psycopk Posted December 5 Report Share Posted December 5 ap cm chandrababu: నేడు ముంబయికి ఏపీ సీఎం చంద్రబాబు 05-12-2024 Thu 10:43 | Andhra దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం రాత్రికి నేరుగా ముంబయి నుంచి విశాఖకు చంద్రబాబు రాత్రి విశాఖలో చంద్రబాబు బస రేపు డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిధిగా చంద్రబాబు మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు బయలుదేరి వెళుతున్నారు. ముంబయిలోని అజాద్ గ్రౌండ్‌లో మహా ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ నేతలు హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబయి చేరుకోనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు ముంబయి నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేయనున్నారు. విశాఖలో రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ఆయన హజరుకానున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 5 Author Report Share Posted December 5 Amit Shah: ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం కోసం ముంబై చేరుకున్న అమిత్ షా, చంద్రబాబు 05-12-2024 Thu 17:08 | National ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న జేపీ నడ్డా, గడ్కరీ ముంబైకి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్, మోహన్ యాదవ్, భజన్ లాల్ శర్మ ఫడ్నవీస్‌పై పెద్ద బాధ్యత ఉందన్న భార్య అమృత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముంబై చేరుకున్నారు. అలాగే, బీజేపీ, ఎన్డీయే కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ముంబై చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ కూడా హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఫడ్నవీస్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫడ్నవీస్‌పై పెద్ద బాధ్యత: అమృత ఫడ్నవీస్ ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన భార్య అమృత ఫడ్నవీస్‌ను మీడియా పలకరించింది. ఫడ్నవీస్ ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారని, మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఆనందంతో పాటు ఆయనపై అతిపెద్ద బాధ్యత ఉందనే విషయం అర్థమవుతోందన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.