Guest jestges Posted November 29, 2009 Report Share Posted November 29, 2009 కోరిక "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని. "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి. "ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా. ++++++++++++++ చిరుత ... ఆ తరువాత చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు? బుడత - బాలకృష్ణ తనయ ఉడత - వెంకటేష్ తనయ మిడత - మోహన్ బాబు తనయ పిచుక - పవన్ కళ్యాణ్ తనయ +++++++++++++ నిద్ర పోయేముందు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు. "రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు. "ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.." +++++++++++++++ చెక్కు "రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్. "ఎందుకండీ?" అన్నాడు చంద్రం. "ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్. "మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం. ++++++++++++ తొందరగా డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్. "మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్. "డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్. ++++++++++++++ సాంప్రదాయం అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి. "చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది. "ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి. ++++++++ ప్రేమ "రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..." చెబుతున్నాడు చింతామణి. "అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు భూషణం. "మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా" - అసలు విషయం చెప్పాడు చింతామణి Source : http://forums.duckyvideos.com/yetanotherforum/default.aspx?g=posts&t=83 Quote Link to comment Share on other sites More sharing options...
RAKSHASHUDU Posted November 29, 2009 Report Share Posted November 29, 2009 # # # # # # hammernd hammernd hammernd warningnf warningnf warningnf Quote Link to comment Share on other sites More sharing options...
perk Posted November 29, 2009 Report Share Posted November 29, 2009 *=: Quote Link to comment Share on other sites More sharing options...
supreme Posted November 29, 2009 Report Share Posted November 29, 2009 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.