Jump to content

అదే మనకు శ్రీరామ రక్ష: సీఎం చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu: అదే మనకు శ్రీరామ రక్ష: సీఎం చంద్రబాబు 

11-12-2024 Wed 17:07 | Andhra
 
Chandrababu speech in District Collectors meeting

 

  • జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వ సమావేశం
  • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • కలెక్టర్లకు దిశానిర్దేశం
  • హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు  జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, మీడియా ప్రతినిధులకు నమస్కారాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.

ప్రభుత్వ విజన్ ను ఎప్పటికప్పుడు తెలియజేయడం, ఇప్పటివరకు చేసిన పనులను సమీక్షించుకోవడానికి ఈ కలెక్టర్ల సమావేశాలు ఉపయోగపడుతుంటాయని వెల్లడించారు. 

"పెద్దగా సమస్యలు లేని రాష్ట్రంలో పాలన ఏమంత కష్టంగా ఉండదు. కానీ, రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగిన తర్వాత, దాన్ని పునర్ నిర్మాణం చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ దిశగా రెండోసారి కలెక్టర్లతో సమావేశమై సమీక్షించుకుంటున్నాం. 

పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు... ఇటీవల ఎన్నికలకు ముందు మేం అందరం ఒక్కొక్కరం ఒక్కో అనుభవాన్ని ఎదుర్కొన్నాం. దేశంలో ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే వారిని ప్రజాస్వామ్యమే సరిదిద్దుతుంది. అది భారత రాజ్యాంగం గొప్పదనం. భారత రాజ్యాంగం అందరికీ సమానమే. కోటీశ్వరులకు ఎక్కువ ఓట్లు, సామాన్యులకు ఒక ఓటు... ఉండదు. దేశంలో అందరికీ ఒకటే ఓటు ఉంటుంది. ఆ ఓటే ఈ రోజు దేశాన్ని కాపాడుతోంది. 

కొన్ని దేశాల్లో పరిస్థితులు చూశాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో దిద్దుబాట్లు జరగవో, నియంతలు పుట్టుకొస్తారు. ఆ నియంతలను సాగనంపడానికి విప్లవాలు కూడా వస్తుంటాయి. ఇటీవలే సిరియాలో చూశాం... అంతకుముందు బంగ్లాదేశ్ లో చూశాం. ప్రజల్లో ఆగ్రహావేశాలు  కట్టలు తెంచుకున్నప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం తరచుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి... ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్షగా నిలుస్తోంది. 

మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి ఎలా సమస్యలను పరిష్కరించేందుకు శ్రమిస్తున్నామో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఇటీవలే ఐటీ మినిస్టర్ (లోకేశ్) అమెరికా వెళ్లారు. గూగుల్ కంపెనీ విశాఖ రావడానికి కృషి చేశారు. అలుపెరగకుండా శ్రమిస్తే ఫలితం వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. పాజిటివ్ గా పాటుపడితే ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి. 

నేను ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. గూగుల్ తో ఒప్పందం చేసుకున్నది దాని గురించే. విశాఖలో భారీ టెక్ సెంటర్ ఏర్పాటు కానుంది. గూగుల్ వంటి దిగ్గజం విశాఖకు వస్తే వ్యూహాత్మకంగా అదొక గేమ్ చేంజర్ అవుతుంది. ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేసి, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్ టెక్ సేవలను అందించగలిగితే.. దాన్ని సీ కేబుల్ తో మిగతా ప్రపంచానికి అనుసంధానం చేయగలిగితే... ఇది గ్లోబల్ సర్వీస్ హబ్ గా తయారవుతుంది. 

కష్టపడి పనిచేసినప్పుడు ఫలితాలు రాకపోతే ఉపయోగం ఉండదు. అందుకే హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలి. అందుకోసం రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా మార్చాల్సిన అవసరం ఉంది. అయితే నాలెడ్జ్ ఎకానమీకి, నాలెడ్జ్ సొసైటీకి తేడా ఉంది. మున్ముందు ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం" అని సీఎం చంద్రబాబు అభిలషించారు.
Link to comment
Share on other sites

 

Payyavula Keshav: చంద్రబాబు కాబట్టి సరిపోయింది!: పయ్యావుల 

11-12-2024 Wed 16:37 | Andhra
 
Payyavula speech in Collectors conference

 

  • జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
  • హాజరైన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
  • చంద్రబాబుకు అప్పులు వారసత్వంగా వచ్చాయని వెల్లడి
  • గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపణ
ఏపీ ప్రభుత్వం ఇవాళ జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగిస్తూ... ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా  పనిచేయడానికి, ప్రభుత్వ పాలనను సమీక్ష చేసుకుని, సరిదిద్దుకుంటూ ముందుకు పోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను, ఆదేశాలను అమలు చేయడం కోసం మనమందరం ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యామని పేర్కొన్నారు. 

"సీఎం చంద్రబాబుతో నా ప్రస్థానం 30 ఏళ్ల కిందట ప్రారంభమైంది. 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత ఆరాటం, తపనతో పనిచేశారో... 30 ఏళ్ల తర్వాత కూడా అంతకుమించిన ఉత్సాహంతో ఆయన పనిచేస్తుండడం ఇవాళ చూస్తున్నాం. ఆయన వెంట సుదీర్ఘకాలం నడిచిన వ్యక్తిగా... ఆయనలో నాకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మిగిలిన జీవితం ఇక ప్రజల కోసమే అనే ఒక ప్రధాన లక్ష్యంతో, ప్రతి విషయంలోనూ ఒక మానవతా కోణం ఉండాలని ఆయన పడుతున్న తపన మనందరికీ స్ఫూర్తిదాయకం. 

అయితే, ఇది సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చేందుకు సమయం కాదు... క్లుప్తంగా విషయం వివరిస్తాను. నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయనకు వారసత్వంగా వచ్చింది... రూ.10 లక్షల కోట్ల అప్పు! అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి! అప్పులపై వడ్డీ చెల్లించడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి! 

గత ఏడాది రాష్ట్ర ఆదాయంలో 99 శాతం జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంతకుముందు సంవత్సరం చూస్తే.. జీతాలు చెల్లించడానికి కూడా అప్పులు చేశారు. చెల్లించాల్సిన బకాయిలే రూ.1.30 లక్షల కోట్లు ఉన్నాయి. అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే... ప్రతి వ్యవస్థను నాశనం చేశారు. 

ఒకవైపు అప్పులు, మరోవైపు రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులు... ఇవీ చంద్రబాబుకు వారసత్వంగా వచ్చిన అంశాలు. మామూలు వ్యక్తి అయితే ఇలాంటి సమస్యలతో నిద్ర కూడా పోలేరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. చంద్రబాబు ఎంతో సమర్థతతో ఒక్కో అంశాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నారు" అని పయ్యావుల వివరించారు. 

 

 

Link to comment
Share on other sites

Andhra Pradesh: మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

11-12-2024 Wed 13:16 | Andhra
 
Andhra pradesh CM Chandrababu Praises Minister Nara Lokesh In Collectors Meeting

 

  • లోకేశ్ కృషి వల్లే గూగుల్ తో ఒప్పందం కుదిరిందని వెల్లడి
  • సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగం
  • సంక్షోభంలోనూ అవకాశాలు వెతికి పట్టుకోవాలని కలెక్టర్లకు సూచన
ప్రయత్నాలు మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు రావని, నిరంతర ప్రయత్నాలతోనే ఫలితాలను రాబట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ నిరంతర ప్రయత్నం, కృషి వల్లే గూగుల్ కంపెనీతో ఎంవోయూ కుదిరిందని వివరించారు. ఈమేరకు ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేశ్ ను చంద్రబాబు మెచ్చుకున్నారు. 

గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కుదిరిన ఎంవోయూతో విశాఖలో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణం అని అన్నారు. హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదు... స్మార్ట్‌ వర్క్‌ కావాలని చెప్పారు. ప్రజాచైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోందని తెలిపారు. గూగుల్ కంపెనీతో ఎంవోయూ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్ లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...