు... చర్యలు తీసుకోవాల్సిందే. కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడంపై పవన్ కల్యాణ్ బాధపడ్డారు. ఆడబిడ్డల కన్నీటికి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? 

రాజకీయ ముసుగులో నేరస్తులు చెలామణి అవుతుండడం వల్లే ఈ అనర్థాలు. కొవ్వు ఎక్కువై ఇలా నేరస్తులుగా మారారు.  కొవ్వు పెరిగిన వాళ్ల కొవ్వు కరిగిస్తాం. ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు ఉంటాయి. హద్దు మీరి ప్రవర్తిస్తున్నవారు ఇక ఖబడ్దార్ జాగ్రత్త! చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ఊరుకునేది లేదు.

ఎక్కడైనా శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే, అడ్డుపడాలని చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులతో మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అధికారం పోయిన వెంటనే, ఈ సైకోలు సోషల్ మీడియాలో, ఇంట్లో ఆడవాళ్ళపై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, పోస్టులు పెడుతూ, కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...