Jump to content

రుద్రాక్షలు- మోసాలు


SureshPaul

Recommended Posts

[color=#3333FF][font=Gauthami][size=4]
[size=6]భా[/size]రతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉపనిషత్తులది చాలా ప్రత్యేకత. వేదములకు చివరి భాగమవటం వలన వీనినే వేదాంతం అంటారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచములో మనకు ఎప్పుడూ వినిపించేది "ప్రస్థానత్రయం" అనే పేరు. బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు ఈ మూడు భగవత్తత్వము వివరిస్తూ ఎక్కడికో చెబుతాయి. ఈమూడు ఆధాత్మికత గురించి తెలుసుకోవాలనే భావం, నిజాయితీగా వుండే వారికి మూలగ్రంధాలు. ఇక ఇతిహాస, పురాణాలు, కావ్యాలు అన్నీ వీటి తరువాతనే. కావ్యాలు, పురాణాలు మానవుడికి ధర్మాన్ని వివరించే కథలే కానీ నిజమైన చరిత్రలు కావనే వాదన వుంది. ఎందుకంటే పరమాత్మ నిర్గుణము, నిరంజనము, అవ్యక్తమూ, నిత్యమూ చెప్పే ప్రస్థానత్రయానికి భిన్నముగా పురాణాలు, కావ్యాలు మూర్తి ఆరాధనకు ప్రాధాన్యమిస్తుంటాయి. ప్రస్థానత్రయం మోక్ష సాధనే మానవ పరమావధి. అంటే పురాణ, కావ్యాలు, పుణ్యము, స్వర్గము, ఇహపరసుఖాలు అంటూ విస్తారంగా చెబుతాయి. ఇందుకోసం సాటిమనిషిని, మనిషే బలిపశువుని చేసి వికృతమైన ఆనందాన్ని పొందే మార్గం వైపు పయనింపచేస్తాయి. అయినా ఫరవాలేదు భగవంతుడు వచ్చి, అంతిమ రక్షణ కలిగిస్తాడు అంటూ మానవ జాతిని నిర్వీర్యపధం వైపు పయనింపచేస్తాయి. పేదరికం అంటే ఆహారలేమి, భద్రతాలేమి, ఏ పని చేసినా కడుపే సరిగా నిండక దరిద్రంలో నలిగిపోతున్న మనిషిని, భయం వద్దు, నీ కోసం నేను జపం చేస్తాను, మూల్యం ఇవ్వు, కష్టాలన్నీ తీరుతాయి, అంటూ ఉన్న గోచీని కూడా లాక్కుని వికృతంగా ఆనందించే వాళ్ళను తయారుచేసే కర్మాగారాలు. అందుకే వైదికులు అంటే వేదాన్ని విశ్వశించేవారు, పురాణాలు వ్యతిరేకించినా కాలక్రమంలో రాజీపడిపోయారు. పురాణదేవతలకు, వైదికదేవతలకు "అస్సలు పొంతనకుదరదు" ఒకప్రక్క ఇలావుంటే మరోప్రక్క విషయమూ, వస్తవునూ వ్యాపారంగా మార్చే ప్రక్రియ కొద్దికాలంగా మరింత పెరిగిపోయింది. వీళ్ళకు భగవంతుడంటే ఏ మాత్రము నమ్మకం లేదు. అందుకే దేవుళ్ళను అమ్మేస్తున్నారు. నా యంత్రం పెట్టుకోండి లక్షాధికారి అవండి. ఫలాన రాయిపెట్టుకోండి మీ కష్టాలుపోయి లక్షాధికారి అవండి. మర్చిపోకండి మా దగ్గర మాత్రమే దేవతలు అమ్మకానికి వున్నారు. మేము దేవతల అమ్మకానికి గుత్తాధిపత్యం కలిగివున్నాము. మీ కోసం అతి తక్కువ ధరకు వీరిని అమ్మేస్తాం. కొనండి బాబు కొనండి అంటూ లక్షల రూపాయలు, ఖర్చుచేసి, వివిధ మాధ్యమికాలలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అటువంటి ప్రకటనలలో రుద్రాక్షలు ఒకటి. "మా వద్ద ఏకముఖి రుద్రాక్షను మాలగా చేసి మీ సౌలభ్యం కోసం అమ్మకానికి పెట్టాము.ధరించారో సర్వసంపదలు మీ వద్దకు నడిచి వస్తాయి. ఇందులో ఫలానా అతను నిష్ణాతుడు, నేపాల్ దేశం రుద్రాక్షల కోసం సంప్రదించండి, కొనండి అంటూ" వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ, కొన్నవాడేమోకాని అమ్మినవాడు లక్షాధికారి అవుతున్నాడు. రండి ! ఇందులో నిజానిజాలేమిటో చూద్దాము.

మొదటే చెప్పినట్లుగా ఉపనిషత్తుల్లో రుద్రాక్షల గురించి ఏమైనా వున్నదా? మనకు లభిస్తున్న 108 ఉపనిషత్తుల్లో "రుద్రాక్షజాబాలోపనిషత్తు" అనేది ఒకటుంది.అందులో భూషుడు అనే రుషి ఒకప్పుడు కాలాగ్నిరుద్రుడిని అడిగాడు. రుద్రాక్షలు ఎలా పుట్టాయి? వాటిని ధరించడం వల్ల వచ్చు ఫలమేమి?.

"ఒకప్పుడు త్రిపురరాక్షస సంహారమప్పుడు నేను కండ్లుమూసుకుని సమాధిస్థితిలో వున్నాను. అప్పుడు నా కళ్ళనుండి నీటి బిందువులు రాలి నేలపైబడి రుద్రాక్షలయ్యాయి" అని భగవంతుడైన కాలరుద్రుడు చెప్పాడు మరియు మానవులను వుద్దరించుటకై అవి స్థావరములై, వృక్షములుగా నిలిచాయి. వీటిని ధరించడం వలన, పగలు రాత్రులలో భక్తులు చేసే పాపాలు నశిస్తాయి [భక్తి అంటే భగవంతుడు చెప్పిన మార్గాన నడవడం] అలా నడిచేప్పుడు కూడా ఒక్కోసారి చేయవలసినది చేయకపోవటం, చేయకూడనిది చేయటం అనేవి తెలిసీ తెలియక జరిగితే వాటి వలన వచ్చే పాపం అని అర్థం. వీటిని చూడటం వలన, తాకటం వలన వచ్చే ఫలితం కంటే ధరించడం వలన కోటి ఫలం వుంటుంది. ఉసిరికాయంత పరిమాణమున్నది శ్రేష్టమని చెప్పబడింది. రేగుకాయంతది మధ్యము, శనగలంత పరిమాణము కలది అధమము. మంగళ కరమయిన రుద్రాక్షలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రమనే నాలుగు ఛాయలుగా వుంటాయి.

తెల్లని రుద్రాక్షలు బ్రాహ్మణ వర్గము, ఎర్రనివి క్షత్రియవర్గము, పసుపు రంగువి వైశ్యవర్గము, నల్లనివి శూద్రవర్గమునకు చెందినవి. సరయినవి అనగా గుండ్రముగా, బలముగా, పెద్దవిగా, లావుగా, ప్రకాశముగా, ముళ్ళుముళ్ళుగా వున్నవి శుభమయినవిగా చెప్పబడును. పురుగులు తిన్నవి, పగిలి ముక్కలుగా వున్నవాటిని, ముళ్ళులేనివాటిని, రంధ్రములు కలిగినవి, చూడటానికే బాగాలేనివి అనే ఆరు లక్షణాలు కలిగినవి వదిలి వేయాలి. వాటికవే పైకి క్రిందకూ రంధ్రం కలిగి వున్నవి ఉత్తమ, రంధ్రము వేయవలసినవి మధ్యమము, ఒకదానికొకటి చూడముచ్చటగా వున్నవి బలమయినవీ, లావుగా వున్న రుద్రాక్షలను పట్టుదారంతో ధరించవలెను. అవి అన్నీ ఒకే విధముగా వుండవలెను. పదునుపెట్టే రాయి సానమీద గీస్తే బంగారము రంగు వచ్చేదానిని శివభక్తులు ధరించాలి. శిఖయందు ఒకటి, తలమీద దారముతో గుచ్చి మూడు, మెడలో 36, రెండు భుజముల యందు 16,మణికట్టు వద్ద 12 , భుజాల మీద 15, రుద్రాక్షలు ధరించవలెను. 108 రుద్రాక్షలను మాలగా చేసి జ్యందము వలె ధరించవలెను. రెండు లేదా మూడు, ఐదు లేదా ఏడు వరుసలుగా కంఠ ప్రదేశము నందు ధరించవలెను. ముఖము మీద చెవులకు కూడ ధరించవలెను. మోచేతుల వద్ద, నాభిస్తానము వద్ద అంటే నడుముకు విశేషంగా దారముతో గుచ్చి ధరించవలెను.

నిద్రలో, మెలుకువలో ఎప్పుడూ రుద్రాక్షలు ధరించవలెను. 300 రుద్రాక్షలధారిణి అధమము, 500 మధ్యమము, 1000 రుద్రాక్షలు ఉత్తమమని చెప్పబడినది. వీటికి పాణ ప్రతిష్ట చేసి మూలమంత్రముతో అభిమంత్రించి 3, 5, లేక 7 మాలలు ధరించవలెను. ఒక ముఖ రుద్రాక్ష పరమాత్మ స్వరూపము. దీనిని ధరించినవారు ఇంద్రియములను వశమందుంచుకొని పరమాత్మలో అంతిమంగా లీనమవుతాడు. అంటే ఇంద్రియభోగాలకు దూరంగా, ఇంద్రియములను తన వశమందుంచుకొనుట అనగా ఈ లోకంలో వుండే మానవుడి మోక్షమార్గానికి అవరోధమయిన భౌతిక సుఖాల లాలస నుండి దూరంగా వుండాలనుకునే వారు ధరింపవలనినది. అంతేకాని ఇది ధరిస్తే మానవుడి అన్ని కోరికలు తీరి ధనవంతులు అవుతారనేది ఒక పెద్ద అబద్ధం.

2 ముఖాలు అర్ధనారీశ్వర తత్వమై ధరించినవారిని సర్వదా అర్ధనారీశ్వరునికి ప్రీతి పాత్ర పాత్రమవుతారు. 3 ముఖాల రుద్రాక్ష 3 అగ్నుల స్వరూపమై ధరించిన వారియందు తన ప్రసన్నతను చూపును. 4 ముఖాల రుద్రాక్ష చతుర్ముఖ బ్రహ్మసమానమై సృష్టికర్త ప్రసాదం లభిస్తుంది. 5 ముఖాల రుద్రాక్ష పంచముఖ శివస్వరూపమై ఎల్లప్పుడూ హత్యాదోషము వంటి మహా పాపముల నుండి రక్షిస్తుంది. 6 ముఖముల రుద్రాక్ష కార్తికేయ స్వరూపమై మహాలక్ష్మి ప్రసన్నతను పొందుతారు. అందువలన ఆరోగ్యము, సౌందర్యము పొందుతారు. విద్వాంసులు దీనిని గణేష స్వరూపముగా భావించి బుద్ధి, విద్య, లక్ష్మీవృద్ధి లభిస్తుంది. 7 ముఖాల రుద్రాక్ష ఏడు లోకముల తల్లులయిన సప్తమాతృకా స్వరూపమై ధరించిన వారికి, ఆరోగ్యము, వైభోగ్యము కలుగుతాయి. పవిత్రమైన జీవనం గడిపే వారికి గొప్ప అనుభూతి కలుగుతుంది. 8 ముఖముల రుద్రాక్షలు అష్ట వసువుల ప్రియమైనందున ధరించినవారికి గంగాదేవి అనుగ్రహిస్తుంది. అంతేకాక మూడు స్వరూపముల ప్రసన్నత లభిస్తుంది. 9 మఖముల రుద్రాక్షలు తొమ్మిది శక్తుల దేవతామూర్తియై, ధరించినవారి యందు తొమ్మిది శక్తుల ప్రసన్నమగును. 10 ముఖముల రుద్రాక్ష యమసమానమై, చూడటం వలన శాంతి కలుగుతుంది. ధరించడం వలన మహా శాంతి లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. 11 ముఖముల రుద్రాక్ష ఏకాదశ రుద్రసమానమై ధరించినవారికి ఎల్లప్పుడూ సౌభాగ్యము పెంపొందించునదై ఉండును. 12 ముఖముల రుద్రాక్ష మహావిష్ణు స్వరూపమై, 12 మంది ఆచార్యుల సమానమై, వీరి ఉపాసకులకు మరింత ఉపయోగపడుతుంది. 13 ముఖముల రుద్రాక్ష సిద్ధిప్రదాతయై మన్మధుడి ప్రసన్నతను లభింపజేస్తుంది. 14 ముఖముల రుద్రాక్ష అయితే సమస్త రోగాలను పోగొట్టి పరమ ఆరోగ్య ప్రదాయి అవుతుంది.

ఇంతేకాక ఇంకా అనేకముఖముల రుద్రాక్షలు వున్నాయని శాస్త్రముల ద్వారా తెలుస్తోంది. రావణునిచే రచించబడిన ఒకానొక గ్రంథములో 108 ముఖముల రుద్రాక్ష కూడా వున్నట్లు వున్నది.రుద్రాక్షలను ధరించడానికి వివిధ మంత్రప్రయోగాలు చెప్పబడ్దాయి. భస్మము, రుద్రాక్షధారణ, శ్రీశివ పంచాక్షరీ మంత్ర జపము అనే మూడు విడదీయరాని బంధం కలిగి వుంటాయి. వీటిని ధరించిన వారి కోర్కెలు తీరాలంటే ఆహారవిషయంలో పాటించాల్సిన నియమాలు చూద్దాం. సారాయి, మాంసము, వెల్లుల్లి, నీరుల్లి వంటి పధార్దాలు వదిలివేయాలి. శాకాహారంలో కూడా కొన్ని కూరలు వదలవలిసి వుంటుంది [ములగ, విరిగ, వాంగ్వరాహము]. గ్రహణకాలమందు, విషువమందు [సూర్యోదయా సమయములు సమముగా వుండు రోజు. ఇది సంవత్సరములో రెండుసార్లు వస్తుంది. తులా, మేష సంక్రమణములు]. ఆయనములు మార్పు చెందేరోజు, అమావాస్యా, పూర్ణిమా దినములలో రుద్రాక్షలు ధరించాలి.

ఇక రుద్రాక్షలను అక్షమాల [అనగా జపమాల] గా ఉపయోగించాలనుకునే వారికి, ముందు చేయవలసిన కార్యక్రమము చాలానే వున్నది.భగవంతుడు నిర్దేశించిన మార్గములో నడవ వలిసి వుంది. అంతేకాని అవి గొప్పవి కనుక ధరించి మనం ఏం చేసినా సరిపొతుంది అనుకుంటే కుదరదు. నిజాయితిగా వుండిన రుద్రాక్షధారిక ఉపయోగమని చెప్పబడింది. అది లేనివారు ధరించడం నిరుపయోగమని తెలుసుకోవడం మంచిది. శ్రీ శివమహా పురాణంలోని విద్వేశ్వర సంహితలో కూడా దాదాపు ఇవే విషయాలు కనిపిస్తాయి. అనేక చోట్ల రుద్రాక్షవృక్షములు వున్నట్లు వుంది. కాని ఫలానిచోట లభించేవి గొప్పవి అనేది "వ్యాపారపురాణం".తమ లాభం కోసం వ్యాపారులు చేస్తున్న మోసంలో పడి డబ్బు వృధా చేసుకోవడం మానాలి.

ఇక ప్రస్తుతం ప్రచారంలో వున్న ఏకముఖి గురించి.

నిజానికి ఇది రుద్రాక్ష ఏం కాదు. రూపాయి విలువ కూడా చేయని భద్రాక్ష. వీటిని గురించి వృక్షశాస్త్రము చదువుకున్నవారు, పీఠాధిపతులుగా వుండేవారు ప్రజలకు చెప్పవలసిన పని వున్నది. పత్రికలు ప్రచార మాధ్యమాలు. డబ్బుకోసం నీతిని వీడి చేస్తున్న మాయ నుండి, అమాయక ప్రజలను రక్షింపవలసిన అవసరం వుందని ఈ వ్యాసం ముందుకు తెస్తున్నాము. ఆయుర్వేధంలో రుద్రాక్ష ఉపయోగం వున్నది. ఆయుర్వేద వైద్యులు కూడా నిజానిజాలు చెప్పాలని మా మనవి. ఈ విషయాలను మీకు తెలిసిన మీ దగ్గరివారికి చెప్పండి. అనవసరంగా డబ్బు పారేసుకోవడం కంటే నిర్భాగ్యులైన వారి జీవితాలను వెలిగించడం కోసం వెచ్చించండి. రుద్రాక్షలు ధరించినవారికంటే భగవంతుని ఆశీర్వాదం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆధ్యాత్మిక వాక్కు.[/size][/font][/color]



Sourc From : [url="http://www.manatelugunela.com/"]http://www.manatelugunela.com[/url]

Link to comment
Share on other sites

×
×
  • Create New...