psycopk Posted November 23 Report Share Posted November 23 Tirumala- శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ప్రారంభం O23-11-2024 Sat 07:22 | Both States లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు దిగిన సిట్ శుక్రవారం తిరుపతికి చేరుకున్న సిట్ బృందం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్‌కు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. తిరుపతికి శుక్రవారం సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలతో కూడిన సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం పూర్తి స్థాయి విచారణ జరిపి సీబీఐ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించనుంది. డీఎస్పీలు సీతారామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యలు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్నారు. అలాగే లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted November 23 Report Share Posted November 23 Okay... Mari Samaptham eppudoo... nenu musalodu ayyaka... Quote Link to comment Share on other sites More sharing options...
praying Posted November 23 Report Share Posted November 23 1 hour ago, Joker_007 said: Okay... Mari Samaptham eppudoo... nenu musalodu ayyaka... ys viveka case close avvagane idi untadi 1 Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted November 24 Report Share Posted November 24 22 hours ago, praying said: ys viveka case close avvagane idi untadi aithey eppatiki kaadanna mata.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.