Jump to content
People were interested in these podcasts

WhatsAppGovernance in Andhra Pradesh


ntr2ntr

Recommended Posts

అమరావతి: దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ (WhatsApp Governance)కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంది. పౌరసేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులుస్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. 

తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. వాట్సప్‌ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు.

ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు. 

ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే.. ఈ వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే వెంటనే ఒక లింక్‌ వస్తుంది. అందులో పేరు, ఫోన్‌ నంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి, తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. టికెట్లు, వసతి సహా అన్నీ బుక్‌ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్‌ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చు. 

ఈ ధ్రువపత్రాలూ పొందవచ్చు..

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్‌.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్‌ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి చేసిన దరఖాస్తుల స్టేటస్‌ తెలుసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్‌ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్‌ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్‌బ్యాక్‌ తదితర సేవలు దీని ద్వారా పొందవచ్చు.

@Android_Halwa Bro, Last time adigaav ga. FYI,

Comment chese mundu pai post lo vunna video oka sari choodu. 

Link to comment
Share on other sites

As per Lokesh, some of the features in this.

1. There is no personal contact with user number

2. This number can't accept to receive calls.

3. Users Data can't saved from Government side.

4. QR Code linked to the number after the issue getting resolved.

5. Corruption will reduced.

6. If Name changes required in the certificates, Whatsapp send message of next course of action that user will do. 

Link to comment
Share on other sites

Minister Nara Lokesh: మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:36 PM

యువ‌గ‌ళం పాద‌యాత్రలో స‌ర్టిఫికెట్ల సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెటాతో ఎంవోయూ చేసుకున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ స‌ర్టిఫికెట్ల కోసం ప‌డుతున్న క‌ష్టాలు ప్రత్యక్షంగా చూసి..

 
 

ఢిల్లీ: క్యాస్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే మూడు గ‌వ‌ర్నమెంట్ ఆఫీసులు, న‌లుగురు వ‌ర‌కూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చుట్టూ ఓ వారం రోజులు తిర‌గాల్సిందే. క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాల‌యాల్లో ఇప్పటికీ ఎడ‌తెగ‌ని క్యూల్లో నిరీక్షణ త‌ప్పదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఈ స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌ను యువ‌త ఏక‌రువు పెట్టారు. వాట్సాప్‌లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్నప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన ప‌రిస్థితికి చెక్ పెడ‌తామ‌ని, ప్రభుత్వంలోకి రాగానే..వాట్సాప్ ద్వారా ప‌ర్మినెంట్ స‌ర్టిఫికెట్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని లోకేష్ హామీ ఇచ్చారు.

 

అధికారంలోకి రాగానే కూట‌మి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెర‌వేరుస్తోంది. విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రిగా బాధ్యత‌లు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఇచ్చిన హామీల‌న్నీ ప్రాధాన్యతాక్రమంలో అమ‌లు చేస్తున్నారు. ప్రతి ఏడాది క్యాస్ట్ స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే ప‌ద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ ర‌కాల బిల్లులు వాట్సాప్ ద్వారా చెల్లించవ‌చ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్ స్టా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచ‌మంతా విస్తరించిన మెటాతో కీల‌క ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేష్ చొర‌వ‌తో మెటా ప్రజల‌కు ప్రభుత్వం నుంచి పౌర‌సేవ‌లు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీక‌రించింది.

 
 

మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇక‌పై క్యాస్ట్, ఇత‌ర‌త్రా స‌ర్టిఫికెట్లు వేగంగా, సుల‌భంగా పొందేందుకు వీలవుతుంది. అలాగే న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి క‌న్సల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నరెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని 1 జన్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ చేసుకున్నారు.

 

మెటాతో ఎంవోయూ

మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మక‌మైన మైలురాయి అని మంత్రి లోకేష్ అభివ‌ర్ణించారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ స‌ర్టిఫికెట్ల కోసం ప‌డుతున్న క‌ష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా స‌ర్టిఫికెట్లు అందిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. తాను మాట ఇచ్చిన‌ట్టే ఈరోజు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సాప్‌లోనే స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నామని... రానున్న రోజుల్లో మ‌రిన్ని సేవ‌లు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పార‌ద‌ర్శకంగా, త్వరగా పొందేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ మంత్రి లోకేష్ భ‌రోసా ఇచ్చారు.

 
 

ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చాలా సంతోషం- మెటా ఇండియా

మెటాలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సేవ‌లను వాడుకుని వాట్సాప్ ద్వారా ఏపీ ప్రజ‌ల‌కు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని సంధ్యా దేవనాథన్, వైస్ ప్రెసిడెంట్, మెటా ఇండియా ప్రక‌టించారు. అంద‌రూ త‌మ‌కు కావాల్సిన సేవ‌లు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, వాట్సాప్ అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్ ఫేస్ ఉంటుంద‌ని, తమ డిజిట‌ల్ టెక్నాల‌జీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజ‌ల‌కు మ‌రిన్ని ఉత్తమసేవ‌లు అందించ‌గ‌ల‌మ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

హెచ్‌పీఎల్ విస్తర‌ణ‌, ఫాక్స్ కాన్, టీసీఎల్ వంటి గేమ్ ఛేంజ‌ర్ కంపెనీల‌ను ఏపీకి ర‌ప్పించిన లోకేష్‌, మెటాతో ఒప్పందంతో తానేంటో, త‌న ప‌నితీరు ఏ రేంజులో ఉంటుందో చెప్పక‌నే చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ గ‌వ‌ర్నెన్స్ ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డంలో లోకేష్ జెట్ స్పీడుతో ప‌నిచేస్తున్నారు. ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, డైరెక్టర్ పబ్లిక్ పాలసీ నటాషా, ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారులు యువరాజ్, ఆర్టీజిఎస్ సీఈఓ దినేష్ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  On 1/30/2025 at 12:18 PM, psycopk said:

Great initiative…great step to eradicate corruption 

Expand  

How will it work? they should have shown a demo.

 

This will work for people whose data is in that Lake. Lake lo leni vallu malli lancham ivvali ga 

  • Upvote 1
Link to comment
Share on other sites

  On 1/30/2025 at 12:18 PM, psycopk said:

Great initiative…great step to eradicate corruption 

Expand  

Thappuga anukoku kaka... Mana valla corruption kakurthi aapalente devudi valla kuda kadu... anyway lets see how the implementation will go... 

Link to comment
Share on other sites

నాడు ఈ గవర్నెన్స్… నేడు వాట్సాప్ గవర్నెన్స్

 
IMG-7786.webp

 
1995…ఉమ్మడి ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో నాడు యువ నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన వారంతా ఫక్తు రాజకీయ నాయకులే. 
 

పెద్దగా టెక్నాలజీపై అవగాహన లేని వారే. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలకు సరికొత్త పాలనను అందించారు. అప్పటిదాకా కరెంటు బిల్లు కట్టేందుకు వచ్చిన వారితో విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు భారీ క్యూలు కనిపించగా… చంద్రబాబు వాటిని మాయం చేశారు.

 

అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని అందిపుచ్చుకున్న చంద్రబాబు… మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ పాలనను సమూలంగా ప్రక్షాళన చేసింది. అందుబాటులోకి వచ్చిన ఐటీని సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు ఈ సేవా సెంటర్ల పేరిట వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

కరెంటు బిల్లులతో పాటు ఇతరత్రా శాఖల సేవలు కూడా ఈ కేంద్రాల ద్వారా జనానికి ఈజీగా అందేలా చర్యలు చేపట్టారు. చంద్రబాబు దూరదృష్టితో ప్రారంభించిన ఈ సేవా సెంటర్లు సక్సెస్ కావడంతో… అదే తరహా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి.

తాజాగా ఇప్పుడు ఐటీని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డామినేట్ చేస్తోంది. 1995లో ఐటీ విజృంభిస్తున్న వేళ చంద్రబాబు ఎలా అయితే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో… అలాగే ఇప్పుడు ఏఐ తన ప్రభావం చూపడం మొదలుపెట్టిన 2025లోనూ చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

ఇంకేముంది నాడు ఐటీని వాడుకున్నట్లుగానే… ఇప్పుడు ఏఐని వాడుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. అది కూడా అందరి కంటే ముందుగా ఏఐపై చంద్రబాబు దృష్టి సారించారు. పలితంగా ఏపీలో గురువారం వాట్సాప్ గవర్నెన్స్ లాంఛనంగా ప్రారంభమైంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నూతన తరమా పాలనా విధానాన్ని ప్రారంభించారు.

నాడు ఈ సేవా కేంద్రాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో… నేడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా డబుల్ సక్సెస్ కావడం ఖాయమేనని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు ఇంటిలో కూర్చునే… దాదాపుగా అన్ని రకాల పౌర సేవలను తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా అందుకోనున్నారు. ఏ ఒక్క సేవ కోసం కూడా జనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. 

అంతేకాకుండా జవాబుదారీ తనం కూడా పెరుగుతుంది. నకిలీల బెడద తగ్గుతుంది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు మాత్రమే అందనున్నా… భవిష్యత్తులో అన్ని రకాల పౌర సేవలు దీని ద్వారానే అందనున్నాయి. అంటే… నాడు ఐటీతో పాలనను సమూలంగా మార్చేసిన చంద్రబాబు… ఇప్పుడు ఏఐతో ప్రభుత్వ పాలనను మరింతగా సులభతరం చేయనున్నారన్న మాట.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...