Jump to content

Chandrababu- తడిచిన ధాన్యం కొనుగోలు చేయండి... ఫెయింజల్ తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష


psycopk

Recommended Posts

Chandrababu- తడిచిన ధాన్యం కొనుగోలు చేయండి... ఫెయింజల్ తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష 

02-12-2024 Mon 22:56 | Andhra
 
AP CM Chandrababu reviws on Cyclone Fengal

 

  • బంగాళాఖాతంలో ఫెయింజల్ తుపాను
  • తీరం దాటినప్పటికీ ఏపీలో పలు చోట్ల వర్షాలు
  • మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తీరం దాటినప్పటికీ ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు కూడా పలు చోట్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

తుపాను అనంతరం వాతావరణ పరిస్థితుల కారణంగా, వర్షాల ప్రభావం ఇంకా తొలగిపోలేదని, మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లో  దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన అంచనాల ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

ఏపీలో 53 మండలాలపై తుపాను ప్రభావం పడిందని, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమీక్ష జరిగింది.
Link to comment
Share on other sites

 

As usual sakshitt editor script  copy paste sannasi yedava

YS Jagan: చంద్ర‌బాబు రైతుల‌ను రోడ్డున ప‌డేశారు: వైఎస్ జ‌గ‌న్‌ 

03-12-2024 Tue 06:51 | Andhra
 
YS Jagan Fires on AP Govt

 

  • ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్రభుత్వం మాజీ సీఎం విసుర్లు
  • పంటలకు  మద్దతు ధర  ఏదీ? అంటూ నిల‌దీసిన వైసీపీ అధినేత‌
  • కొనేవారులేక‌ రోడ్ల‌పైనే ధాన్యం ఉండిపోయిందంటూ జ‌గ‌న్ ఆగ్ర‌హం
  • కనీస సాయం అందించిన పాపాన పోలేద‌ని విమ‌ర్శ‌

ధాన్యం కొన‌కుండా రైతుల‌ను సీఎం చంద్ర‌బాబు రోడ్డున ప‌డేశార‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. పంటలకు మద్దతు ధర ఏదీ? అంటూ నిల‌దీశారు. రోడ్ల‌పైనే ధాన్యం ఉండిపోయింద‌ని, కొనేవారేరీ? అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర‌ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

పంటలకు  మద్దతు ధర ఏదీ..?
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమ‌ర్శించారు. వరి  కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. 

మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నార‌ని, బస్తాకు రూ.300 నుంచి రూ.400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింద‌ని మండిప‌డ్డారు. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంద‌న్నారు. 75 కిలోల బస్తాకు రూ.1,725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయింద‌ని తెలిపారు.

రోడ్లపైనే ధాన్యం.. కొనేవారేరీ..? 
ధాన్యం కొనే వారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింద‌ని, ఫెంగల్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కార‌ణంగా రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింద‌న్నారు. తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింద‌ని, అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని విమ‌ర్శించారు. 

యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా కూట‌మి ప్రభుత్వానికి లేకుండా పోయింద‌న్నారు. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవని తెలిపారు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణ‌, గోదావరి, డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్ది ధాన్యం రాసులు రోడ్లపైనే కన్పిస్తున్నాయ‌న్నారు. విజయవాడ-మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవునా ఆరబెట్టిన ధాన్యం కొనేనాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు క‌నిపించ‌డం లేదా? అని జ‌గ‌న్ నిల‌దీశారు. 

కనీస సాయం అందించిన పాపాన పోలేదు
వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేద‌న్నారు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదని విమ‌ర్శించారు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచనకూడా కూట‌మి ప్రభుత్వానికి లేకుండా పోయింద‌న్నారు. ఈ క్రాప్‌ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శ‌కంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన, రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారి పోయింద‌ని తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్‌ పాలిటిక్స్‌తో సీఎం, మంత్రులు కాలం గడుపుతున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 

 

 

Link to comment
Share on other sites

Chandranna rajyam la agri produce konadama ?

Inka nayam…ninda munuginollani adukuntadu maa sendranna ani seppaledu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...