Jump to content

****** JAGAN ANNA $UCKS..... **************************************


kingmakers

Recommended Posts

[size=24pt]కాంగ్రెస్‌ పార్టీతో సయోధ్యకు జగన్‌ ప్రయత్ని స్తున్నారా? వారిద్దరూ ఇప్పటికే ఒక అవగా హనతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారా? కేసులు, బెదిరింపులకు జగన్‌ తాళలేక అధిష్ఠానానికి సరెండర్‌ కానున్నారా? ఆ మేరకు జగన్‌ మరికొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్‌ గూటిలో ఒదిగిపోనున్నారా? ప్రస్తుతం జగన్‌ ఓదార్పు పర్యటనలు భవిష్యత్తులో కోస్తాలో టీడీపీని ఎదగ నీయకుండా చేస్తున్న ఎత్తుగడలో భాగమా? జగన్‌-కాంగ్రెస్‌ పార్టీ మధ్య సయోధ్య కుదురుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి జగన్‌పై హటాత్తుగా ఎదురుదాడి తీవ్రత పెంచారా? ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జ గన్‌ పార్టీ పెడతారా? లేక పార్టీ స్థాపించి, శరద్‌పవార్‌ మాదిరిగా కాంగ్రెస్‌తో కలసి పని చేస్తారా?...జగన్‌కు అత్యం సన్నిహితుడయిన అనకా పల్లి కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తాజాగా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఈ అను మానాలకు తెరలేచింది.

కాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో సయోధ్య కుదుర్చుకునే వాతా వరణం ఉండగా, దానిని చెడగొట్టేందుకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న సబ్బం హరి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో సంచలనానికి, సరికొత్త చర్చకు దారితీశాయి. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్న సమయంలో సీఎం వ్యాఖ్యలు సరైనవి కావని సబ్బం హరి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ పక్కనే ఉంటూ ఆయనకు గట్టి మద్దతుదారుగా వ్యవహరిస్తున్న సబ్బం హరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తేలిగ్గా కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ ఎత్తుగడలు, ఆలోచనల్లో భాగస్వామి అయిన సబ్బం హరి, ఎలాంటి దాపరికం లేకుండాకాంగ్రెస్‌ పార్టీ జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యల్లో నిజం ఉండి తీరుతుందని పార్టీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

అయితే, కాంగ్రెస్‌ జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందన్న దానికన్నా జగనే కాంగ్రెస్‌కు సరెండరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవలసి ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్నారు.జగన్‌ కూడా సయోధ్యకు సుముఖంగానే ఉన్నారన్న భావన సబ్బం మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌- కాంగ్రెస్‌ సయోధ్య ప్రయత్నాలు జరుగుతుంటే సీఎం కిరణ్‌ దానిని చెడగొడుతున్నారని జగన్‌ వర్గీయుడయిన సబ్బం చెప్పారంటే.. జగన్‌ కూడా సయోధ్యకు సిద్ధంగానే ఉన్నారన్న వాస్తవం స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ‘ఒక వ్యక్తి తమ మధ్య సయోధ్య కుదురే సమయంలో అవతల వ్యక్తి వచ్చి దానిని చెడగొడుతు న్నారని ఆరోపించారంటే, ఇవతల వ్యక్తికి కూడా ఎదుటివారితో సయోధ్య కుదుర్చు కోవాలన్న కోరిక ఉన్నట్లే లెక్క. లేకపోతే మధ్యలో వచ్చిన వ్యక్తిని చెడగొడుతున్నారంటూ విమర్శించవలసిన పనిలేద’ని ఒక సీనియర్‌ నేత విశ్లేషించారు. ఒకరకంగా సబ్బం వ్యాఖ్యలు ఆయన ఆవేదన, ఆందోళనను సూచిస్తున్నాయంటున్నారు.

జగన్‌కు సంబంధించిన ఆస్తులు, అనుచరులపై కేసులు, ఆయనకు సన్నిహితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీ గనులు సీజ్‌ చేయాలన్న సిఫార్సులు, తాజాగా సాక్షి పెట్టుబడులపై హైకోర్టు నోటీసుల వ్యవహారం అంతా జగన్‌ను లొంగదీసుకునే రాజకీయ ఎత్తగడగానే భావిస్తున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ పెడితే ఇంకా తనపై, తన మద్దతుదారులపై వేధింపులు పెరుగుతాయన్న ఆందోళన జగన్‌లో లేకపోలేదంటు న్నారు. రాజశేఖరరెడ్డి మాదిరిగా వాటిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి, నేర్పు, వ్యూహం జగన్‌కు లేనందున, అధిష్ఠానంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని జగన్‌ ఇప్పటికే గ్రహించారని చెబుతున్నారు.

ప్రధానంగా.. వ్యాపారస్తుడైన జగన్‌ కేంద్రంతో శత్రుత్వం తెచ్చుకుని ఆర్థికంగా నష్టపోవడానికి సిద్ధపడరని ఆయన అనుచరులు సైతం చెబుతున్నారు. తన సంపదను రక్షించుకునేందుకయినా ఆయన కాంగ్రెస్‌తో సయోధ్య కుదుర్చుకోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్‌తో సయోధ్య వాతావార ణాన్ని కిరణ్‌ చెడగొడుతున్నా రని సబ్బం చేసిన వ్యాఖ్యను బట్టి.. జగన్‌ కాంగ్రెస్‌తో రాజీకి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతూనే ఉంది. అటు మంత్రి శంకర్‌రావు కూడా జగన్‌ మళ్లీ కాంగ్రెస్‌ తలుపు తడతారని జోస్యం చెప్పారు. చిన్నాయన వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా జగన్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వీటిని కొట్టిపారేసే అంశాలు కావంటున్నారు.

అయితే, నిజంగా కాంగ్రెస్‌తో సయోధ్య వాతావరణం ఉంటే మరి జగన్‌ పార్టీ పెడతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే మన పార్టీ వస్తోందని, మూడేళ్లు కష్టపడితే ఆ తర్వాత సుఖపడవచ్చని జగన్‌ స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాననీ ప్ర టించారు. ఫిబ్రవరిలో పార్టీ పెడతారంటూ ఎంపీ మేకపాటి, అంబటి రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాల్లో ఓదార్పు యాత్రలు, ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఇప్పటికే కోట్లాది రూపాయలు కుమ్మరించారన్న ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్‌తో సయోధ్య కుదిరితే జగన్‌ పార్టీ స్థాపన యత్నాన్ని విరమించుకుంటారా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

జగన్‌ మనస్తత్వం తెలిసిన ఆయన వర్గీయులు మాత్రం జగన్‌ రాజకీయ పార్టీ స్థాపించడం ఖాయమని, చెప్పింది చేయడం ఆయన నైజమని గుర్తు చేస్తున్నారు. అయితే, పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయి, మహారాష్టల్రో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మాదిరిగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అవకాశాలుంటాయని వివరిస్తున్నాయి. ఆలోగా, కోస్తాలో తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకు జగన్‌ ప్రయత్నించవచ్చని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌-జగన్‌ పార్టీ కలసి పనిచేసినా ఆశ్చర్యపడవలసిన అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆ విధంగా జరిగినా జగన్‌ కాంగ్రెస్‌కు సరెండర్‌ అయినట్లేనని స్పష్టం చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. జగన్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్య వాతావరణం మొదలయిందన్న వాస్తవం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సైతం తెలుసనని సబ్బం హరి వ్యాఖ్యలో స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రణబ్‌-ఆంటోనీ-మొయిలీని తరచూ కలుస్తున్న సబ్బం హరి ఇలాంటి వ్యాఖ్యలు ఊరకనే చేసి ఉండరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఆ విషయం ముఖ్యమంత్రికి సైతం తెలుసునని హరి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ హటాత్తుగా జగన్‌పై ఎదురుదాడి చేయడం, జగన్‌ను నైతికంగా-మానసికంగా దెబ్బతీసే ప్రకటనలు చేస్తుండటంతో సయోధ్య వాతావరణం దెబ్బతింటోందని సబ్బం ఆందోళన చెందుతున్నట్లు ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

కిరణ్‌ హటాత్తుగా జగన్‌పై ఎదురుదాడి చేస్తుండటంతో సయోధ్య వాతావరణం చెడి పోయి జగన్‌ ఎక్కడ కాంగ్రెస్‌కు కాకుండా పోతారేమోనన్న భయాందోళన హరి మాట ల్లో కనిపిస్తోంది. జగన్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయం గా సబ్బంహరి ప్రకటించినందున, దానిని నిజమని భావించక తప్పదంటున్నారు. హరి మాటలు నిజమయితే.. జగన్‌ను తిరిగి పార్టీలోకి రాకుండా కిరణ్‌ అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారని భావించవలసి వస్తోంది.

జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే అది తన భవితవ్యానికే ప్రమాదమన్న ముందు జాగ్రత్తతోనే కిరణ్‌ జగన్‌పై మాటల దాడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జగన్‌ పార్టీ గడప తొక్కితే తన పదవికే ఎసరు వస్తుందని కిరణ్‌ భావించడం సహజమంటున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎప్పుడూ జగన్‌ ప్రస్తావన తీసుకురాని కిరణ్‌, హటాత్తుగా తన ఢిల్లీ పర్యటన నుంచి మాటల దాడి ప్రారంభించారంటే.. జగన్‌ను మళ్లీ పార్టీ గడపతొక్కకుండా చేసే వ్యూహంలో భాగమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్‌కు, కాంగ్రెస్‌ పార్టీకిమధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతుండగా వాటిని చెడగొట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జగన్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఆయన నోరు పారేసుకుంటే చరిత్ర విప్పాల్సి ఉంటుంది[/size]

Link to comment
Share on other sites

[quote author=vyshali....... link=topic=147457.msg1702997#msg1702997 date=1296001524]
source please............
[/quote][url=http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=14378]http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=14378[/url]

Link to comment
Share on other sites

[quote author=vyshali....... link=topic=147457.msg1702997#msg1702997 date=1296001524]
source please............
[/quote]

[url=http://andhrafriends.com/index.php?topic=147457.0#lastPost]http://andhrafriends.com/index.php?topic=147457.0#lastPost[/url]

Link to comment
Share on other sites

[quote author=vyshali....... link=topic=147457.msg1702997#msg1702997 date=1296001524]
source please............
[/quote]madhyanam nenu TV9 lo kuda cheppadu vyshu...nenu live chusanu....but idi anta anukovatame...nijam ento teliyadu  sHa_fr1ends

Link to comment
Share on other sites

[quote author=Emperor link=topic=147457.msg1703002#msg1703002 date=1296001570]
[url=http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=14378]http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=14378[/url]
[/quote]

idem paper........eenadu, sakshi, bhoomi and jyothi chusa but ideppudu chudaledu.........kotha ga start ayyenda..........

Link to comment
Share on other sites

[quote author=vyshali....... link=topic=147457.msg1703058#msg1703058 date=1296002031]
idem paper........eenadu, sakshi, bhoomi and jyothi chusa but ideppudu chudaledu.........kotha ga start ayyenda..........
[/quote]idi kuda eppati nundo undi...dini owner last time TDP tarupuna anakapalli lo MP ga try chesi odipoyadu  sHa_high5ing sHa_high5ing

Link to comment
Share on other sites

[quote author=BEZAWADA ROWDY link=topic=147457.msg1703073#msg1703073 date=1296002148]
idi kuda eppati nundo undi...dini owner last time TDP tarupuna anakapalli lo MP ga try chesi odipoyadu  sHa_high5ing sHa_high5ing
[/quote]

TDP antye ee matram verripook news undadam lo tappu ledu..  @3$% @3$%

Link to comment
Share on other sites

×
×
  • Create New...