Jump to content

adho lottapeesu case u… vaado lottapeesu mukyamanthri…


Anna_nuv_thopu

Recommended Posts

34 minutes ago, Android_Halwa said:

Maa ramudu solid dorkindu…

Beginners mistakes….

Political witch hunt case anukunna kani ie case la manchi matter vundi, convuction kastamemo kani KTR ki lifelong vuntadi ie case..

Bratukantha bail ae…oka baboru, oka jagan, oka ktr…

what about Gumpu Mestri gadu? Vadu bags tho dorikadu bail leda?

  • Haha 2
Link to comment
Share on other sites

17 minutes ago, JonSnowUSA said:

CBN ni thanthe Amaravati lo paddadu.. Pikadam gurinchi enduku ley thatha.

Nuvvu forum ki kotanemo.. i liked that move… i wanted it to happen even sooner…

thousands of gov employees drawing in lakhs… enta big economic activity… it helped vijayawada to flourish

  • Haha 1
Link to comment
Share on other sites

KTR: హై టెన్షన్.. న్యాయవాదితో కలిసి విచారణకు వెళుతున్న కేటీఆర్

09-01-2025 Thu 09:44 | Telangana
KTR going to ACB office with lawyer

 

  • ఫార్ములా ఈ-కార్ కేసులో ఏసీబీ విచారణకు వెళుతున్న కేటీఆర్
  • లాయర్ ను తీసుకెళ్లేందుకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు
  • ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకాబోతున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్... నేడు ఏసీబీ విచారణను ఎదుర్కోబోతున్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, సదరు లాయర్ ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో కూర్చుంటారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్లడానికి హైకోర్టు అనుమతించలేదు. 

ప్రస్తుతం నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద సందడి నెలకొంది. కేటీఆర్ నివాసానికి ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు చేరుకున్నారు. న్యాయవాది రామచంద్రరావుతో పాటు లీగల్ టీమ్ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు.

న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లనున్నారు. కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో... ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసినట్టు సమాచారం. ఒకవేళ కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. 
Link to comment
Share on other sites

KTR: విచారణ తర్వాత కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా? లేక అరెస్ట్ చేస్తారా?

09-01-2025 Thu 10:00 | Telangana
Do ACB arrest KTR

 

  • లాయర్ తో కలిసి ఏసీబీ విచారణకు వెళుతున్న కేటీఆర్
  • ఏసీబీ అధికారులు 30 ప్రశ్నలు రెడీ చేసినట్టు సమాచారం
  • కేటీఆర్ నివాసానికి చేరుకున్న కవిత, పలువురు నేతలు
  • ఇప్పటికే హరీశ్ రావు గృహ నిర్బంధం 

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఆయన విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు మొత్తం 30 ప్రశ్నలను రెడీ చేసినట్టు సమాచారం. కొన్ని గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగనుంది. 

మరోవైపు, ఈనాటి విచారణ అనంతరం కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా? లేక ఆయనను అరెస్ట్ చేస్తారా? అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. 

ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు కీలక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ నివాసం వద్ద ఉన్నారు. కేసు విచారణను ఎలా ఎదుర్కోవాలి? ఏయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనే విషయాలను లాయర్ రామచంద్రరావుతో వీరు చర్చిస్తున్నారు. 

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
Link to comment
Share on other sites

KTR: లుచ్చాగాళ్ల ముందు తల వంచను.. కేసీఆర్ కొడుకుగా చెపుతున్నా: విచారణకు వెళ్లే ముందు మీడియాతో కేటీఆర్

09-01-2025 Thu 10:14 | Telangana
KTR fires on Revanth Reddy before leaving to ACB office

 

  • తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికే ఫార్ములా ఈ-కార్ రేసు అన్న కేటీఆర్
  • అర పైసా అవినీతి కూడా చేయలేదని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి మాదిరి లుచ్చా పనులు చేయలేదన్న కేటీఆర్
  • రాష్ట్రం కోసం అవసరమైతే చచ్చిపోతానని వ్యాఖ్య

ఏసీబీ విచారణకు కోసం తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇంటి నుంచి వెలుపలకు వచ్చారు. అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడి... ఏసీబీ కార్యాలయానికి బయల్దేరారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి వెళ్లారు.

"తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచడానికి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలపడానికి మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశా. తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికే ఫార్ములా ఈ-కార్ రేసు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మా బావమర్దులకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. కాంట్రాక్టులు ఇచ్చి ల్యాంక్ క్రూజర్లు తీసుకోలేదు. నేను అర పైసా అవినీతి కూడా చేయలేదు. 

బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది. నా మీద కేసు పెట్టి, నన్నేదో చేయాలనుకుంటున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మేము భయపడే ప్రసక్తే లేదు. లుచ్చాగాళ్ల ముందు తల వంచను. ఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. న్యాయపరంగా అన్నింటిని ఎదుర్కొంటాం. 

క్విడ్ ప్రోకో చేయలేదు. ఏ తప్పు చేయలేదు. నీలాగా లుచ్చా పనులు, తుచ్చ పనులు చేయలేదు రేవంత్ రెడ్డీ. నీలాగా అడ్డంగా దొరికిపోయిన దొంగను కాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ కొడుకుగా చెపుతున్నా. తెలంగాణ కోసం అవసరమైనతే చచ్చిపోతా" అని కేటీఆర్ అన్నారు. 
Link to comment
Share on other sites

KTR: కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రారంభం.. దర్యాప్తు అధికారులు వీరే! 

09-01-2025 Thu 10:47 | Telangana
ACB questioning of KTR started
 

 

  • లాయర్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్
  • కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారులు
  • ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ తో పాటు ఆయన లాయర్ ను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించారు. కాసేపటి క్రితం ఏసీబీ విచారణ ప్రారంభమయింది. 

విచారణ గదిలో కేటీఆర్ ఉండగా... కార్యాలయంలోని లైబ్రరీ గదిలో ఆయన లాయర్ ఉన్నారు. విచారణ గదిలో ఉన్న కేటీఆర్ కనిపించేంత దూరంలో ఆయన లాయర్ ఉన్నారు. విచారణ గదిలో ఏం మాట్లాడుతున్నారనేది మాత్రం లాయర్ కు వినిపించదు. వీడియో, ఆడియో రికార్డింగ్ కు కూడా తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఎస్పీ నరేందర్, డీఎస్పీ విచారిస్తున్నారు. విచారణ ప్రక్రియలను ఏసీబీ డైరెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. 
Link to comment
Share on other sites

KTR: ముగిసిన ఏసీబీ విచారణ... ఇది ఒక చెత్త కేసు అని చెప్పానన్న కేటీఆర్ 

09-01-2025 Thu 17:40 | Telangana
ACB today enquiry on KTR concluded
 

 

  • ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై ఆరోపణలు
  • నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరైన కేటీఆర్
  • దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ
  • అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్
  • కొత్త ప్రశ్నలేమీ అడగలేదని వెల్లడి
  • ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని స్పష్టీకరణ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ పై విచారణను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. విచారణ సందర్భంగా, కేటీఆర్ ను ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ ప్రశ్నించారు. 

విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వెల్లడించారు. ఏసీబీ అధికారులకు విచారణలో సహకరించానని తెలిపారు. 

ఇది ఒక చెత్త కేసు అని, రాజకీయ కక్షపూరిత కేసు అని విచారణ అధికారులకు చెప్పానని వెల్లడించారు. ఇటువంటి అసంబద్ధమైన కేసులో ఎందుకు విచారణ జరుపుతున్నారని అడిగానని కేటీఆర్ వివరించారు. 

ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలేమీ అడగలేదని, వారడిగిన ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు జవాబులు ఇచ్చాను అని తెలిపారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని చెప్పానని కేటీఆర్ స్పష్టం చేశారు. 

ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కేటీఆర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...