psycopk Posted April 9 Author Report Posted April 9 Jagan Mohan Reddy: ఇలా కూడా ఆలోచిస్తారా?: జగన్ పై అనిత ఫైర్ 09-04-2025 Wed 14:08 | Andhra నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందన్న అనిత జగన్ పర్యటనకు 11 వందల మంది పోలీసులతో భద్రత కల్పించామని వెల్లడి జగన్ మారకపోతే 11 సీట్లు కూడా రావని జోస్యం వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీడీపీపై, పోలీసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత స్పందిస్తూ... నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1,100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా ఇంతటి భద్రతను కల్పించలేదని చెప్పారు. జగన్ వెళుతున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని... అందుకే భారీ భద్రతను కల్పించామని అన్నారు. కానీ, కావాలనే సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. హెలిపాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారని... ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని అనిత చెప్పారు. హెలికాప్టర్ దెబ్బతిన్నదని చెబుతూ జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిపోయారని... కాసేపటికే హెలికాప్టర్ వెళ్లిపోయిందని తెలిపారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేశారని విమర్శించారు. ఇలా కూడా ఆలోచిస్తారా? అని అనిపించిందని చెప్పారు. వైసీపీ హయాంలో 2,800కి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తల హత్యలు జరిగాయని అనిత తెలిపారు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా నాపైనా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఇలాంటి సంస్కృతి కాదని చెప్పారు. పోలీసు అధికారుల బట్టలు ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా? అని అనిత ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన వల్లే 151 నుంచి 11కి దిగిపోయావని ఎద్దేవా చేశారు. నువ్వు మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావని అన్నారు. జగన్ వెళ్లిన వెంటనే హెలికాప్టర్ వెళ్లిపోవడంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. వైసీపీ వాళ్లు పద్ధతి మార్చుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఎస్సై సుధాకర్ కు నిజంగా దమ్ముందని అన్నారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు జగన్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. Quote
psycopk Posted April 9 Author Report Posted April 9 Jagan Mohan Reddy: గుడ్డలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా?: జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు విమర్శలు 09-04-2025 Wed 13:55 | Andhra పోలీసుల యూనిఫాం విప్పించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న జగన్ జగన్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న శ్రీనివాసరావు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ పోలీసు అధికారుల గుడ్డలు ఊడదీస్తామని, యూనిఫాం విప్పించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఖండించారు. ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ... పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని చెప్పడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గుడ్డలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎంతో ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని... క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. Quote
psycopk Posted April 9 Author Report Posted April 9 Jagan Mohan Reddy: మహిళల బట్టలు కూడా ఊడదీస్తామనే విధంగా జగన్ మాటలు ఉన్నాయి: మహిళా పోలీసు అధికారి ఫైర్ 09-04-2025 Wed 15:36 | Andhra పోలీసుల బట్టలు ఊడదీస్తామన్న జగన్ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ మాటలు ఉన్నాయన్న భవాని ఈ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పోలీసుల బట్టలు ఊడదీస్తామన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీసు అధికారుల సంఘం జగన్ వ్యాఖ్యలను ఖండించింది. ఈ సందర్భంగా మహిళా పోలీసు అధికారిణి భవాని జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "పోలీసులందరి బట్టలు ఊడదిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు... మహిళా పోలీసుల బట్టలు కూడా ఊడదీస్తామనే విధంగా ఉన్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయం జగన్ కు తెలియదా? ముఖ్యమంత్రిగా పని చేసిన మీరే ఇలా మాట్లాడితే... పబ్లిక్ లో అందరూ ఏమనుకుంటారనే దాన్ని మీరే ఆలోచించాలి. తన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నా" అని చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.