psycopk Posted November 10 Report Share Posted November 10 Ambati Rambabu: ఏపీ డీజీపీని కలిసిన వైసీపీ నేతలు 10-11-2024 Sun 06:53 | Andhra టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపణ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను తీసుకెళ్తున్న పోలీసులు.. వారి అరెస్టును చూపించకుండా... రోజుల తరబడి వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వైసీపీ నేతల బృందం డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలపై అసభ్యపోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. డీజీపీకి వినతి పత్రం అందజేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ .. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో తప్పక... పోలీసులు శనివారం సుధారాణి దంపతులను గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారని చెప్పారు. సుధారాణి, ఆమె భర్తను పోలీసులు దారుణంగా కొట్టిన విషయాన్ని మెజిస్ట్రేట్ ముందే స్టేట్‌మెంట్ రికార్డు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతోనే పోలీసులు వైసీపీ నేతలపై దాడికి దిగుతున్నారని అంబటి మండిపడ్డారు. వీటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మీద అసభ్యంగా పోస్టులు పెట్టినవారిని తాము సమర్ధించడంలేదన్న అంబటి... ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు ఫైల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 'అమ్మకు నిల్... తండ్రికి పుల్', 'విద్య వద్దు.. మద్యం ముద్దు' అంటే కేసులు పెడతారా? అని నిలదీశారు. ఇదే విషయాన్ని డీజీపీకి వివరించామన్నారు. అధికార పార్టీ నేతలపై ఏ పోస్టులు పెట్టారని మీరు అరెస్టు చేశారో... అదే రకంగా జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ, వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు మీద అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు కచ్చితంగా పోరాటం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న చంద్రబాబు... ఆడబిడ్డ సుధారాణిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ ... ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను, తప్పిదాలను వైసీపీ కార్యకర్తలు ఎత్తి చూపిస్తే.. అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులనూ వేధించడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ కొంత మంది వైసీపీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాధిత కుటుంబాల తరపున హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశామన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 10 Author Report Share Posted November 10 Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో డీజీపీ భేటీ 10-11-2024 Sun 07:55 | Andhra ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్‌తో సమావేశమైన డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం రాష్ట్రంలో పలువురు పోలీసుల అధికారుల తీరుపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ తీరుపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపాయి. పవన్ వ్యాఖ్యలపై నాడు హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశాల్లో వివరణ కూడా ఇచ్చారు. అయితే శనివారం స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు, సోషల్ మీడియాలో అసభ్యకమైన పోస్టులు చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై పవన్ తో డీజీపీ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరి భేటీకి సంబంధించి ఇటు డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కానీ, అటు డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 10 Author Report Share Posted November 10 Pawan Kalyan: పోలీసులపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ 09-11-2024 Sat 21:41 | Andhra గత సెప్టెంబరులో కాకినాడలో ఇద్దరు విద్యార్థుల మృతి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ రోడ్డు ప్రమాదాల వేళ పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పోలీసుల తరఫున మృతుల కుటుంబాలకు క్షమాపణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తరచుగా పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, మరోసారి పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సెప్టెంబరులో కాకినాడలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా... పవన్ నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ, రోడ్డు ప్రమాదాల వేళ పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు విద్యార్థుల మృతి ఘటనలో పోలీసుల తీరు బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు పోలీసుల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. అంతటి బాధలో కూడా విద్యార్థి రేవంత్ అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన తల్లిదండ్రుల మానవత్వం కదిలించిందని అన్నారు. బాధిత కుటుంబాలకు సొంతంగా రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు బాధ్యతగా పనిచేయకపోతే, వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో కేసుల భయం కాకుండా, తక్షణ సాయం అవసరమని తెలిపారు. ఈ విషయంలో అవగాహన కల్పించే దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.