Jump to content

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెనుక చంద్రబాబు కృషి ఉంది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు


psycopk

Recommended Posts

Kinjarapu Ram Mohan Naidu: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెనుక చంద్రబాబు కృషి ఉంది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

11-12-2024 Wed 15:12 | Both States
 
Rammohan Naidu praises AP CM Chandrababu

 

  • గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని వెల్లడి
  • చంద్రబాబు దార్శనికత వల్లే శంషాబాద్ విమానాశ్రయం సాధ్యమైందని వ్యాఖ్య
  • విమానాశ్రయం అంటే రవాణా సౌకర్యమే కాదు... ఉపాధి మార్గం కూడా అన్న కేంద్రమంత్రి
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు. ఆయన దార్శనికత వల్లే శంషాబాద్ విమానాశ్రయం సాధ్యమైందన్నారు. దేశాభివృద్ధిని నడిపించేది ఐటీ రంగమే అని చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతారన్నారు.

శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విమానాశ్రయాల నిర్వహణలో సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీని వాడుతున్నామన్నారు. డేటా ఎనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత మెరుగైన సేవలను అందిస్తామన్నారు. విమానాశ్రయం అంటే కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదన్నారు. విమానాశ్రయం ఉపాధి మార్గం... సాంస్కృతిక కేంద్రం కూడా అన్నారు.

ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. వరంగల్, భోగాపురం ఎయిర్ పోర్టులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా పూర్తవుతుందన్నారు. మరో ఐదేళ్లలో 50 విమానాశ్రయాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

ఆ విజన్ చంద్రబాబుదే ఖచ్చితంగా..

1999 లో Tenderలు వేస్తే GMR ని ఎంచుకుంది కూడా చంద్రబాబు గారే.

కాని ఆయన 2004 లో దిగిపోయే సమయానికి స్థలాల సేకరణ stay ల్లో ఉంది.

2004 లో వచ్చిన YSR ఆ పీటముడి  విప్పి, 2004 నుంచి 2005 దాకా కృషి చేసి 2005 లో నిర్మాణం మొదలు పెట్టాడు.

2008 లో ప్రారంభం కూడా ఆయనే చేసాడు.

 

Dont Forget Your Heroes..be it CBN or YSR.

  • Upvote 1
Link to comment
Share on other sites

Tulaks ni baaguparchatam thappa national security vishayam lo zero interest, idea maa Babu gaariki. Chuttupakkala lands konnama Real estate chesama anedi tappa repu religious riots ayithe easy access undalsina airport ni correct gaa teesukelli sensitive area lo pettadu chudu! Daaniki central govt kuda tappu undi @Android_Halwa

Link to comment
Share on other sites

58 minutes ago, CaptainMaverick said:

Tulaks ni baaguparchatam thappa national security vishayam lo zero interest, idea maa Babu gaariki. Chuttupakkala lands konnama Real estate chesama anedi tappa repu religious riots ayithe easy access undalsina airport ni correct gaa teesukelli sensitive area lo pettadu chudu! Daaniki central govt kuda tappu undi @Android_Halwa

anduke maa YSR outerring road vesindu gaa. 

anna aina atu side development aithe ne kada tulaks ki annitiki access vundi, education toh valla brain ki logics ardam ayyi bagupaditeh better kada. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...