psycopk Posted 17 hours ago Report Share Posted 17 hours ago ఎన్డీయే, ఇండియా కూటమికి సమ దూరంలో ఉంటామన్న విజయసాయి రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వ్యాఖ్య చంద్రబాబు చేతిలో ప్రజలు నాలుగోసారి మోసపోయారన్న గుడివాడ వైసీపీ ఏ కూటమిలో చేరదని... తమది తటస్థ వైఖరి అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్డీయే, ఇండియా కూటమికి సమ దూరంలో ఉంటామని చెప్పారు. ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. జమిలి ఎన్నికలపై తమ పార్టీ అధినేత జగన్ ఆలోచనకు అనుగుణంగా జేపీసీ ఎదుట తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ... 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పిన పని చేయలేదని అన్నారు. చంద్రబాబు చేతిలో ప్రజలు నాలుగోసారి మోసపోయారని చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 17 hours ago Author Report Share Posted 17 hours ago AP Fibre Net: గడువులోగా డబ్బు చెల్లించకపోతే రామ్ గోపాల్ వర్మపై కేసు పెడతాం: జీవీ రెడ్డి 24-12-2024 Tue 16:48 | Andhra ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం గత ప్రభుత్వ హయాంలో ఫెబర్ నెట్ లో అక్రమాలు జరిగాయన్న జీవీ రెడ్డి వర్మకు అక్రమంగా రూ.1.15 కోట్లు చెల్లించారని ఆరోపణ ఆ డబ్బు తిరిగివ్వాలని వర్మకు నోటీసులు ఇచ్చామని వెల్లడి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని అన్నారు. ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా రూ.1.15 కోట్లు చెల్లించారని తెలిపారు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు 15 రోజుల గడువుతో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా ఇచ్చామని వెల్లడించారు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు పెడతామని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ లో కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం చేశారని జీవీ రెడ్డి తెలిపారు. గత సర్కారు ఏపీఎస్ఎఫ్ఎల్ కు రూ.12 కోట్ల అప్పుతో పాటు, రూ.900 కోట్ల బకాయి పెట్టిందని వెల్లడించారు. ఇక, గత ప్రభుత్వ హయాంలో అర్హత లేని ఫైబర్ నెట్ లో అక్రమంగా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు. కొందరు ఫైబర్ నెట్ లో అక్రమంగా నియమితులయ్యారని, వారు వైసీపీ నేతల ఇళ్లలో పనులు చేశారని వివరించారు. అక్రమంగా నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించారు. అక్రమంగా ఉద్యోగులను నియమించిన వారికి లీగల్ నోటీసులు పంపుతామని, ఎక్కువగా మాట్లాడితే వేతనాల రికవరీ సహా కేసులు కూడా పెడతామని జీవీ రెడ్డి హెచ్చరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.