Jump to content

Kodukutho adukuntu shanti pondaka… endi eedi gola? DNA reddy?


psycopk

Recommended Posts

 

Vijayasai Reddy: ఏపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హించాలి... విజ‌యసాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌! 

06-12-2024 Fri 13:36 | Andhra
 
Vijayasai Reddy Interesting Tweet on Pawan Kalyan

 

  • యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌న్న వైసీపీ నేత‌
  • రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు ఉంద‌ని వ్యాఖ్య‌
  • అత్యంత ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి జ‌న‌సేనాని అన్న విజ‌యసాయిరెడ్డి
వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడ్ని ఉద్దేశిస్తూ... యువ రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్రదేశ్‌కు 75 ఏళ్ల వృద్ధుడు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌న్నారు. నేష‌న‌ల్ పాప్యులారిటీ, వ‌య‌స్సు రీత్యా  రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఏపీలోని ఎన్‌డీఏ పార్టీల నాయ‌కుల్లో అత్యంత ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అని ఆయ‌న కొనియాడారు. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాతో వైర‌ల్ అవుతోంది. దీనిపై జ‌న‌సేన శ్రేణులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. 

 

 

Link to comment
Share on other sites

Vijayasai Reddy: విక్రాంత్ రెడ్డి చిన్నవాడు... కేవీ రావు లాంటి బ్రోకర్ ను బెదిరించాడంటే నమ్ముతారా?: విజయసాయిరెడ్డి 

05-12-2024 Thu 19:12 | Andhra
 
Vijayasai Reddy press meet over Kakinada Port issue and allegations

 

  • కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలు
  • లుకౌట్ నోటీసులు జారీ 
  • కేవీ రావు ఓ బ్రోకర్... చంద్రబాబుకు చెంచా అంటూ విజయసాయి ఫైర్
కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడుతున్నారు. ఈ సాయంత్రం ఆయన మీడియా ముందుకువచ్చారు. 

వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ స్కాంలో జైల్లో ఉండి వచ్చిన శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి కేవీ రావుపై బెదిరింపులకు దిగారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించడం తెలిసిందే. కేవీరావు గొంతుమీద కత్తిపెట్టి రూ. 2వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను రూ.12 కోట్లకు, కాకినాడ సీ పోర్టులో రూ. 2,689 కోట్ల విలువైన షేర్లను రూ. 494 కోట్లకే కొట్టేశారని వివరించారు. దీనిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"కేవీ రావును విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డిది చిన్న వయసు... కేవీ రావు భారీ మనిషి! విక్రాంత్ రెడ్డి లాంటి వాడు కేవీ రావును బెదిరించడమేంటి... నాకర్థం కావడంలేదు. మరి విక్రాంత్ రెడ్డి భయపెడితే కేవీ రావు భయపడ్డాడా? 

ఆ కేవీ రావు సంవత్సరంలో ఆరేడు నెలలు అమెరికాలోనే ఉంటాడు. సింగపూర్ లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఇలాంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడంటే నమ్మొచ్చా? 

పైగా, రెండు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు నాకు నామినీలు అని ఆరోపిస్తున్నారు. నేను 2020 మేలో ఈ బ్రోకర్ కేవీ రావుకు ఫోన్ చేసి... విక్రాంత్ రెడ్డి వస్తాడు... కాకినాడ సీ పోర్ట్ గురించి మాట్లాడతాడు అని చెప్పానంట. చంద్రబాబుకు బుద్ధి మందగించిందా? అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు నామినీలు ఉండరు. నామినీలు ఉండేది బ్యాంకు అకౌంట్లకేనన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోతే ఇంకెలా అర్థం చేసుకోవాలి? 

వాస్తవాలు ఏంటంటే... కాకినాడ పోర్టును నాడు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పోర్టును చంద్రబాబు ప్రైవేటు రంగానికి అప్పగించేశారు. అప్పటి మలేసియా ప్రధాని కుమారుడు ఈ పోర్టును కొంటున్నారని ప్రచారం చేశారు. కానీ ఆ ముసుగులో కాకినాడ సీ పోర్టును కేవీ రావుకు అప్పగించారు. కేవీ రావును సీఎండీగా చేశారు. 

కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో తెలియాలంటే 1997 నుంచి జరిగిన పరిణామాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. చంద్రబాబు అందరినీ క్రిమినల్స్ అంటుంటాడు... చంద్రబాబే ఒక క్రిమినల్. అలాంటి చంద్రబాబుకు ఈ బ్రోకర్ కేవీ రావు ఒక చెంచా. కేవీ రావుకు నిజంగానే అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? 

ఇప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు... నా మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నందున చంద్రబాబు, కేవీ రావుపై పరువునష్టం దావా వేయాలనుకుంటున్నాను" అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Budda Venkanna: విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు వేస్తా: బుద్దా వెంకన్న 

06-12-2024 Fri 15:18 | Andhra
 
I will file a criminal case on Vijayasai Reddy says Budda Venkanna

 

  • చంద్రబాబుకు కుల పిచ్చి ఉందన్న విజయసాయిరెడ్డి
  • నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బుద్దా వెంకన్న హెచ్చరిక
  • విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులపిచ్చి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మానవ విలువలు లేని వ్యక్తి విజయసాయి అని అన్నారు. జగన్ కు, విజయసాయిరెడ్డికి కుల పిచ్చి ఉందేమో కానీ, చంద్రబాబుకు లేదని చెప్పారు. 

విజయసాయిపై క్రిమినల్  కేసు వేస్తానని... ఆయనను జైలుకు పంపేంత వరకు వదలనని బుద్దా వెంకన్న అన్నారు. వ్యాపారవేత్తలను భయపెట్టి, బెదిరించి ఆస్తులు రాయించుకుంటారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Link to comment
Share on other sites

Vijayasai Reddy: మీకు ఇంకా బుద్ధి రాలేదు.. సీఎంతో పెట్టుకునేంత స్థాయి మీకు లేదు: విజయసాయిరెడ్డిపై ఎంపీ నాగరాజు ఫైర్ 

06-12-2024 Fri 09:45 | Andhra
 
Vijayasai Reddy dont have that status to comment Chandrababu says MP Nagaraju

 

  • కాకినాడ పోర్టులో అనేక అక్రమాలు చేశారన్న నాగరాజు
  • రాష్ట్రంపై విజయసాయి విషం కక్కుతున్నారని మండిపాటు
  • అరాచకాలన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్య
కాకినాడ పోర్టు సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా బెదిరించారని కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. దీనికి సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై పెట్టిన కేసును ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంతో పెట్టుకునేంత స్థాయి విజయసాయికి లేదని... తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. 

రాష్ట్రంపై విజయసాయి విషం కక్కుతున్నారని నాగరాజు మండిపడ్డారు. ఏపీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా సరికాదని నాగరాజు అన్నారు. వైసీపీ హయాంలో భారీగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల భూమి కాజేయాలని చూశారని నాగరాజు ఆరోపించారు. మీరు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయని... అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా... మీకు ఇంకా బుద్ధి రాలేదని చెప్పారు. మరో రెండు సీట్లు తగ్గి ఉంటే మీకు 'నవరత్నాలు' మాత్రమే మిగిలేవని ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్టులో ఎన్నో అక్రమాలు జరిగాయని... నిదానంగా అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...