Jump to content

Viveka murder case lo cbn em peekadu?


nuvvu_naakina_paalem

Recommended Posts

YS Avinash Reddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం... అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు 

19-11-2024 Tue 14:34 | Andhra
 
Supreme Court issues notice to Avinash Reddy in Viveke Murder Case

 

  • అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న డాక్టర్ సునీత
  • సునీత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • అవినాశ్ రెడ్డిని, చైతన్యరెడ్డిని ప్రతివాదులుగా చేర్చాలన్న సునీత న్యాయవాది
  • అంగీకరించిన సీజేఐ బెంచ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. 

సునీత తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్యకు సంబంధించి మొదటి నుంచి జరిగిన పరిణామాలను లూథ్రా సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ రెడ్డి ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్నారని, ఈ కేసుకు సంబంధించి అతడు కీలకమైన వ్యక్తి అని వెల్లడించారు. 

అంతేకాకుండా, ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని (దస్తగిరి)... శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని సిద్ధార్థ లూథ్రా సీజేఐ బెంచ్ కు తెలియజేశారు. ఒక ప్రైవేటు డాక్టర్ గా ఉన్న వ్యక్తి జైలులోకి వెళ్లి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు. 

చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లి ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుంటారా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించగా... చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లే డాక్టర్ కాదని, నిబంధనలకు విరుద్ధంగా జైలులోకి వెళ్లారని లూథ్రా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 

వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.
Link to comment
Share on other sites

Case move aaindo ledo…. Jagan started moving coins

Jagan: శృంగేరి శారదా పీఠానికి వెళ్లనున్న జగన్ 

19-11-2024 Tue 14:33 | Andhra
 
Jagan going to Sringeri Sharada Peetam

 

  • సాయంత్రం 4.30 గంటలకు విజయవాడకు వెళుతున్న జగన్
  • గాంధీనగర్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించనున్న వైనం
  • శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం విజయవాడలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఆయన విజయవాడకు బయల్దేరుతారు. 

విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని ఆయన సందర్శించనున్నారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది.
Link to comment
Share on other sites

YS Sunitha Reddy: ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ సునీత 

19-11-2024 Tue 14:07 | Andhra
 
YS Sunitha went to AP Assembly

 

  • హోం మంత్రి అనితను కలిసిన సునీత
  • తన తండ్రి హత్య కేసు గురించి చర్చించిన వైనం
  • జైలు అధికారులకు దస్తగిరి రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించాలని విన్నపం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి... జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.  

అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరినట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Case move aaindo ledo…. Jagan started moving coins

 

Jagan: శృంగేరి శారదా పీఠానికి వెళ్లనున్న జగన్ 

19-11-2024 Tue 14:33 | Andhra
 
Jagan going to Sringeri Sharada Peetam

 

  • సాయంత్రం 4.30 గంటలకు విజయవాడకు వెళుతున్న జగన్
  •  

Who is the head of this institution? is 420 Seeking mediation with Central? 

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, Hitman said:

Who is the head of this institution? is 420 Seeking mediation with Central? 

Maybe a BJP stooge. He gave them a lot of land in Vizag which new government took back.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:
  • హోం మంత్రి అనితను కలిసిన సునీత
  • తన తండ్రి హత్య కేసు గురించి చర్చించిన వైనం

Lol….Case CBI deal sestunte sunitha met with Anitha..

#DisgraceMinister

Link to comment
Share on other sites

On 11/17/2024 at 8:03 PM, psycopk said:

+1 Cbi ipudu ravali avinash ni arrest cheyataniki…

Adu already bail mida ne vundu….bongu la arrest..! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...