Jump to content

Mohan babu attacked manoj.. property dispute


psycopk

Recommended Posts

2 minutes ago, psycopk said:

At least the fight is not with ur sibling …. Unlike nista daridrudu jagan

I don’t rule out in the future…Had YSR was alive, he would have taken care if splits. 

Conflicts arise in wealth distribution…

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

I don’t rule out in the future…Had YSR was alive, he would have taken care if splits. 

Conflicts arise in wealth distribution…

mou chesi danini kuda honor cheyanu anatam ante.. vadu chachinate naa drusti lo...

ysr mata iste nilabadatadu... eedu mou meda sign chesina nilabadadu... talli meda court lo case veyatam endi sami chendalam.... 

Link to comment
Share on other sites

Just now, psycopk said:

mou chesi danini kuda honor cheyanu anatam ante.. vadu chachinate naa drusti lo...

ysr mata iste nilabadatadu... eedu mou meda sign chesina nilabadadu... talli meda court lo case veyatam endi sami chendalam.... 

Mou anedhi legally binding kaadhu .

Mana politicians enni saarlu mous sign chestaaro nuvve news lo choostav kadha.

Link to comment
Share on other sites

Just now, Teluguredu said:

Mou anedhi legally binding kaadhu .

Mana politicians enni saarlu mous sign chestaaro nuvve news lo choostav kadha.

nuvvu pakkaki velli adukoma... enduku madhyalo nenu unna anukunta vastav

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

nuvvu pakkaki velli adukoma... enduku madhyalo nenu unna anukunta vastav

Asalu sambhandham Leni matter lo jagan enduku ochaadu 

Link to comment
Share on other sites

1 minute ago, Teluguredu said:

Asalu sambhandham Leni matter lo jagan enduku ochaadu 

koncham paytm brain tho kakunda normal ga think cheyi... answer vastadi... u dont need script for this..

Link to comment
Share on other sites

19 minutes ago, psycopk said:

mou chesi danini kuda honor cheyanu anatam ante.. vadu chachinate naa drusti lo...

ysr mata iste nilabadatadu... eedu mou meda sign chesina nilabadadu... talli meda court lo case veyatam endi sami chendalam.... 

MOU is silly….it holds no value in successions. Thalli mida case ante mari is she is the party, then everyone will be included in the lawsuit…

Asthi pampakalu, aasthibtagadalu pedda mga susinatu lev samara….anduke vintha ga kanipistunayi…

Link to comment
Share on other sites

16 minutes ago, Teluguredu said:

Asalu sambhandham Leni matter lo jagan enduku ochaadu 

Raledu…

Teesukuvachadu…

  • Haha 1
Link to comment
Share on other sites

On 12/8/2024 at 4:05 AM, BattalaSathi said:

1) baane unnadu gaa..edho pranam pothunna cutting icharu?

2) fellam endhi antha indifferent gaa undhi..raa antunna dooram dooram gaa untondhi?  bhuma varasatvam..aaa pogaru edaki pothadhi?

3) mallee veedu veedi ayya/anna/akka lokaaniki neethulu cheppandi raa ante first untaaru

Snow Small Anna.. Tight Slap on all those people's faces who questioned his acting skills. 

  • Haha 1
Link to comment
Share on other sites

Manchu Manoj: దాని కోసమే నా పోరాటం: మంచు మ‌నోజ్ 

10-12-2024 Tue 12:42 | Entertainment
 
Manchu Manoj Latest Comments on His

 

  • తాను ఆస్తులు, డ‌బ్బు కోసం పోరాటం చేయ‌డం లేద‌న్న మంచు మ‌నోజ్‌
  • కేవ‌లం ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడుతున్నాన‌ని వ్యాఖ్య‌
  • త‌న భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న‌
త‌న‌ ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మ‌రోసారి స్పందించారు. తాను ఆస్తులు, డ‌బ్బు కోసం పోరాటం చేయ‌డం లేద‌ని అన్నారు. తాను కేవ‌లం ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడుతున్నాన‌ని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. "నాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసులను ర‌క్ష‌ణ‌ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. 

నాకు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ అంద‌రినీ క‌లుస్తా. నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయడం సరికాదు. నా భార్యాపిల్లలకు రక్షణ క‌ర‌వైంది. నా భార్యాపిల్లల రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నేను డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను" అని మంచు మ‌నోజ్ చెప్పుకొచ్చారు.
Link to comment
Share on other sites

Manchu Vishnu: మా కుటుంబ స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం.. ఫ్యామిలీ గొడ‌వ‌ను పెద్ద‌గా చిత్రీక‌రించ‌డం త‌గ‌దు: మంచు విష్ణు 

10-12-2024 Tue 11:33 | Entertainment
 
Manchu Vishnu Reacted to Family Dispute after Coming from Dubai

 

  • తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మంచు ఫ్యామిలీ వివాదం
  • తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్‌పై కేసులు న‌మోదు
  • దుబాయి నుంచి రాగానే ఫ్యామిలీ గొడ‌వ‌పై స్పందించిన మంచు విష్ణు 
  • అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌న్న‌ మోహ‌న్‌బాబు
మంచు ఫ్యామిలీ వివాదం ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో మంచు మ‌నోజ్‌, మంచు మోహ‌న్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేశారు.   

మోహ‌న్‌బాబు ఫిర్యాదుతో మంచు మ‌నోజ్‌, అత‌ని భార్య భూమా మౌనికపై  329, 351(బీ.ఎన్.ఎస్ ) సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మ‌నోజ్ ఫిర్యాదు మేర‌కు మోహ‌న్‌బాబు అనుచ‌రుల‌పై 329, 351, 115(బీ.ఎన్.ఎస్) సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలాఉంటే.. ఈరోజు ఉద‌యం మంచు విష్ణు  దుబాయి నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. జ‌ల్‌ప‌ల్లిలోని ఇంటికి వెళ్లే మార్గ‌మ‌ధ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని, త్వ‌ర‌లోనే అన్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్ద‌గా చిత్రీక‌రించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న తెలిపారు.  

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జం: మోహ‌న్‌బాబు
అంత‌కుముందు త‌మ కుటుంబంలో చెల‌రేగిన వివాదంపై మోహ‌న్‌బాబు మాట్లాడుతూ.. ఏ ఇంట్లోనైనా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జమ‌ని అన్నారు. ఇది త‌మ ఇంట్లో జ‌రుగుతున్న చిన్న త‌గాదా అని పేర్కొన్నారు. ఇళ్ల‌ల్లో గొడ‌వ‌లు జ‌రిగితే అంత‌ర్గ‌తంగా ప‌రిష్క‌రించుకుంటార‌ని, గ‌తంలో తాను ఎన్నో కుటుంబాల గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  
Link to comment
Share on other sites

Police Case: మంచు ఫ్యామిలీ వివాదంలో కీల‌క ప‌రిణామం.. కేసులు నమోదు చేసిన పోలీసులు! 

10-12-2024 Tue 09:39 | Entertainment
 
Police Cases Registered against Manchu Manoj and Mohan Babu

 

  • నెట్టింట చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం
  • ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న మోహ‌న్‌బాబు , మ‌నోజ్ 
  • వారి ఫిర్యాదుల‌పై మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు
మంచు ఫ్యామిలీ వివాదం ప్ర‌స్తుతం నెట్టింట‌ తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఈ విదాదంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. 

మంచు మ‌నోజ్‌, మంచు మోహ‌న్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో మ‌నోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మోహ‌న్‌బాబుకు చెందిన 10 మంది అనుచ‌రుల‌పై కేసు నమోదు చేశారు. 

అలాగే మోహ‌న్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మ‌నోజ్‌తో పాటు అత‌ని భార్య భూమా మౌనిక‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ వివాదంపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. 
Link to comment
Share on other sites

Manchu Manoj: నాపై, నా భార్య‌పై ఆరోప‌ణ‌లు పూర్తిగా క‌ల్పితం.. ఆ విష‌యంలో నా తండ్రిని వేడుకున్నాను: మంచు మ‌నోజ్‌ 

10-12-2024 Tue 07:04 | Entertainment
 
Manchu Manoj Press Statement about His Father Mohan Babu

 

  • మంచు ఫ్యామిలీలో తార‌స్థాయికి చేరుతున్న గొడ‌వ 
  • త‌న‌పై దాడి చేశారంటూ ప‌హాడీ ష‌రీఫ్ పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు
  • కాసేప‌టికే త‌న కొడుకుపై మోహ‌న్‌బాబు పోలీసుల‌కు ఫిర్యాదు
  • రాచ‌కొండ సీపీకి లేఖ.. మ‌నోజ్‌తో పాటు కోడ‌లి నుంచి ముప్పు పొంచి ఉంద‌న్న మోహ‌న్‌బాబు
  • తండ్రి లేవ‌నెత్తిన అంశాలు పూర్తిగా త‌ప్పు అన్న మ‌నోజ్‌
  • ఈ వివాదంలోకి త‌న ఏడు నెల‌ల కూతుర్ని కూడా లాగ‌డం బాధాక‌ర‌మ‌ని వ్యాఖ్య‌
  • త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ ఆధారంగా త‌న జీవితాన్ని నిర్మించుకుంటున్నానని వెల్ల‌డి
మంచు ఫ్యామిలీలో గొడ‌వ తార‌స్థాయికి చేరుతోంది. త‌న‌పై దాడి చేశారంటూ మనోజ్ ప‌హాడీ ష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, మ‌నోజ్ ఫిర్యాదు చేసిన కాసేప‌టికే త‌న కొడుకుపై మోహ‌న్ బాబు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న రాచ‌కొండ సీపీకి లేఖ రాశారు. మ‌నోజ్‌తో పాటు కోడ‌లు మౌనిక నుంచి త‌న‌కు ముప్పు పొంచి ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 

ఇక త‌న తండ్రి మోహ‌న్‌బాబు ఫిర్యాదుపై మ‌నోజ్ స్పందించారు. త‌న‌తో పాటు త‌న భార్య మౌనికపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. త‌న తండ్రి లేవ‌నెత్తిన అంశాలు పూర్తిగా త‌ప్పే కాకుండా, త‌న ప‌రువు మ‌ర్యాద‌ల‌ను కావాల‌ని తీసే ప్ర‌య‌త్నంలో భాగమిద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న‌పై, త‌న భార్య‌పై ఆరోప‌ణ‌లు పూర్తిగా క‌ల్పితం అన్నారు. 

తాను, త‌న భార్య మౌనిక సొంత కాళ్ల‌పై నిల‌బ‌డి సంపాదించుకుంటున్నామ‌ని మ‌నోజ్ తెలిపారు. త‌న సోద‌రుడు కొన్ని కార‌ణాల రీత్యా దుబాయికి వెళ్ల‌డంతో ఇంట్లో అమ్మ ఒంట‌రిగా ఉంటోంద‌ని.. నాన్న‌, ఆయ‌న స్నేహితుల కోరిక మేర‌కు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గ‌త ఏడాది కాలంగా ఉంటున్నాన‌ని మ‌నోజ్ చెప్పారు. అయితే, త‌ప్పుడు ఉద్దేశంతో తాను నాలుగు నెల‌ల క్రితం ఆ ఇంట్లోకి వ‌చ్చాన‌ని త‌న తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేద‌న్నారు. 

ఈ వివాదంలోకి త‌న ఏడు నెల‌ల కూతుర్ని కూడా లాగ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇది ఎంతో అమాన‌వీయం, ఇలాంటి విష‌యాల్లోకి త‌న పిల్ల‌ల‌ను లాగొద్ద‌ని మ‌నోజ్ అన్నారు. ఇలా వారిని గొడ‌వ‌లోకి లాగ‌డంతోనే ఈ ఆరోప‌ణ‌ల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. కుటుంబ గౌర‌వాన్ని కాపాడేందుకు ప్ర‌తిసారి ప్ర‌య‌త్నం చేశాన‌ని పేర్కొన్నారు. 

ఇక త‌న తండ్రి ఇలా ఫిర్యాదు చేయ‌డం యాదృచ్ఛికం కాద‌న్నారు. త‌న సోద‌రుడు విష్ణు, ఆయ‌న అసోసియేట్ విన‌య్ మ‌హేశ్వ‌రి.. మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ (ఎంబీయూ) విద్యార్థుల‌ను, స్థానిక వ్యాపారుల‌ను దోపిడీ చేస్తున్నారు. వారికి మ‌ద్ద‌తుగా బ‌హిరంగంగా మాట్లాడినందుకే ఈ ఫిర్యాదు చేశార‌ని మ‌నోజ్ తెలిపారు. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, కావాలంటే వాటిని అధికారుల‌కు స‌మ‌ర్పిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

విష్ణు స్వ‌లాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడ‌ని, తానెప్పుడూ స్వ‌తంత్రంగానే ఉన్నాన‌న్నారు. విష్ణు కుటుంబ వ‌న‌రుల‌ను దుర్వినియోగం చేశాడ‌ని, అయినా త‌న తండ్రి ఎప్పుడూ అత‌నికే మ‌ద్ద‌తుగా ఉన్నాడ‌ని మ‌నోజ్ తెలిపారు. తాను మాత్రం ప‌రువు న‌ష్టం, వేధింపుల‌కు గుర‌య్యాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 

కుటుంబ వివాదాల ప‌రిష్కారం కోసం నిజాయ‌తీగా, అంద‌రిముందు చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని గ‌త సెప్టెంబ‌ర్‌లో హృద‌య‌పూర్వకంగా త‌న తండ్రిని వేడుకున్నాన‌ని మ‌నోజ్ అన్నారు. అయితే, తండ్రి మోహ‌న్‌బాబు త‌నను ప‌ట్టించుకోలేద‌ని, ఇప్పుడు ఇలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాన‌ని వాపోయారు.

ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావ‌డంపై కూడా మ‌నోజ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విష్ణు అనుచ‌రులైన విజయ్ రెడ్డి, కిర‌ణ్ వాటిని ఎందుకు తొల‌గించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న తీవ్ర‌మైన ఆందోళ‌న‌ను, ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తోంద‌ని పేర్కొన్నారు. వారు ఎందుకు ఆ ఫుటేజీల‌ను దాచిపెడుతున్నార‌ని మ‌నోజ్ నిల‌దీశారు. విచార‌ణ జ‌రిపి దాని వెనకున్న నిజాన్ని క‌నుగొనాల‌ని కోరారు.   

కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశ ప‌డ‌లేద‌న్నారు. కుటుంబ ఆస్తిపాస్తుల‌పై ఆధార‌ప‌డ‌కుండా త‌న పిల్ల‌ల‌ను పెంచుతున్నందుకు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని మ‌నోజ్ అన్నారు. కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ ఆధారంగా త‌న జీవితాన్ని నిర్మించుకుంటున్నానని చెప్పారు. ఎనిమిదేళ్లుగా తండ్రి, సోద‌రుడి సినిమాల‌కు విశ్రాంతి లేకుండా ప‌ని చేశాన‌ని పేర్కొన్నారు. ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక్క రూపాయి తీసుకోకుండా ప‌ని చేశాన‌న్నారు. సోద‌రుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మ‌ద్ద‌తు పొందుతూనే ఉన్నాడ‌ని మ‌నోజ్ తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...