Jump to content

Nara Lokesh: నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దే ప్రయత్నం: మంత్రి లోకేశ్

psycopk

Recommended Posts

Nara Lokesh: నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దే ప్రయత్నం: మంత్రి లోకేశ్ 

15-11-2024 Fri 13:11 | Andhra
 
Minister Lokesh says Govt colleges should compete with Narayana

  • ప్రైవేటుసంస్థలకు దీటుగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని వెల్లడి
  • కూటమి ప్రభుత్వం వచ్చాక జూనియర్ కాలేజిల్లో విద్యార్థులు పెరిగారన్న మంత్రి
  • ఇండస్ట్రీ అవసరాల మేరకు డిగ్రీ విద్యార్థుల తయారీ దిశగా అడుగేస్తున్నట్లు వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ విద్యలో పలు సంస్కరణలను తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కాలేజీలు తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ... గత ప్రభుత్వంలో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదని, తాను మంత్రి అయ్యాక ఈ పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు.

కాలేజీలకు సరైన స్టాఫ్ ఇవ్వకుండా తెరవడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 15 వేల అడ్మిషన్లు పెరగడం శుభపరిణామం అన్నారు. విద్యార్థులను ఎ, బి, సి కేటగిరిలుగా విభజించి వెనుకబడి విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం మంత్రి నారాయణను ఇన్‌పుట్స్ అడిగామని... నిన్న ఒక వర్క్ షాపునకు ఆయన ముఖ్యఅతిధిగా వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు.

స్కూలు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో సమావేశమై భవనాలు, ఫ్యాకల్టీ, మెటీరియల్‌పై మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు ర్యాంకింగ్ మెకానిజం తెచ్చి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి, తల్లిదండ్రులకు తెలియజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మెగా పిటిఎం నిర్వహిస్తున్నామని, దీనికి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఎమ్మెల్యే... ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఏం చేస్తే బాగుంటుందో మీరిచ్చే సలహాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. తగరపువలస డిగ్రీ కాలేజి కేజీబీవీ స్కూలులో రన్ అవుతోందని, త్వరలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సింహాచలం స్కూల్ భవనాల నిర్మాణాన్ని ఆరునెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 169 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్నాని తెలిపారు.

కానీ 49 నియోజకవర్గాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు లేవని... 91 నియోజకవర్గాల్లో ఒకటి, 27 చోట్ల రెండు, 8 చోట్ల 3 డిగ్రీ కాలేజిలు ఉన్నట్లు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, అయితే భీమిలిలో అడ్మిషన్ రేటు 73 శాతం ఉండగా, తగరపువలసలో 36 శాతం మాత్రమే ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు 50 శాతం దాటడం లేదన్నారు. ఐటీఐకి మాత్రం డిమాండ్ ఉందని, ఫ్యాకల్టీ, భవనాలు, మీడియం కరెక్టుగా లేకపోవడమే అడ్మిషన్ల తగ్గుదలకు కారణమన్నారు. డిగ్రీ కాలేజీలను ఇండస్ట్రీ సెంట్రిక్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

AP Govt: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటి మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు 

15-11-2024 Fri 19:30 | Andhra
 
AP Govt ties up with IIT Madras

  • అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు
  • ఐఐటీ మద్రాస్ తో  8 విభాగాల్లో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
  • అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరం తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటీ మద్రాస్ తో కూటమి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. 

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటీ మద్రాస్ నిర్ణయించింది. 

ఐఐటీ-ఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో  జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. సాయంత్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికా శుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటీ మద్రాస్ డైరక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారథి, ఎంజే శంకర్ రామన్ (సీఈవో, ఐఐటీ-ఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్), ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల (మాజీ డీన్, ఐఐటీ-ఎం కార్పొరేట్ రిలేషన్స్), ప్రొఫెసర్ రవీంద్రన్ (హెడ్, సెంటర్ ఫర్ రెస్పాన్సిబిల్ ఎఐ), రాజేష్ (ఐఐటీ-ఎం అల్యూమినస్), చెన్నై సీఎంవో అధికారి రిజ్వాన్ తదితరులు  పాల్గొన్నారు.

1. ఐఐటీఎం–ఏపీ సీఆర్డీయే ఒప్పందం

అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహాల కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటీఎం సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది. 

2. ఐఐటీఎం – ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం

సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. 

3. ఐఐటీఎం – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందం

స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫాంల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 

4). ఐఐటీఎం – ఏపీ విద్యాశాఖ ఒప్పందం

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరుపార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఐటీఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఏపీలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.

5). ఐఐటీఎం – ఇన్వెస్టిమెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం

విమానాశ్రయాలను లాజిస్టిక్స్ / మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. 

6. ఐఐటీఎం – ఐటీ శాఖ ఒప్పందం

అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడం... తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ ఒప్పందం ఉద్దేశం.

7. ఐఐటీఎం – ఆర్టీజీఎస్ శాఖ ఒప్పందం

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటీఎం ప్రవర్తక్ తో ఏపీ ఆర్టీజీఎస్ కలసి పనిచేస్తుంది.

8. ఐఐటీఎం – క్రీడల శాఖ ఒప్పందం

అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది.
20241115fr673753ca721b5.jpg20241115fr673753d549522.jpg

Link to comment
Share on other sites

Central Gov is merging intermediate into schools ga already.. malla inka inter colleges ni maa parayana ki dheetuga cheyadam endhuku?

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

CONFLICT OF INTEREST ani oka term untadhi, telusa annagoru? Narayana ni minister ga, Chaitanya ni funder ga pettukuni Sarkar badulani leputha ante Ela nammaru? Monne kadha, English medium teesesam, I.B teesesam, inko IB techam.

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

3. ఐఐటీఎం – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందం

Wow..

Isari dorakakunda ela dabbulu dobbeyalo nerchukuntaru..

Link to comment
Share on other sites

8 minutes ago, Android_Halwa said:

Wow..

Isari dorakakunda ela dabbulu dobbeyalo nerchukuntaru..

SKILL DEVELOPMENT ante CHOTA KALA ani mata. Sarkar Khajana ki scissoring  ✂️ ✂️ lo ani mata.

"What I'm saying, Rastranni abhivruddhi loki tesukuvelthunnanu".

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...