Jump to content

Google-AP Govt: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం


psycopk

Recommended Posts

Google-AP Govt: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం 

05-12-2024 Thu 15:22 | Andhra
 
MoU between Google and AP Govt finalised in Nara Lokesh presence

 

  • టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ కీలక ముందుడుగు
  • నారా లోకేశ్ చొరవతో రాష్ట్రానికి మరింత మెరుగైన ఏఐ సాంకేతికత
  • ముందుకొచ్చిన గూగుల్
  • కుదిరిన ఎంవోయూ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సచివాలయంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ద్వారా ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 

యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని తెలిపారు. 

గూగుల్ తో తాము చేసుకున్న ఒప్పందం ద్వారా ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవడంతోపాటు యువతకు అంతర్జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ లభిస్తుందని, తద్వారా అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 

చంద్రబాబు ఆలోచనల అమలుకు దోహదం: గూగుల్ మ్యాప్స్ జీఎం రమణి

పరిపాలన వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనా విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజర్ లలితా రమణి తెలిపారు. 

తాము ఏపీ ప్రభుత్వంతో కలిసి చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తు ఏఐ ఆధారిత సేవల్లో సాధికారిత సాధించడానికి ఆలంబనగా నిలుస్తాయని అన్నారు. ఏఐ ద్వారా సమాజానికి సానుకూల ప్రయోజనాలను పెంచడానికి Google కట్టుబడి ఉంది. 

గూగుల్ ఒప్పందంలోని కీలకాంశాలు

● విద్య, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేల మందికి గూగుల్ ఎసెన్షియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుంది. రోజువారీ జీవితంలో AIని ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ జనరేటివ్ AI వంటి రంగాల్లో Google క్లౌడ్ సర్టిఫికేషన్‌లు, స్కిల్ బ్యాడ్జ్‌లను గూగుల్ అందజేస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ప్రభుత్వంతో Google Cloud  సహకరిస్తుంది. కంప్యూటర్ సైన్స్ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అధ్యాపకులకు గూగుల్ సాంకేతిక మద్దతును అందిస్తుంది. స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లలో Google డెవలపర్ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లు, ఆండ్రాయిడ్, యాప్ స్కిల్లింగ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లకు గూగుల్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది.
● స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబుల్ మెంట్: ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం, మెంటర్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందించడం, స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ల కోసం Googleకి యాక్సెస్‌ని అందిస్తుంది. ఇందుకోసం Google సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది. దీంతోపాటు అర్హత కలిగిన AI స్టార్టప్‌లు క్లౌడ్ క్రెడిట్‌లు, సాంకేతిక శిక్షణ వ్యాపార మద్దతును పొందుతాయి.
● సుస్థిరత: గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్ ఏఐ ఆధారిత సహకారం, సేవలను అందిస్తుంది.
● హెల్త్‌కేర్: నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపర్చడం, రోగి ఆరోగ్య ఫలితాలను వేగవంతం చేయడంలో ఏఐ సేవల వినియోగానికి సహకారం అందించడం, హెల్త్ AI ఇమేజింగ్ మోడల్‌లకు యాక్సెస్ అందించడం, LLMలు ద్వారా హెల్త్‌కేర్‌ ఉత్పాదకరంలో AI అప్లికేషన్‌లను అన్వేషించడం, హెల్త్ AI డెవలపర్ ఫౌండేషన్స్ (HAI-DEF) ద్వారా పరిశోధన కార్యక్రమాలకు గూగుల్ మద్దతు ఇస్తుంది.
● AI పైలట్‌లు: వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్‌సైట్ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో క్లౌడ్ టెక్నాలజీ, AI ప్రయోజనాలపై కీలక రంగాలలో పైలట్ ప్రాజెక్ట్‌లకు Google సహకరిస్తుంది.
20241205fr67517784c57a4.jpg20241205fr6751778ee04b9.jpg20241205fr6751779a627e3.jpg
  • Haha 1
Link to comment
Share on other sites

On 12/5/2024 at 7:15 AM, Raisins_72 said:

Google City ga Amaravathi ani paper lo padaledha inka 😂😂

it has to start somewhere.. tadepalli lo tini tongune kante idi better ee kada... tg vadivi kada.. koncham kadupu manta gane untadi.. tatuko.... inka 6months ee aaindi....

halwa close to paralysis...

Link to comment
Share on other sites

55 minutes ago, psycopk said:

it has to start somewhere.. tadepalli lo tini tongune kante idi better ee kada... tg vadivi kada.. koncham kadupu manta gane untadi.. tatuko.... inka 6months ee aaindi....

halwa close to paralysis...

Oh my Balio, Nannu TG vaadini chesesaava 😂😂

Link to comment
Share on other sites

12 minutes ago, Raisins_72 said:

Oh my Balio, Nannu TG vaadini chesesaava 😂😂

BJP pai comment chesthe anti indian, TDP pai comment chesthe nv TG vadivi by default

Link to comment
Share on other sites

12 minutes ago, psycontr said:

Adhi google gemini, google coures ke subscription MoU vayya

Like udemy subscriptions aa 😂😂

Link to comment
Share on other sites

27 minutes ago, Raisins_72 said:

Oh my Balio, Nannu TG vaadini chesesaava 😂😂

mari kasta padutuna vallani chusi halwa madiri edustunte doubt vachindi

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

 

Vishakha ki vachina 25,000 tonnes drugs kadu anta kada…yeast imported from malaysia anta…

Adhikaram kosam abadhaku cheppetolku, ipudu google 4 lakh crore ani inkoka abadham…

Emi vayya…inthe na ? Anni abadhalu ae na ? 

Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

Vishakha ki vachina 25,000 tonnes drugs kadu anta kada…yeast imported from malaysia anta…

Adhikaram kosam abadhaku cheppetolku, ipudu google 4 lakh crore ani inkoka abadham…

Emi vayya…inthe na ? Anni abadhalu ae na ? 

Jagan chepada… nee style lo email vachinda port authorities nundi?? Why dont u share it\

or jagan with his pet dogs saruku marchesada??

Link to comment
Share on other sites

26 minutes ago, psycopk said:

Jagan chepada… nee style lo email vachinda port authorities nundi?? Why dont u share it\

or jagan with his pet dogs saruku marchesada??

CBI cheppi case close chesindi…

Ie style etlundi ? Aina ilantivi evi mee media chepadu kada, meeku telise chance ae ledu…

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...