Jump to content

KTR-కేటీఆర్ అరెస్ట్ పై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. దూకుడు పెంచనున్న ఏసీబీ, ఈడీ


psycopk

Recommended Posts

KTR: ED, bodi, Modi నన్ను ఏమీ పీకలేరు.

Meanwhile రేవంత్ & హరీష్ : We can you know. 😂

Link to comment
Share on other sites

KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు... సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ 

07-01-2025 Tue 22:26 | Telangana
KTR files petition in SC
 

 

  • కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
  • సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేసిన న్యాయవాది మోహిత్ రావు
  • ముందే కేవియట్ దాఖలు తెలంగాణ ప్రభుత్వం
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ముందే కేవియట్ దాఖలు చేసింది. కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని ఈ పిటిషన్ లో కోరింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ లీగల్ టీంతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఏం చేయాలనే అంశంపై చర్చించారు. అనంతరం సాయంత్రం గం.4.40కి సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రేపు (జనవరి 😎 విచారణకు వచ్చే అవకాశముంది.
Link to comment
Share on other sites

Nammesam

KTR: నేనే తప్పు చేయలేదు... ఎలాంటి విచారణకైనా సిద్ధమే: కేటీఆర్ 

07-01-2025 Tue 21:04 | Telangana
KTR says he is ready to face any enquiry
 

 

  • భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న కేటీఆర్
  • కక్ష సాధింపు చర్య అని తెలిసినా ఏసీబీ ఎదుట హాజరయ్యానన్న కేటీఆర్
  • హైకోర్టు అనుమతిస్తే న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవుతానన్న కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసులో తాను తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని... భారత న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో ఆయన మాట్లాడుతూ... తనపై పెట్టిన కేసు కక్ష సాధింపు చర్య అని తెలిసినా ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యానన్నారు.

తనపై పెట్టింది అక్రమ కేసు అని, రాజకీయ ప్రేరేపితమైనదన్నారు. అవినీతిపరులకు ఇతరులు ఏం చేసినా అవినీతిగానే కనిపిస్తుందన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో పైసా అవినీతి జరగలేదన్నారు. తెలంగాణ ఇమేజ్‌ను పెంచేందుకే పార్ములా ఈ-రేస్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై కేసు పెట్టారని ఆరోపించారు.

తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరవుతానంటే వద్దని చెబుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు అనుమతిస్తే తమ న్యాయవాదులతో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతానన్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. దుర్మార్గుల నుంచి చట్టపరంగా రక్షణ కోరుతున్నానన్నారు. ఏసీబీ అధికారులు తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పార్టీకి చెందిన పట్నం నరేందర్ రెడ్డి విచారణలో ఇవ్వని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు చెప్పారని, తన న్యాయవాది రాకుంటే తన విషయంలోనూ అలాగే చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే న్యాయవాదుల సమక్షంలో విచారణ కోరామన్నారు. చివరకు న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

మంత్రి పొంగులేటి తనపై విమర్శలు చేయడాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... కేటీఆర్ స్పందించారు. పాపం ఆయనకు కొత్తగా మంత్రి పదవి రావడంతో ఆ ఉత్సాహంతో ఆగడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరి వద్ద రియల్ ఎస్టేట్ భూములు లాక్కున్నారు, ఏయే భూములు 30 శాతం నుంచి 40 శాతం రాయించుకున్నారో అన్నీ బయటకు వస్తాయన్నారు.
Link to comment
Share on other sites

KTR: కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశముంది!: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు 

07-01-2025 Tue 22:12 | Telangana
Congress MLC hot comments on KTR
 

 

  • కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని డిమాండ్
  • కేటీఆర్ నిజంగానే తప్పు చేయకుంటే లీగల్ టీమ్ ఎందుకని ప్రశ్న
  • కేటీఆర్ ప్రజల సొమ్మును కాజేసిన దొంగ అని ఆగ్రహం
కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశముందని, కాబట్టి ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారని, ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలన్నారు.

కేటీఆర్ నిజంగానే ఎలాంటి తప్పు చేయకపోతే న్యాయ నిపుణులు, లీగల్ టీమ్ ఎందుకని ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ చెబుతున్నారని, మరి విచారణకు ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలన్నారు. వారు దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచి పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

దొంగలకు అండగా ఉంటారా? లేక ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటారా? అనేదానిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించాలన్నారు. కేటీఆర్ ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ప్రజల సొమ్ము కాజేసిన దొంగ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.
Link to comment
Share on other sites

KTR: కేటీఆర్ ఏసీబీ విచారణ... వీడియో, ఆడియో రికార్డింగ్ కు అనుమతించని హైకోర్టు 

08-01-2025 Wed 17:29 | Telangana
TG High Court denied permission for audio and video recordings of KTR enquiry
 

 

  • ఏసీబీ విచారణకు లాయర్ ను తీసుకెళ్లేందుకు కేటీఆర్ కు హైకోర్టు అనుమతి
  • ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీలో లాయర్ కూర్చోవాలని సూచన
  • ఏమైనా అనుమానాలుంటే మళ్లీ పిటిషన్ వేయాలన్న హైకోర్టు
ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. అయితే, కేటీఆర్ విచారణను వీడియో, ఆడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా... దీనికి హైకోర్టు నిరాకరించింది. లాయర్ తో కలిసి రేపు ఏపీబీ విచారణకు వెళ్లాలని కేటీఆర్ కు సూచించింది. ఆ తర్వాత ఏమైనా అనుమానాలు ఉంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, హైకోర్టు కొన్ని షరతులు విధించింది.

విచారణ గదిలో కేటీఆర్, విచారణ అధికారులు మాత్రమే ఉంటారని... వారితో పాటు లాయర్ కూర్చోవడానికి కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో లాయర్ కూర్చోవచ్చని తెలిపింది. లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని హైకోర్టుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీంతో, లైబ్రరీలో లాయర్ కూర్చోవాలని హైకోర్టు సూచించింది. 
Link to comment
Share on other sites

KTR: నాపై ఉన్న కేసు గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు: కేటీఆర్ 

08-01-2025 Wed 15:46 | Telangana
KTR responds on case against him
 

 

  • కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇవి లెక్క కాదన్న కేటీఆర్
  • తనపై నమోదైనది ఓ లొట్ట పీసు కేసు అని వ్యాఖ్య
  • రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పాలని పిలుపు
తనపై నమోదైన ఫార్ములా ఈ-రేస్ కేసు గురించి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు.

మనకు ఏదో ఇబ్బంది ఉన్నది అన్నట్లుగా కొంతమంది మాట్లాడారని, కానీ నిజంగా మనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తనపై నమోదైనది ఓ లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో వారు చేసేదేమీ లేదన్నారు. కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు. కేసులు అసలు సమస్యే కాదన్నారు.

ఈ కేసుపై తాను పోరాడతానన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డగా, ఆయన తయారు చేసిన సైనికుడిగా ఎంతో ధైర్యంగా ఉంటానన్నారు. 

తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు.
Link to comment
Share on other sites

KTR: విచారణ గదిలో కేటీఆర్ తో పాటు లాయర్ కూర్చోవడానికి వీల్లేదు: తెలంగాణ హైకోర్ట్ 

08-01-2025 Wed 15:19 | Telangana
Lawyer will not be allowed to sit with KTR during case inquiry says TG High Court
 

 

  • విచారణకు లాయర్ ను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్
  • విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమన్న హైకోర్టు
  • కేటీఆర్ కు దూరంగా లాయర్ ఉండేందుకు అనుమతిస్తామని వెల్లడి
ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరాశ తప్పలేదు. కేసు విచారణకు తనతో పాటు తన లాయర్ ను కూడా అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేటీఆర్ విన్నపాన్ని తిరస్కరించింది. 

విచారణ గదిలో కేటీఆర్ తో కలిసి ఆయన లాయర్ కూర్చోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమని తెలిపింది. కేటీఆర్ కనిపించే విధంగా కాస్త దూరంలో లాయర్ ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. ముగ్గురు లాయర్ల  పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని అడిగింది. 

విచారణను లాయర్ చూసే నిబంధన ఏసీబీలో ఉందా? అని ప్రశ్నించింది. సాయంత్రం 4 గంటల్లోగా దీనికి సమాధానం చెపుతామని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.
Link to comment
Share on other sites

Harish Rao: అక్రమ కేసులు పెట్టి కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: హరీశ్ రావు 

08-01-2025 Wed 16:17 | Telangana
Harish Rao blames Revanth Reddy for not fullfilling promises
 

 

  • రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో కోతలు, ఎగవేతలు... కాదంటే కేసులు అని విమర్శ
  • సమస్యలపై దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు పెట్టారని మండిపాటు
  • ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్న హరీశ్ రావు
కేటీఆర్ మీద అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో కోతలు, ఎగవేతలు... కాదంటే కేసులు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

దృష్టి మళ్లింపు తప్ప ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చి మళ్లీ ఎగ్గొడతారని విమర్శించారు. ఢిల్లీకి కమీషన్లు పంపించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ ప్రజల పథకాల కోసం లేవా? అని నిలదీశారు. అవినీతి పాలనను ప్రశ్నించినందుకే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తే... వాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోతలు పెట్టిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా ఎగవేస్తున్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి మించి రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదన్నారు. పథకాలు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు... ఎగవేతల రేవంత్ రెడ్డి అని తాను అన్నందుకు తనపై మానకొండూరులో కేసు పెట్టారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్‌కు రమ్మని తనకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...