Jump to content

Tg news for paytms


psycopk

Recommended Posts

 

Sabitha Indra Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఒకరి చావును కోరుకోవడం ఎంత వరకు సమంజసం?: సబితా ఇంద్రారెడ్డి 

09-11-2024 Sat 21:19 | Telangana
sabitha Indra Reddy questions CM Revanth Reddy over allegations on KCR
 

 

  • సీఎం మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శ
  • తెలంగాణ ప్రదాత కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య
  • సభ్య సమాజానికి సీఎం ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరి చావును కోరుకోవడం ఎంత వరకు సమంజసమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నిన్న మూసీ పునరుద్ధరణ యాత్ర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు శోచనీయమన్నారు. సభ్య సమాజానికి సీఎం ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తన పుట్టినరోజు నాడు కూడా సీఎం... కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయాడని విమర్శించారు. దీనిని బట్టే కేసీఆర్ అంటే ఎంత భయమో తెలుస్తోందన్నారు.

రేపు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నచింతకుంట మండలంలో అమ్మాపూర్ కురుమూర్తిస్వామి వారిని దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయం సమీపంలో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.  

 

 

Link to comment
Share on other sites

KTR: ప్రశ్నించేవారంటే రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు?: కేటీఆర్ 

09-11-2024 Sat 19:43 | Telangana
KTR blames Revanth Reddy for arrest journalist
 

 

  • జర్నలిస్ట్ అరెస్ట్ అప్రజాస్వామికమన్న కేటీఆర్
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం
  • నిఘా వేసి.. రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారన్న హరీశ్ రావు
ప్రశ్నించే వారంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జర్నలిస్ట్, వైఆర్ టీవీ రంజిత్‌ను అరెస్ట్ చేయడంపై కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికమని కేటీఆర్ మండిపడ్డారు. 

రాష్ట్రంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని విమర్శించారు. మీ 11 నెలల పాలనలో జర్నలిస్ట్‌లపై దాడులు, అక్రమ కేసులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిలదీసినందుకే జర్నలిస్ట్ రంజిత్‌ను నిర్బంధించారన్నారు. అతనిని వెంటనే విడుదల చేయాలని... అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్‌లపై ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

జర్నలిస్ట్ అరెస్టును హరీశ్ రావు ఖండించారు. నిఘా వేసి, రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తిచూపితే అరెస్ట్ చేయడమేమిటన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

Harish Rao: అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉన్న కౌశిక్ రెడ్డి బాధ్యత ప్రభుత్వానిదే: హరీశ్ రావు 

09-11-2024 Sat 17:13 | Telangana
Harish Rao blames government in Koushik Reddy issue
 

 

  • దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి ధర్నా
  • పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • దళితబంధు అడిగితే దాడి చేస్తారా? అని కేటీఆర్, హరీశ్ రావు ఆగ్రహం
హుజూరాబాద్ చౌరస్తాలో అంబేడ్కర్ సాక్షిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇది ప్రజాపాలన కాదు... రేవంత్ మార్క్ రాక్షస పాలన... కాంగ్రెస్ మార్క్ నిరంకుశ పాలన... ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను , కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 

మరోవైపు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

దళితబంధు అడిగితే దాడి చేస్తారా?: కేటీఆర్

దళితబంధు అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? అని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. పోలీసులు ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకే పని చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీసులకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని విమర్శించారు. అందుకే గతంలో అరికెపూడి గాంధీతో దాడి చేయించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం దాడి చేయించాడని ధ్వజమెత్తారు. ఇంతటి పిరికి ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిని ఆయన ఖండించారు.

ఏం జరిగింది?

దళితబందు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో ధర్నా చేశారు. దళిత కుటుంబాలతో కలిసి ఆయన ధర్నాకు దిగడంతో... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇది ఉద్రిక్తంగా మారింది. ఓ దళిత మహిళ స్వల్పంగా గాయపడింది. హుజూరాబాద్ చౌరస్తాలో ధర్నా చేయడంతో వరంగల్-కరీంనగర్ హైవేపై వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని కౌశిక్ రెడ్డి చెప్పడంతో పోలీసులు అతనిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా చేస్తుంటే పోలీసులు తనతో పాటు, ధర్నా చేస్తున్న వారిని తీవ్రంగా కొట్టారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
Link to comment
Share on other sites

Telangana: నా అరెస్ట్ కోసం రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు: కేటీఆర్ ట్వీట్ 

08-11-2024 Fri 14:09 | Telangana
Revanth Reddy is seeing for my arrest says ktr
 

 

  • 'సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి' అంటూ వచ్చిన వార్తను జత చేసిన కేటీఆర్
  • సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే దమ్ముందా? అని ప్రశ్న
  • మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా? అని కేటీఆర్ నిలదీత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనలో తనను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 'సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి?' అంటూ వెలుగు పత్రికలో వచ్చిన వార్తను తన ట్వీట్‌లో జత చేశారు.

తన అరెస్ట్ కోసం సీఎం వేచి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. కానీ సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్ చేయడానికి ప్రభుత్వానికి దమ్ముందా? మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ముందా? ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ని తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసేయడానికి దమ్ముందా? పైవాటిని చేసే దమ్ముందా? లేదా? చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ ముఖ్యమంత్రి అయి ఉండి 'మేఘా'కు గులాంగిరీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

అరెస్ట్‌లను ఖండిస్తున్నా: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అరెస్ట్‌లను ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌ల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా... కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలు వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కేటీఆర్ చేశారు.
Link to comment
Share on other sites

Rahul Gandhi: కులగణనపై రాహుల్ గాంధీ ట్వీట్... స్పందించిన రేవంత్ రెడ్డి 

09-11-2024 Sat 20:15 | Telangana
Revanth Reddy responds on Rahul Gandhi tweet
 

 

  • తెలంగాణలో కులగణన ప్రారంభమైందన్న రాహుల్ గాంధీ
  • కులగణనతో సరికొత్త విప్లవయాత్రకు శ్రీకారం చుట్టామన్న సీఎం
  • రాహుల్ వాగ్ధానం మేరకు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుందని వ్యాఖ్య
తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణలో కులగణన ప్రారంభమైందని... రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి ఈ డేటాను వినియోగిస్తామని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోనూ ఇదే జరగనుందని... పార్లమెంట్‌లో ఈ కులగణను ఆమోదించి, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం అడ్డుగోడలను బద్ధలు కొడతామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ... రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణలో ఈరోజు కులాల సర్వే గణన ప్రారంభంతో సరికొత్త విప్లవయాత్రకు శ్రీకారం చుట్టామని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుందని పేర్కొన్నారు. కులగణన చేపట్టిన కార్యక్రమం చేపట్టిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.
Link to comment
Share on other sites

Mallu Bhatti Vikramarka: నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క 

09-11-2024 Sat 16:22 | Telangana
Praja Vijayothsavalu in Telangana from Nov 14 to December 9
 

 

  • ప్రజా విజయోత్సవాలపై భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
  • విధివిధానాల రూపకల్పనకు సమావేశం
  • ప్రజా విజయోత్సవాలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన సబ్ కమిటీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా విజయోత్సవాల నిర్వహణపై భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రజా విజయోత్సవాలు ఏ విధంగా జరపాలి? ఏ అంశాలపై ప్రచారం చేయాలి? అనే దానిపై విధివిధానాలను రూపొందించేందుకు సమావేశమయ్యారు.

ఈ సబ్ కమిటీ ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి... పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించింది. విజయోత్సవాల్లో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ 25 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పలు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ నుంచి గ్రామస్థాయి వరకు ఈ సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Link to comment
Share on other sites

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మోదీ అబద్ధాలు చెబుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి 

09-11-2024 Sat 15:23 | Telangana
CM Revanth Reddy fires at PM Narendra Modi
 

 

  • గ్యారెంటీల అమలుపై తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
  • మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే తాము నిజాలు చెబుతామన్న సీఎం
  • కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని మరిచాయని విమర్శ
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముంబైలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 

ప్రధాని నరేంద్రమోదీ కూడా తెలంగాణలోని ఆరు గ్యారెంటీల అమలుపై మహారాష్ట్రలో అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే తాము నిజాలు చెబుతూనే ఉంటామని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఆరు గ్యారెంటీలపై నిజాలు చెప్పేందుకే తాను మహారాష్ట్రకు వచ్చానన్నారు.

మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని ఆరోపించారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రైతులకు తమ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని వెల్లడించారు. 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామన్నారు. రుణమాఫీపై వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధమన్నారు.

తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామన్నారు. తాను వివరాలు అందించాక ప్రదాని మోదీ తన ట్వీట్‌ను డిలీట్ చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. 

సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామన్నారు. 2025 జనగణనలో తెలంగాణ కులగణనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశ చరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లాయన్నారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు.
Link to comment
Share on other sites

Telangana: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉపసంఘం... చైర్మన్ గా భట్టి విక్రమార్క 

09-11-2024 Sat 07:55 | Telangana
formation of a ministerial sub committee to solve the problems of government employees
 

 

  • సమస్యల పరిష్కారానికి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉద్యోగుల జేఏసీ నేతలు
  • కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సీఎం
  • కేబినెట్ కమిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నేతలు
తెలంగాణలో ఉద్యోగుల జేఏసీ నేతలకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేశారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇటీవల ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 

ఆ సమయంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కె. కేశవరావు సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. త్వరగా సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.    
Link to comment
Share on other sites

Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన బండి సంజయ్ 

09-11-2024 Sat 22:18 | Telangana
Bandi Sanjay fires at KCR and Revanth Reddy
 

 

  • మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం
  • తాము మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెడతామని హెచ్చరిక
  • ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ బయటకు రాలేదని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి ఆయన 'జితేందర్ రెడ్డి' సినిమాను చూశారు. సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు అన్నారు. అందుకే మోసాలు, అబద్ధాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు.

ఆరు గ్యారెంటీలపై మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం కాదని... తెలంగాణలో ఉండి చెప్పాలని సవాల్ చేశారు. నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారని, అందులో వీటిని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం చెప్పారని... కానీ 20 లక్షల మంది రైతులకు మాఫీ కాలేదన్నారు. ఇతర హామీలు కూడా అమలు చేయలేదన్నారు.

హామీలు నెరవేర్చకుండానే మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మేమూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బండారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంపై పదకొండు నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారని తెలిసే హర్యానాలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై యుద్ధం చేస్తామని సీఎం అంటున్నారని... ఎందుకు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? రోడ్లకు నిధులు ఇస్తున్నందుకా? స్మార్ట్ సిటీలు తయారు చేస్తున్నందుకా? గ్రామాలను అభివృద్ధి చేస్తున్నందుకా? ఎందుకు యుద్ధం చేస్తారో చెప్పాలన్నారు.

రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై కేసీఆర్ ప్రభుత్వం రూ.1 లక్ష అప్పు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడో మరిచిపోయారన్నారు. అందుకే ఆయన ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వంటి వారిని తెలంగాణ సమాజం లీడర్‌గా భావించదన్నారు. రాష్ట్రంలో సమస్యలు వచ్చినప్పుడు బయటకు రాని కేసీఆర్... కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తానని అంటున్నాడని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...