Jump to content

Nara Ramamurthy Naidu: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత


psycopk

Recommended Posts

Nara Ramamurthy Naidu: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత 

16-11-2024 Sat 15:02 | Andhra
 
Chandrababu brother Ramamurthy Naidu dead

 

  • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
  • మధ్యాహ్నం 12.45 గంటలకు మృతి చెందారని వైద్యుల ప్రకటన
  • రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చికిత్స పొందుతున్న ఆయన... ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 14 ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు. 

ఇప్పటికే నారా లోకేశ్, పురందేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

1994లో టీడీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తినాయుడు గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. నారా రోహిత్ సినీ హీరో అనే విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Chandrababu: మా నుంచి దూరమై... మా కుటుంబంలో ఎంతో విషాదం నింపాడు: చంద్రబాబు 

16-11-2024 Sat 17:38 | Andhra
 
Chandrababu on his brothers death

 

  • తమ్ముడు రామ్మూర్తి పార్థివదేహాన్ని చూసి చలించిపోయిన చంద్రబాబు
  • తనను విడిచి వెళ్లిపోయాడంటూ ఆవేదన
  • పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని వ్యాఖ్య
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు... తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించారు. నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి చలించిపోయారు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తమ్ముడు రామ్మూర్తినాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని చెప్పారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

మరోవైపు రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Nara Rammurthi naidu: నారా రామ్మూర్తినాయుడి మృతిపై ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి 

16-11-2024 Sat 16:33 | Andhra
 
AP Ministers reacts to Nara Rammurthi Naidu demise

 

  • చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు
  • రామ్మూర్తినాయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల ఏపీ మంత్రులు స్పందించారు. రామ్మూర్తినాయుడు గుండెపోటుతో మరణించడం పట్ల మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢసానుభూతి తెలిపారు. 

రామ్మూర్తినాయుడి మృతి చంద్రగిరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటు అని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు, శాప్ చైర్మన్ రవినాయుడు స్పందిస్తూ... రామ్మూర్తినాయుడి మృతి కలచివేసిందని అన్నారు.
Link to comment
Share on other sites

Pawan Kalyan: చంద్రబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన పవన్ కల్యాణ్ 

16-11-2024 Sat 17:55 | Andhra
 
Pawan Kalyan condolences to Chandrababu family

 

  • రామ్మూర్తినాయుడు మరణ వార్తతో మనోవేదనకు గురయ్యానన్న పవన్
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని వెల్లడి
  • రామ్మూర్తి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడు అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు సానుభూతిని తెలియజేశారు. 

రామ్మూర్తినాయుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ కు, కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని పవన్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. రామ్మూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

రామ్మూర్తి మరణంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రామ్మూర్తి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన మరణం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని అన్నారు. రామ్మూర్తినాయుడు కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన సేవలను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...