Jump to content

పట్టు బిగించిన పవన్.. పట్టు కోల్పోతున్న  చంద్రన్న...


psycontr

Recommended Posts

రాజీకీయాలలో ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. అర్ధం, పరమార్ధం ఏమిటంటే సొంత కులం లో పట్టు సాధించాలి.. పట్టు బిగించి, ఇతర కులం లను అనుకూలం గా మలుచుకున్నప్పుడే, అధికారం దక్కుతుందని, ఉత్తరప్రదేశ్ లో చౌదరి చరణ్ సింగ్.. మూలయాంసింగ్ యాదవ్.. బీహార్ లో లల్లూ ప్రసాద్ యాదవ్.. నితీష్ కుమార్.. హర్యానలో చౌదరి దేవిలాల్ లే అందుకు నిదర్శనం.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేబాటలో దూసుకుపోతుంటే.. సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, రివర్స్ దూసుకుపోతున్నారు.. అంటే సొంత కులం లో తీవ్ర వ్యతిరేకతను, కొని తెచ్చుకుంటున్నారు.. మొన్న జరిగిన ఎన్నికలలో, పవన్ కళ్యాణ్ గారు, తన కాపు కులం ఓటర్లను ఏకత్రాటి పై నిలిపారు.. చంద్రబాబు గారి అరెస్ట్ నేపథ్యంలో కమ్మ కులం ఓటర్లందరూ ఏకత్రాటి పై, ఆయన కు అండగా నిలిచారు.. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ గారు, కాపు కులం పై పట్టుబిగించారు.. ఈ రోజు కాపు కులం ఓటర్లలో, పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అధినేత.. ఆయన దెబ్బకు కాపు కులం సంఘ నాయుకులు కొట్టుకుపోయారు.. 20% శాతం ఓటర్లలో 90% పైగా కాపు, బలిజ ఓటర్లు, జై జనసేన.. జై జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.. జై జై పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.. కాపు కులం ను ఏకత్రాటి పై నిలిపింది పవన్ కళ్యాణ్ గారే అని రాజికీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు, సీనియర్ మీడియా ప్రతినిధులు అంటున్నారు.. చంద్రబాబు గారు సీఎం అయ్యాక, లోకేష్ గారు మంత్రి అయ్యాక కమ్మ కులం వారిని ఎక్కివుగా రానివ్వటం లేదని ప్రచారం జరిగింది.. తండ్రి సీఎం చంద్రబాబు గారు , కొడుకు మంత్రి లోకేష్ గారు, కమ్మ కులం అధికారులును, టీడీపి నాయుకులును, దగ్గరకు రానివ్వటం లేదని, బయటకు పొక్కటం తో, కమ్మ కులం ప్రముఖులు, మెజారిటీ కమ్మ కులం ఓటర్లు, వారిద్దరిపై మండిపడుతున్నారు.. మమ్ములను జగన్ రెడ్డి గారు అంటరానివారిగా చూచారు... చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా అంటరానివారిగా చూడటం ఏమిటి.. ఈ విషయం లో, ఓడ మల్లయ్య... బోడి మల్లయ్య సామెతను, వారు గుర్తు చేస్తున్నారు.. లక్షలు,కోట్ల నోట్లు ఇవ్వాలి.. ఓట్లు వెయ్యాలి.. ఇందుకే మేము పనికొస్తాం.. మేము కలిసేందుకు వెళితే, మొక్కుబడిగా పలకరిస్తారే తప్పా, ఆప్యాయం గా మాట్లాడటం లేదు.. ఈ సంఘటనలు పై పలు టీవీ చానళ్ళు లలో జరిగిన చర్చలలో, సోషల్ మీడియా లో అనేకమంది, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గారుల వ్యవహార శైలిని తప్పు పట్టారు.. వారిద్దరు పద్ధతి మార్చుకోకుంటే, సరైన సమయంలో తిరిగి తిరిగి కోలుకోలేనంతగా రాజకీయంగా దెబ్బతినటం ఖాయం అని హెచ్చరిస్తున్నారు..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...