Jump to content

Inni risk lu padi mandhu thaagudu avasarama adhyaksha

nokia123

Recommended Posts

ఎంత తాగొచ్చు?

అసలు తాగకూడదు. 

ఎంత తాగితే పర్లేదు?

లివర్ రోజుకి ఒక పెగ్గు కంటే ఎక్కువ హ్యాండిల్ చెయ్యలేదు. దానికి సమానంగా 100ఎంఎల్ వైను లేదా 300 ఎంఎల్ బీరు. కానీ ఎవరూ ఇక్కడితో ఆపరు. ఆపగలం అనుకుంటారు అంతే.

అంతకంటే ఎక్కువైతే?

ముందు లివర్ వాస్తుంది, తర్వాత తగిన మందంతా కొవ్వులా లివర్లో చేరిపోతుంది. అక్కడ ఇక లివర్ ఇంకా వాచి కొన్ని లివర్ కణాలు చచ్చిపోవడం మొదలవుతుంది. లివర్ మంచిది వాటిని మళ్లీ తయారుచేస్తుంది పాపం, కానీ అవి మళ్లీ అడ్డదిడ్డంగా పెరుగుతాయి, మళ్లీ తాగితే చస్తాయి, చచ్చీ బతికీ, బతికీ చచ్చి లివర్ నిండా గాయాలయ్యి అది పాపం కుచించుకుపోతుంది. ఎంతలా అంటే దాదాపు సగం అయిపోతుంది. పాపం అందులోంచి కడుపు, పేగుల నుంచి వెళ్లే రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. దాంతో ఒత్తిడి కిందకి తన్నేస్తుంది. పేగులు, కడుపు చుట్టూ అవి వాచిపోయి, పొట్ట ఉబ్బి పగిలిపోతాయి. దాదాపు చాలా రక్తం వాంతిలా లేదా నల్లటి విరేచనంలా పోతుంది. 

కొంచెం తక్కువ భయపెట్టండి. ఇలా జరగడానికి ఎన్నాళ్లు పడుతుంది?

నేను చూసినవాళ్లలో 19-20కి మొదలెట్టినవాళ్లు, బాగా తాగి సరిగ్గా వాళ్ళ పిల్లలు పదో తరగతి చదివే సమయానికి అంటే వీళ్లకి 45-50 మధ్య టపా కట్టేశారు. అంటే ఒక ఇరవయ్యేళ్లు వేసుకో, పదేళ్లలో పోయిన వాళ్లు కూడా ఉన్నారు మరి.

అంటే పిల్లలు అందికి రాకముందే పోతారన్నమాట!

అవును. 

కొందరికి కడుపులో మంట అంటారు?

అవును ఇది కూడా, కడుపులో ఒక సన్నటి పొర ఉంటుంది, దాన్ని మందు డామేజ్ చేస్తుంది. దాంతో ముందు మంట, నొప్పి వస్తాయి, అది మానే లోపే మళ్లీ తాగితే అదిక మానక క్రానిక్ అయ్యి తర్వాత అల్సర్ అవుతుంది. అది కూడా మానకపోతే ఇంక అల్సర్ బాగా లోతుకి వెళ్లి కడుపుకి కన్నం పడి, పొట్టంతా విషం పాకి పెరిటోనైటిస్ వచ్చి పోతారు.

కడుపుతో పాటు క్లోమగ్రంథికి ఏదో అవుద్ది అంటున్నారు?

అవును కడుపు కిందనే ఉంటుంది ఇది, ఇది మనం తినే ఆహారం జీర్ణం అవడానికి రసాలు వదులుతుంది, ఈ మందు ఆ గొట్టాన్ని బ్లాక్ చేస్తుంది, దాంతో ఆ రసాలు ఆ గ్రంథినే తినడం మొదలెడతాయి. దాంతో అక్యూట్ ప్యాంక్రీయాటైటిస్ అని అది నొప్పి కాదు, తాతలు కనిపిస్తారు. విలవిల లాడిపోతారు. 

ఒంట్లో ఇంకేమన్నా మిగిలిపోయాయా?

ఏవీ మిగలవు, అన్నింటి దూల తీర్చేస్తది. 

అంటే?

గుండె వాస్తుంది,
రక్తం తగ్గిపోతుంది,
మగవాళ్లకి ఆడవాళ్ళలా రొమ్ములు వస్తాయి,
లైంగిక పటుత్వం తగ్గిపోతుంది,
ఆందోళన, దిగులు, సైకోసిస్ వంటి మానసిక రోగాలు వస్తాయి,
నరాలు పాడయ్యి విపరీతమైన తిమ్మిర్లు,
కిడ్నీలు పాడవ్వటం,
ఒంట్లో ఆల్బుమిన్ తగ్గి వాపులు రావటం,
కొన్నిసార్లు తిన్న ఆహారం ఊపిరితిత్తుల్లోకి మింగేసి న్యుమోనియా వస్తుంది,
మతిమరుపు,
ఫిట్సు,
పక్షవాతం ఇలా ఇంకెన్నో,

ఇంకెన్నో అంటే?

ఒంట్లో యే అవాయువానికైనా క్యాన్సర్ తెప్పించగలదు. 

ఐదో బంపర్ ఆఫరా మళ్లీ!

అవును, దీంతోపాటు ఇంకోవిషయం, ఎక్కువమంది మగవాళ్లు ఆత్మహత్య చేసుకునేది మందుతాగే, మందువలన వాళ్ళ ఆలోచనా శక్తి సన్నగిల్లుతుంది. 

ఇంకేమన్నా మిగిలిపోయాయా?

అంటే మరి, రోడ్డు ప్రమాదాలు, కింద పడిపోటాలు, పరువు పోవడాలు, కోర్టు కేసులు, అప్పులు, ఉద్యోగం పోవడం, విడాకులు ఇలాంటివన్నీ అదనం. 

మరైతే చివరిగా ఏమంటారు?

మందు ఆనందానికి అక్కర్లేదు,
మందు ఔషధం కాదు,
మందు ఒక విషం,
మందు తాగకపోతే నువ్వు నా స్నేహితుడివి కాదు అనేవాడు నిజంగా నీ స్నేహితుడు కాడు,
మందు తాగాలని అనిపించకపోవటం పిరికితనం కాదు,
మందు ఇప్పటివరకూ ముట్టకపోతే మొదలెట్టవద్దు,
మందు ఇప్పటికే తాగుతుంటే మానెయ్యాలి,
మందు అలవాటుగా తాగితే వైద్యుడి సలహా మేరకు మానెయ్యాలి. 
చివరిగా మీ ఆవిడ మీకు మందుపోస్టే అది అన్యోన్య దాంపత్యమో లేక అతివీర ప్రేమో కాదు,
మీ ఎల్లైసీ పాలసీని ఎన్క్యాష్ చేసుకునే ప్రయత్నం అది.

Link to comment
Share on other sites

On 12/1/2024 at 7:04 AM, nokia123 said:

Nuvvvvvvvvvvvvvvvvvu Chepppppppppiiiiiiiiiiinddddddddddddddiiiiiiiiiiiiiiiiiii corrrrrrrrrrrrrrectttttttttt Annnnnnnnnnnnnaaaaaa....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...